Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

గంజాయి అక్రమ రవాణానుపై భద్రాద్రి కొత్తగూడెం పోలీసుల డేగకన్ను…

గంజాయి అక్రమ రవాణాపై భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు డేగకన్ను వేశారు …జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాలమేరకు ఎక్కడిక్కడ పోలీసులు నిఘా పెంచారు …వారి కదలికలపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరిస్తూ రవాణా చేస్తున్న ఆటలు కట్టించే చర్యలు చేపట్టారు …గంజాయి రవాణా చేస్తున్న వారిపై ఉక్కుపాదం తప్పదని ఎస్పీ హెచ్చరించారు …ఈమేరకు
అశ్వరావుపేట,భద్రాచలం,అశ్వాపురం పోలీస్ స్టేషన్ల పరిధిలో రూ.2,58,48,500/- విలువ గల 1035 కేజిల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు …

గంజాయి అక్రమ రవాణాను నిరోధించేందుకు జిల్లా సరిహద్దుల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి రవాణాకు పాల్పడుతున్న వ్యక్తులపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు వెల్లడించారు.మత్తు పదార్థాలు,మాదకద్రవ్యాలను నిర్మూలించడంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన తెలంగాణ యాంటీ నార్కోటిక్ వారితో సమన్వయం పాటిస్తూ,సమాచారాన్ని సేకరిస్తూ నిషేధిత గంజాయి రవాణాను అడ్డుకోవడం జరుగుతుందని తెలియజేసారు.

ఇందులో భాగంగా నిన్న అనగా 25.05.2024న జిల్లాలోని మూడు పోలీస్ స్టేషన్ల పరిధిలో గంజాయి రవాణా చేస్తున్న వారిని పట్టుకుని భారీగా గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది.

భద్రాచలం పోలీస్ స్టేషన్ పరిధిలోని కూనవరం రోడ్డులో ఆర్టీఏ ఆఫీస్ ఎదురుగా భద్రాచలం ఎస్సై విజయలక్ష్మి తన సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు చేస్తుండగా రెండు వాహనాలలో తరలిస్తున్న 427 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది.దీని విలువ సుమారుగా రూ.1,06,58,000/- ఉంటుంది. ఇట్టి గంజాయిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం,మోతుగూడెం,సుకుమామిడి నుండి 07గురు వ్యక్తులు రెండు వాహనాల్లో ప్లైఉడ్ షీట్స్ మాటున హైదరాబాద్ మూసాపేటకు తరలిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు.

అశ్వరావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని జంగారెడ్డిగూడెం రోడ్డులోని సాయిబాబా టెంపుల్ వద్ద ఎస్సై శ్రీనివాస్ తన సిబ్బందితో వాహన తనిఖీలు చేస్తుండగా ఒక బొలెరో వ్యాన్ లో నలుగురు వ్యక్తులు పనసకాయల లోడులా భావించే విధంగా వెనుక భాగంలో 359కేజీల గంజాయిని దాచిపెట్టుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దారకొండ,అల్లూరిసీతారామరాజు జిల్లా నుండి హైదరాబాద్ నకు తరలిస్తుండగా పట్టుకోవడం జరిగింది.దీని విలువ సుమారుగా రూ.89,83,000/- ఉంటుంది.

అశ్వాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని వద్ద ఎస్సై తిరుపతి తన సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు చేస్తుండగా ముగ్గురు వ్యక్తులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అల్లూరి సీతారామరాజు జిల్లా,చింతూరు నుండి ప్రత్యేకంగా ఒక ప్రైవేట్ బస్సులో వెనుక లగేజీ క్యాబిన్ లోపల భాగంలో కట్ చేసి,బస్సు లోపల సీట్ల క్రింద భాగాన్ని అరల వలే కట్ చేసి 249 కేజిల గంజాయిని అమర్చి హైదరాబాద్ నకు తరలిస్తుండగా అశ్వాపురం పోలీసులు పట్టుకోవడం జరిగింది.దీని విలువ సుమారుగా రూ.62,07,500/-ఉంటుంది.

ఇట్టి మూడు ఘటనలలో సుమారుగా రూ.2,58,48,500/-(రెండు కోట్ల యాభై ఎనిమిది లక్షల నలభై ఎనిమిది వేల ఐదు వందలు) విలువ గల 1035 కేజిల నిషేధిత గంజాయిని స్వాదీనం చేసుకుని రవాణాకు ఉపయోగించిన వాహనాలను సీజ్ చేసి అట్టి వ్యక్తులను అరెస్టు చేసి జైలుకు పంపడమైనది.

Related posts

పాలనలో పట్టుకోసం రేవంత్ అడుగులు… 20 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ

Ram Narayana

సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో తొలి ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజ్!

Ram Narayana

రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ లోకి పంపించింది చంద్రబాబే.. ఎందుకంటే?: పోచారం

Drukpadam

Leave a Comment