Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

పంజాబ్ కొత్త ముఖ్యమంత్రి ప్రవేట్ జెట్ లో ఢిల్లీ ప్రయాణంపై వివాదం!

పంజాబ్ కొత్త ముఖ్యమంత్రి ప్రవేట్ జెట్ లో ఢిల్లీ ప్రయాణంపై వివాదం
చండీగఢ్ నుంచి ఢిల్లీకి ప్రైవేట్ జెట్ లో ప్రయాణం
సీఎంతో పాటు సిద్ధూ కూడా పయనం
250 కిలోమీటర్ల ప్రయాణానికి ప్రైవేట్ జెట్ అవసరమా? అని విపక్షాల విమర్శలు

పంజాబ్ లోసరికొత్త వివాదానికి తెరలేపారు కొత్త ముఖ్యమంత్రి చరణ్ జీత్ సింగ్ చన్నీ ,ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు నవజోత్ సింగ్ సిద్దు . దీనికి కారణం లేకపోలేదు . వారు ఢిల్లీ లో ఉన్న హైకమాండ్ ని కలిసేందుకు ప్రవేట్ జెట్ లో ఢిల్లీ వెళ్లారు. చండీఘడ్ నుంచి ఢిల్లీ కి కేవలం 250 కీ .మీ దూరం .చండీఘడ్ నుంచి ఢిల్లీ కి బోలెడు విమానాలు ఉన్నాయి. వాటిని కాదని ప్రవేట్ జట్ లో వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందని విపక్షాలు ప్రశ్న ? నిజంగానే కేవలం 250 కి .మీ కోసం ప్రవేట్ జెట్ వాడటంపై దుమారం లేస్తుంది . ఇది ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయడమేనని విమర్శలు వస్తున్నాయి. దీనిపై కాంగ్రెస్ స్పందించాల్సి ఉంది . లేదా పంజాబ్ ప్రభుత్వం స్పందించాలి .

పంజాబ్ కొత్త ముఖ్యమంత్రిగా చరణ్ జిత్ సింగ్ చన్నీ బాధ్యతలను స్వీకరించిన సంగతి తెలిసిందే. మరోవైపు ఆయన చుట్టూ ఒక వివాదం ముసురుకుంది. ఢిల్లీ పర్యటనకు ఆయన ప్రైవేట్ జెట్ విమానంలో వెళ్లడం విమర్శలకు తావిస్తోంది. ఈ విమానంలో ఆయనతో పాటు పీసీసీ చీఫ్ సిద్ధూ, డిప్యూటీ సీఎంలు సుఖ్ జిందర్ సింగ్, ఓపీ సోనీ కూడా ప్రయాణించారు. కేబినెట్ ఏర్పాటుకు సంబంధించి హైకమాండ్ తో అత్యవసర సమావేశం కోసం వారు ఢిల్లీకి వెళ్లారు. విమానం వద్ద వారు తీసుకున్న ఫొటోను సోషల్ మీడియాలో సిద్ధూ షేర్ చేశారు.

ఈ ప్రయాణంపై విపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. కేవలం 250 కిలోమీటర్ల ప్రయాణానికి ప్రైవేట్ జెట్ అవసరమా? అని ప్రశ్నిస్తున్నాయి. చండీగఢ్ నుంచి ఢిల్లీకి వెళ్లడానికి సాధారణ విమానాలు లేవా? అని మండిపడుతున్నాయి. జెట్ విమానాల్లో ప్రయాణిస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని విమర్శిస్తున్నాయి.

Related posts

పోలవరం వద్ద రాజకీయాకార్యక్రమాలకు నో ఎంట్రీ ..,అంబటి

Drukpadam

రాష్ట్ర రాజకీయాల్లో పొత్తుల ఎత్తులు …ఖమ్మం లెక్కలు!

Drukpadam

పవన్, చంద్రబాబు అధికారంలోకి వస్తే ఆక్రమణలపై చర్యలు తీసుకోకుండా ఉంటారా?: సజ్జల

Drukpadam

Leave a Comment