తమ విడాకుల వార్త పై తీవ్రగా స్పందించిన నాగచైతన్య… ఉత్తి గాసిప్స్ అంటూ కొట్టిపారేసిన వైనం!
–ఇలాంటి వార్తలు ఎలా రాస్తారని ఆవేదన
– ప్రజలు వార్తల్లో నిజాలని గుర్తుంచుకుంటారు
–గాసిప్స్ గురించి పట్టించుకోవడంలేదు
–చై, సామ్ ల కాపురంపై కథనాలు
–విడాకులకు దరఖాస్తు చేశారంటూ ప్రచారం
-300 కోట్ల భరణం అంటూ వార్తలు
–మొదట్లో కొద్దిగా బాధపడ్డానన్న నాగచైతన్య
–ఇప్పుడసలు పట్టించుకోవడంలేదని వెల్లడి
ఇటీవల అక్కినేని కుటుంబంలో నాగచైతన్య,సమంతలు విడిపోయారని , వారు డైవర్స్ కు అప్లై చేసుకున్నారని ,సమంతకు భరణం కింద 300 కోట్ల రూపాయలు ఇవ్వనున్నారని అందుకే ఆమె తన పేరు నుంచి అక్కినేని అని పేరు తొలగించుకున్నారని వివిధ మాధ్యమాల్లో వార్తలు హల్చల్ చేశాయి. దీనిపై ఇటు చేతు గని , అటు సామ్ గాని స్పందించలేదు. చివరకు నాగార్జున నుంచి కూడా ఎలాంటి స్పందన లేదు పైగా సమంత చేతు లేకుండానే పుణ్యక్షేత్రాల దర్శనాలు చేశారు. అక్కడ మీడియా వాళ్ళు వస్తున్నా వార్తల పై క్లారిటీ అడిగితె సీరియస్ అయ్యారు. దీంతో డైవర్స్ వార్తలు నిజమే అని రీతిలో ఆమె మాటలు ఉన్నాయనే అభిప్రాయాలను కలిగించారు. దీనిపై సినీ ఇండస్ట్రీలో కూడా చర్చలు జరుగుతున్నాయి. అయితే అవి గాసిప్స్ కూడా అయి ఉండవచ్చనే అభిప్రాయాలూ ఉన్నాయి. మొదట వార్త వచ్చినరోజునే స్పందించి ఉంటె ఇంత ప్రచారం జరిగి ఉండేదికాదు . ఏమైనా చేతు గాసిప్స్ అని కొట్టి పారేయడం వారిఅభిమానులకు పండుగ లాంటి వార్తే మరి …..
కానీ వివిధమద్యమాల్లో వచ్చిన కథనాలు …..నాగచైతన్య, సమంతల కాపురంలో విభేదాలు ఏర్పడ్డాయని, వారు కొట్టుకుంటున్నారని ,వారు బజారున పడ్డారని త్వరలోనే విడిపోనున్నారని విపరీతంగా కథనాలు వస్తున్నాయి. ఈ క్రమంలో నాగచైతన్య స్పందించారు. తీవ్రస్థాయిలో వస్తున్న పుకార్లను చూసి మొదట్లో కొద్దిగా బాధపడ్డానని తెలిపారు. ఇలాంటి వార్తలు ఎలా రాస్తారు? అని వేదనకు గురయ్యేవాడ్నని పేర్కొన్నారు.
పాత రోజుల్లో మాస పత్రికలు ఉండేవని, వాటిలో ఓ వార్త రాస్తే నెలంతా అదే ఉండేదని, కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయని, కొద్దిసేపట్లోనే ఒక వార్తను తోసిరాజని మరో వార్త వచ్చేస్తోందని అన్నారు. ప్రజలు కూడా ఎన్ని వార్తలు వచ్చినా నిజాలనే గుర్తుంచుకుంటారన్న విషయం అర్థమైందని, అప్పటినుంచి గాసిప్స్ గురించి పట్టించుకోవడం మానేశానని నాగచైతన్య వెల్లడించారు.
అయితే గాసిప్స్ కోసం తన పేరును వాడుకుంటుండడం బాధాకరమని పేర్కొన్నారు. ప్రతి వ్యక్తికి వృత్తిపరమైన జీవితం, వ్యక్తిగత జీవితం ఉంటాయని నాగచైతన్య అభిప్రాయపడ్డారు. తన తల్లిదండ్రులను గమనించడం ద్వారా వృత్తిని, వ్యక్తిగత జీవితాన్ని విడివిడిగా చూడడం అలవర్చుకున్నానని తెలిపారు. తన తల్లిదండ్రులు తమ పనులు ముగించుకుని వచ్చిన తర్వాత ఇంట్లో బయటి విషయాలు చర్చించుకోరని, వారి నుంచి తాను కూడా అదే దృక్పథాన్ని అలవర్చుకున్నానని చైతూ పేర్కొన్నారు.
నాగచైతన్య హీరోగా నటించిన ‘లవ్ స్టోరీ’ చిత్రం రేపు విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగచైతన్య ఈ వ్యాఖ్యలు చేశారు.