Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆఫ్ బీట్ వార్తలు

వేప చెట్టుకు మామిడి పండ్లు!

  • భోపాల్ లో కనిపించిన ప్రకృతి వింత
  • సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన మధ్యప్రదేశ్ మంత్రి ప్రహ్లాద్ సింగ్
  • ఆశ్చర్యపోతున్న నెటిజన్లు.. దేవుడి మహిమగా అభివర్ణన

మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో చోటుచేసుకున్న ప్రకృతి వింత అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఆ రాష్ట్ర పంచాయతీ గ్రామీణాభివృద్ధి, కార్మిక శాఖ మంత్రి ప్రహ్లాద్‌ సింగ్‌ పటేల్‌ అధికారిక నివాస ప్రాంగణంలో ఉన్న వేప చెట్టుకు మామిడి పండ్లు వెళ్లాడుతూ కనిపించడం చూపరులను అవాక్కు చేస్తోంది.

దీంతో ఆ చెట్టును మంత్రి స్వయంగా వీడియో తీసి సోషల్ మీడియాతో పంచుకున్నారు. వేప చెట్టుకు మామిడి కాయలు గుత్తులు గుత్తులుగా వేలాడుతుండటం అందులో కనిపించింది. ‘ఇవాళ నేను నా ఇంటి ఆవరణలోని వేప చెట్టును దగ్గరకెళ్లి చూశా. దానికి మామిడి పండ్లు కనిపించడం చూసి నా మనసు పులకించిపోయింది. ప్రతిభ గల ఓ తోటమాలి కొన్నేళ్ల కిందట ఈ ప్రయోగం చేసి ఉంటాడనుకుంటా. కానీ ఇది ఒక అద్భుతం అని చెప్పేందుకు ఏమాత్రం తీసిపోదు’ అని ఆ వీడియో కింద కామెంట్ జత చేశారు. దీంతో ఈ వీడియో ఒక్కసారిగా వైరల్ గా మారింది. 

మంత్రి ప్రహ్లాద్ పటేల్ ఈ సమాచారాన్ని వ్యవసాయ శాస్ర్తవేత్తలకు అందించడంతో వారు వచ్చి వేప చెట్టును పరిశీలించారు. ఈ చెట్టుకు సుమారు 20 నుంచి 25 ఏళ్ల వయసు ఉంటుందని అంచనా వేశారు. వేప చెట్టులో ఓ మామిడి కొమ్మ కూడా ఉందన్నారు. కొన్నిసార్లు మామిడి చెట్ల నుంచి పూత రాలి పక్కన ఉండే చెట్లపై మొక్కలుగా పెరుగుతుంటాయని ప్రతిభా సింగ్ లో వృక్షశాస్త్రజ్ఞుడు చెప్పారు. అయితే ఈ వీడియో చూసిన నెటిజన్లు ఇదంతా దేవుడి మహిమ అంటూ కామెంట్ చేస్తున్నారు. కొందరేమో వేపతో కలిసిన మామిడి అయినందున ఆ పండ్లలో షుగర్ వ్యాధి తగ్గించే ఔషధ గుణాలు ఉంటాయని పేర్కొన్నారు.

Related posts

స్నేహితుడి భార్యతో మస్క్ ఎఫైర్? కూలిన కాపురం

Ram Narayana

పొరపాటున కొన్న టికెట్ కు 26 లక్షల లాటరీ తగిలింది.. అమెరికన్ ను వరించిన అదృష్టం

Ram Narayana

రోజుకు 26 గంటలు.. కొత్తగా చిత్రమైన ప్రతిపాదన!

Ram Narayana

Leave a Comment