Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఖమ్మం వార్తలు

జర్నలిస్టులకు ఉచితంగా హోమియో మందులు పంపిణీ

జర్నలిస్టులకు ఉచితంగా హోమియో మందులు పంపిణీ
ప్రారంభించిన టియూడబ్ల్యూజె(ఐజెయు) రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.రాం నారాయణ
జనరల్ బోగీలు పెంచాలనే కరపత్రాలు ఆవిష్కరణ


జర్నలిస్టులకు ప్రముఖ హోమియో వైద్యులు పరికిపండ్ల అశోక్ ఉచితంగా హోమియో మందులను పంపిణీ చేశారు. ఖమ్మంలోని ప్రెస్‌క్లబ్‌లో టియూడబ్ల్యూజె(ఐజెయు) ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.రాం నారాయణ ప్రారంభించారు. అనంతరం రాం నారాయణ మాట్లాడుతూ జర్నలిస్టులకు ఉచితంగా హోమియో మందులు పంపిణీ చేయడం అభినందనీయువున్నారు. అనంతరం డాక్టర్ పరికిపండ్ల అశోక్ మాట్లాడుతూ వడదెబ్బ తగలకుండా జర్నలిస్టు సోదరులకు ఈ మందులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. రైలులో ఐదు సాధారణ బోగీల సాధన సమితి జాతీయ కన్వీనర్‌గా తాను జనం కోసం జనరల్ బోగీలు కావాలన్న డిమాండ్‌తో కోటి ఉత్తరాల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి మద్దతు తెలపాలని కోరారు. అనంతరం కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం జర్నలిస్టులకు హోమియో మందులను పంపిణీ చేశారు. ఖమ్మం ప్రెస్‌క్లబ్ అధ్యక్షులు మైసా పాపారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో టియూడబ్ల్యూజె(ఐజెయూ) రాష్ట్ర నాయుకులు నర్వనేని వెంకట్రావ్, జిల్లా అధ్యక్షులు వనం వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి ఏనుగు వెంకటేశ్వరరావు, నగర కార్యదర్శి చెరుకుపల్లి శ్రీనివాసరావు, ఖమ్మం ప్రెస్‌క్లబ్ కోశాధికారి నామా పురుషోత్తం, జర్నలిస్టు నాయుకులు మేడి రమేష్, పసుపులేటి సత్యనారాయణ, కళ్యాణ్, మధులత తదితరులు పాల్గొన్నారు.

Related posts

తెలుగుదేశం పార్టీతో నా అనుబంధం ఎవరు వేరు చేయలేనిది …ఎంపీ నామ

Ram Narayana

తుమ్మలను, నన్ను ఓడించేందుకు కేసీఆర్ డబ్బులు పంపిస్తున్నారు: పొంగులేటి ఆరోపణ..

Ram Narayana

మన దగ్గర సహాయం పొందిన వాళ్ళు కూడా ఓట్లు వేయలేదు …మాజీఎమ్మెల్యే కందాల

Ram Narayana

Leave a Comment