Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

పెట్రోలు ధరలు తగ్గే అవకాశం లేదు: చేతులెత్తేసిన కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి!

పెట్రోలు ధరలు తగ్గే అవకాశం లేదు: చేతులెత్తేసిన కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి!
-రాష్ట్రాలు సుముఖంగా లేవని ఉద్ఘాటన
-పెట్రోల్ ధరలు తగ్గాలని కేంద్రం కూడా కోరుకుంటోంది
-పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ కిందకు తీసుకురావడానికి రాష్ట్రాలు సుముఖంగా లేవు
-లీటర్ పెట్రోల్ ధరలో కేంద్రానికి వస్తున్న వాటా రూ. 32 మాత్రమే

పెట్రోలియం రేట్లు తగ్గుతాయని , వాటిని జీఎస్టీ పరిధిలోకి తెస్తారని అనుకుంటున్నా ప్రజలకు చేదు వార్త చెప్పారు కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పురి …. పెట్రోలియం ఉత్పత్తులమీద పన్నుల విషయంలో జీఎస్టీ పరిధిలోకి తేవాలని కేంద్రం చేస్తున్న ప్రతిపాదనలను రాష్ట్రాలు తిరస్కరిస్తున్నాయని ఆయన నెపాన్ని రాష్ట్రాలమీదకు తోసి తప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. పెట్రోల్ ,డీజిల్ రేట్ల తగ్గుదల మా భాద్యత కాదు రాష్ట్రాలు ఒప్పుకోవ్ల్సిందే అని కేంద్ర మంత్రి చేతులెత్తేశారు.ఇది గత కొంత కాలంగా కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు దోబుచులాడుతూ ప్రజలను మోసం చేస్తున్నాయనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. పెట్రోల్ ,డీజిల్ అసలు రెట్లకన్నా , పన్నులతోనే ప్రజల నెట్టాను భారం మోపుతున్నారు. దీంతో ప్రజల్లో పాలకుల పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతుంది. కానీ కేంద్ర మంత్రి మాటలు ఈ విధంగా ఉన్నాయి. ….

పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ కిందకు తీసుకురావడానికి రాష్ట్రాలు సుముఖంగా లేవని… అందువల్ల పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశాలు లేవని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి అన్నారు. పెట్రోల్ ధరలు తగ్గాలని కేంద్ర ప్రభుత్వం కూడా కోరుకుంటోందని… కానీ రాష్ట్రాల తీరు వల్ల ధరలు తగ్గే అవకాశం లేదని చెప్పారు. ఇంధన ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తెచ్చేందుకు రాష్ట్రాలు ఒప్పుకోవడం లేదని అన్నారు. లీటర్ పెట్రోల్ ధరలో కేంద్రానికి వస్తున్న వాటా రూ. 32 అని తెలిపారు.

అంతర్జాతీయ మార్కెట్లో బ్యారల్ చమురు ధర 19 డాలర్లుగా ఉన్నప్పుడు రూ. 32 పన్ను వసూలు చేశామని… ఇప్పుడు బ్యారెల్ ధర 75 డాలర్లుగా ఉన్నప్పుడు కూడా అంతే వసూలు చేస్తున్నామని చెప్పారు. కోల్ కతాలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Related posts

భారత వ్యతిరేక నిరసనలపై కేంద్రం సీరియస్.. కెనడా హై కమిషనర్ కు సమన్లు!

Drukpadam

దమ్ముంటే వారి పేర్లు బయటపెట్టండి.. జగన్‌కు చంద్రబాబు సవాల్…

Drukpadam

రాష్ట్రాలను నమ్మడం లేదు: కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన కేసీఆర్!

Drukpadam

Leave a Comment