Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

చౌటుప్పల్ కు సమీపంలో బస్సును ఢీకొట్టిన టిప్పర్.. అదే చోట మరో బస్సును ఢీకొట్టిన లారీ!

చౌటుప్పల్ కు సమీపంలో బస్సును ఢీకొట్టిన టిప్పర్.. అదే చోట మరో బస్సును ఢీకొట్టిన లారీ

  • -15 మందికి గాయాలు
  • -చౌటుప్పల్ లక్కారం వద్ద ప్రమాదం
  • -రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జాం

హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై ఇవాళ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ కు సమీపంలోని లక్కారం వద్ద కాకినాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ట్రావెల్స్ బస్సును మరో రూట్ లో వెళ్తున్న టిప్పర్.. డివైడర్ ను దాటొచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 15 మంది గాయపడ్డారు. టిప్పర్, బస్సు డ్రైవర్లకు తీవ్రగాయాలయ్యాయి.

అందరినీ చికిత్స నిమిత్తం చౌటుప్పల్ లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం జరిగిన చోటే మరో ప్రమాదం సంభవించింది. ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ కు గాయాలయ్యాయి. రెండు ప్రమాదాలతో జాతీయ రహదారిపై రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది.

Related posts

సికింద్రాబాద్​ విధ్వంసం సూత్రధారి సుబ్బారావు అరెస్ట్…!

Drukpadam

జార్ఖండ్‌ అడ‌వుల్లో తుపాకుల మోత…ఒక జవాన్ మృతి …మరొకరికి సీరియస్….

Ram Narayana

ష‌ర్మిల బృందంపై చెప్పులు విసిరిన టీఆర్ఎస్ శ్రేణులు!

Drukpadam

Leave a Comment