ఆంధ్రప్రదేశ్

ఏపీలో మాజీమంత్రుల ఇళ్లపై కొనసాగుతున్న దాడులు …

ఏపీలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఓటమి అనంతరం మాజీమంత్రులు మాజీ ఎమ్మెల్యేలు ప్రత్యేకించి వైసీపీకి చెందిన నేతల ఇళ్లపై దాడులు జరుగుతున్నాయి…గతంలో కొడాలి నాని , పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇతర నేతల ఇళ్లపై దాడులు జరగ్గా తాజాగా మాజీ మంత్రి జోగి రమేశ్ ఇంటిపై కొందరు యువకులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానిక ఫెర్రీ నుంచి రింగుకూడలికి వెళ్లే మార్గంలో మాజీ మంత్రి నూతన గృహం ఉంది. అయితే, ఆదివారం మధ్యాహ్నం ఆ రహదారిలో కొందరు యువకులు కారులో వచ్చి ఆయన ఇంటిపై రాళ్లు రువ్వారు. ఇది గమనించిన పోలీసు సిబ్బంది ఒకరు వారిని అడ్డుకున్నారు. కాసేపటికి స్థానికులూ రావడంతో యువకులు కారులో పారిపోయారు. ఘటన జరిగిన సమయంలో ఆ నివాసంలో ఎవరూ లేరు. అయితే, జోగి రమేశ్ ఇంటి వద్ద ఇనుప కంచె ఏర్పాటు చేసి సిబ్బందికి విధులు కేటాయించామని ఇబ్రహీంపట్నం సీఐ తెలిపారు. దాడికి పాల్పడ్డ వ్యక్తులను గుర్తించి చర్యలు తీసుకుంటామన్నారు.

Related posts

టీటీడీ ఛైర్మన్ గా నేడు ఆఖరి సమావేశంలో పాల్గొననున్న వైవీ సుబ్బారెడ్డి

Ram Narayana

 జగన్ ఇచ్చిన ఫోన్ నెంబర్ పై సీబీఐ పిటిషన్.. 28న సీబీఐ కోర్టు తీర్పు!

Ram Narayana

సనాతన ధర్మంలో విడాకులు లేవు … మరి పవన్ కల్యాణ్ ఎలా విడాకులు తీసుకున్నాడు ? : సీసీఐ నారాయణ

Ram Narayana