Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ప్రమాదాలు ...

గూగుల్ మ్యాప్స్ నమ్ముకొని నీటి ప్రవాహంలోకి కొట్టుకొని పోయిన కారు..

కేరళ రాష్ట్రంలోని కొట్టాయంలో ఓ కారు గూగుల్ మ్యాప్ సహాయంతో వెళ్లి సమీపంలోని నీటి ప్రవాహంలో పడిన ఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్‌కు చెందిన నలుగురు పర్యాటకులు కారులో మున్నార్ నుంచి అలప్పుజకు వెళుతున్నారు. వారు గూగుల్ మ్యాప్స్ సహాయంతో ముందుకు సాగుతున్నారు. శనివారం వేకువజామున 3 గంటల సమయంలో వారి కారు కురుప్పంతర పీర్ బ్రిడ్జి ప్రాంతంలో నీటి ప్రవాహంలో పడిపోయింది.

ఈ వంతెన ఉన్న ప్రాంతంలో రెండు రోడ్లు ఉన్నాయి. ఒక రోడ్డు నీటి ప్రవాహానికి సమాంతరంగా వెళుతోంది. మరో రోడ్డు అలప్పుజకు వెళుతుంది. అయితే గూగుల్ మ్యాప్స్ సాంకేతిక కారణాలతో వారికి అలప్పుజకు బదులు నీటి ప్రవాహంలోకి దారి చూపించిందని.. అది రాత్రిపూట కావడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు.

కారు నీటిలో మునిగిపోవడాన్ని స్థానికులు గమనించారు. స్థానికుల సహాయంతో పోలీస్ పెట్రోలింగ్ యూనిట్… వారిని బయటకు తీసింది. అందరూ సురక్షితంగా బయటపడ్డారు. ఈ కారులో ఓ మహిళ సహా నలుగురు ఉన్నారు. ఆ తర్వాత కారును బయటకు తీశారు.

Related posts

కేరళ వరుస బాంబు పేలుళ్ల ఘటన.. నిందితులు ఆ కారులోనే పారిపోయారా?

Ram Narayana

గుండెపోటుతో డ్రైవింగ్ సీటులోనే కన్నుమూసిన డ్రైవర్.. హైదరాబాద్ లో ఘటన

Ram Narayana

నాగ్ పూర్ సోలార్ కంపెనీలో పేలుడు.. 9 మంది దుర్మరణం

Ram Narayana

Leave a Comment