Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో జేసీ …సీఎల్పీ కార్యాలయంలో జేసీ కి జీవన్ రెడ్డి చురకలు!

తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో జేసీ …సీఎల్పీ కార్యాలయంలో జేసీ కి జీవన్ రెడ్డి చురకలు!
-మంచి ఉంటే చెప్పండి… పార్టీకి నష్టం కలిగించే మాటలు ఇక్కడొద్దు: జేసీపై జీవన్ రెడ్డి అసహనం
-తెలంగాణ అసెంబ్లీకి వెళ్లిన జేసీ
-కాంగ్రెస్ పాత మిత్రులతో మాటామంతీ
-అసహనానికి లోనైన జీవన్ రెడ్డి
-మరోసారి ఇలా మాట్లాడొద్దని హితవు
-ఏపీని వదిలేసి తెలంగాణకు వస్తా
-సీఎల్పీ పాత మిత్రులందరినీ కలిశాను
-ప్రస్తుతం రాజకీయాలు, సమాజం రెండూ బాగోలేవు
-తెలంగాణను వదిలిపెట్టి చాలా నష్టపోయాను

మాజీ ఎంపీ ఏపీ టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు … గతంలో కాంగ్రెస్ లో ఒక వెలుగు వెలిగిన సంగతి తెలిసిందే. ఉమ్మడి రాష్ట్రంలో తన కాంగ్రెస్ సహచరులుగా ఉన్న నేతలను ఆయన ఇప్పటికీ తెలంగాణ అసెంబ్లీకి వెళ్లి పలకరిస్తుంటారు. సీఎల్పీకి వెళ్లడం, పనిలోపనిగా రెండు మూడు ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం జేసీకి పరిపాటిగా మారింది. అయితే ఇవాళ తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణం వద్దకు వెళ్లిన జేసీకి ఊహించని షాక్ తగిలింది . మీ సలహాలు మాకు అక్కర్లేదంటూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ముఖం మీదే కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. దాంతో జేసీ దిగ్భ్రాంతికి గురయ్యారు.

ఏదైనా ఉపయోగపడే అంశాలు ఉంటే చెప్పండి, అంతేతప్ప పార్టీకి నష్టం కలుగజేసే మాటలు ఇక్కడ మాట్లాడొద్దు అని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. సీఎల్పీకి వచ్చి పార్టీని ఇబ్బందిపెట్టొద్దు అంటూ రెండు చేతులు జోడించారు. దాంతో, వాస్తవ పరిస్థితిని గ్రహించిన జేసీ దివాకర్ రెడ్డి వెంటనే స్పందించారు. క్షమించండి… ఇకపై ఇలాంటి విషయాలు మాట్లాడను… తప్పయిపోయింది అంటూ బదులిచ్చారు. అంతకు ముందు ఆయన అసెంబ్లీ లో సీఎం కేసీఆర్ , మంత్రి కేటీఆర్ లను కలిశారు. వారితోను పిచ్చాపాటి మాట్లాడారు . ఏపీ ని వదిలి తెలంగాణకు వస్తానని చెప్పారు. తెలంగాణ ను వదిలి పెట్టి చాల నష్టపోయానని చెప్పారు. ప్రస్తుత రాజకీయాలు సమాజం రెండు బాగా లేవని అన్నారు .

మీడియా తో జేసీ

జేసీ దివాకర్ రెడ్డి అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎల్పీలో పాత మిత్రులందరినీ కలిశానని ఆయన చెప్పారు. ప్రస్తుతం రాజకీయాలే కాక, సమాజం కూడా బాగోలేదని అన్నారు. అయితే ఏపీ కంటే తెలంగాణ రాజకీయాలే బాగున్నాయని వ్యాఖ్యానించారు.

ఇక తాను తెలంగాణను వదిలిపెట్టి చాలా నష్టపోయానని… ఏపీని వదిలేసి తాను తెలంగాణకు వస్తానని చెప్పారు. నాగార్జునసాగర్ ఉపఎన్నికలో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ఎందుకు ఓడిపోయారో అందరికీ తెలుసని అన్నారు. హుజూరాబాద్ ఉపఎన్నిక గురించి తనకు పూర్తిగా తెలియదని చెప్పారు.

Related posts

పద్మభూషణ్ పురస్కారం నాకొద్దు.. తిరస్కరించిన బుద్ధదేవ్ భట్టాచార్య!

Drukpadam

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం

Drukpadam

సిపిఐ బలాన్ని ప్రతిబంబించేలా జూన్ 4 న కొత్తగూడెంలో సిపిఐ బహిరంగ సభ…కూనంనేని

Drukpadam

Leave a Comment