Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆరోగ్యం

రోజూ కొన్ని లవంగాలు నమిలి తింటే ఏమవుతుందో తెలుసా?

  • లవంగాలతో ఎంతో ప్రయోజనం అంటున్న ఆరోగ్య నిపుణులు
  • పంటి నొప్పి, నోటి దుర్వాసన తగ్గిపోతాయని వెల్లడి
  • గుండె జబ్బులు, కేన్సర్లకూ దూరంగా ఉండొచ్చని వివరణ

భారత దేశంలో లవంగాలు, ఇతర మసాలాల వినియోగం ఎక్కువే. అయితే ఇటీవలి కాలంలో మసాలా ఫుడ్స్ కు దూరంగా ఉండటం పెరిగింది. కానీ కొన్ని రకాల మసాలాలతో ఎంతో ప్రయోజనం ఉంటుందని శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు చెప్తున్నారు. అందులోనూ కీలకమైనవి లవంగాలు. చాలా ఘాటుగా, అతి స్వల్పంగా తీపి కూడా ఉన్నట్టు అనిపించే లవంగాలతో చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. రోజూ కొన్ని లవంగాలను నమిలి తినడం వల్ల ఏం ప్రయోజనం ఉంటుందన్నదానిపై నిపుణులు ఏం చెప్తున్నారంటే..

నోటి సమస్యలు, దుర్వాసనకు చెక్..
లవంగాలలో యూజెనాల్ వంటి యాంటీ మైక్రోబియల్ పదార్థాలు ఉంటాయి. అవి బ్యాక్టీరియల్, వైరల్ ఇన్ఫెక్షన్లతో పోరాడుతాయి. రోజూ కొన్ని లవంగాలను నమిలితినడం వల్ల నోటి పరిశుభ్రతకు తోడ్పడుతుందని.. పంటి నొప్పి తగ్గుతుందని నిపుణులు చెప్తున్నారు. చిగుళ్లు కూడా దృఢంగా అవుతాయని వివరిస్తున్నారు. ముఖ్యంగా నోటి దుర్వాసనతో బాధపడేవారికి ఇవి అద్భుత ఔషధంగా పనిచేస్తాయని వివరిస్తున్నారు.

గుండె జబ్బులు, కేన్సర్ కూ దూరం..
లవంగాలలో ఫ్లేవనాయిడ్స్, ఐసోఫ్లావోన్స్ గా పిలిచే యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఇవి శరీరంలో ఫ్రీ ర్యాడికల్స్ ను నియంత్రించి.. ఆరోగ్యకరమైన కణాలు దెబ్బతినకుండా కాపాడుతాయి. గుండె జబ్బులతోపాటు వివిధ రకాల కేన్సర్లను దూరం పెడతాయి.

ఇన్ ఫ్లమేషన్ నుంచి ఉపశమనం
మన శరీరంలో చాలా రకాల ఆరోగ్య సమస్యలకు ఇన్ ఫ్లమేషన్ కారణమవుతుంది. కొన్నిరకాల ఎంజైమ్ లు, సైటోకైన్స్ వంటివి ఇన్ ఫ్లమేషన్ తో ఉత్పత్తి అవుతాయి. లవంగాల్లోని కొన్ని రకాల రసాయన సమ్మేళనాలు ఈ సైటోకైన్స్ ను, ఎంజైమ్ లను నియంత్రిస్తాయి. ముఖ్యంగా ఆర్థరైటిస్ వంటి సమస్యలతో బాధపడేవారికి లవంగాలతో మంచి ఉపశమనం ఉంటుందని వైద్య నిపుణులు చెప్తున్నారు.

గ్యాస్, అజీర్తి సమస్యలకూ చెక్
లవంగాలు మన జీర్ణాశయంలో ఆహారం అరగడానికి కారణమయ్యే ఎంజైమ్ ల ఉత్పత్తిని పెంచుతాయి. తద్వారా అజీర్తి సమస్య తగ్గిపోతుంది. దానికితోడు కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటివి కూడా లవంగాలతో దూరం అవుతాయి.

అలాగని అతిగా వాడితే ఇబ్బందే..
లవంగాలతో ప్రయోజనాలు ఉన్నాయి కదా అని అతిగా వాడటం వల్ల ఇబ్బందులు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా లివర్ సంబంధిత సమస్యలు ఉన్నవారు, రక్తాన్ని పలుచన చేసే మందులు వాడుతున్నవారు మాత్రం లవంగాల విషయంలో కాస్త జాగ్రత్త తీసుకోవాలని చెప్తున్నారు. అయితే ఒకటి రెండు లవంగాలను నమిలితినడం వల్ల సమస్యేమీ ఉండదని వివరిస్తున్నాయి.

Related posts

బరువు తగ్గాలనుకునే వారికి.. జామాకులతో మంచి ఫలితం

Ram Narayana

రోజుకు గుప్పెడు పల్లీలు.. బోలెడన్ని లాభాలు

Ram Narayana

మనిషికి పంది గుండె అమర్చిన వైద్యులు.. వేగంగా కోలుకుంటున్న రోగి

Ram Narayana

Leave a Comment