Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

తెలంగాణ నీటి వాటా పై కేసీఆర్ పట్టు … ఢిల్లీ లోషెకావత్ తో భేటీ!

తెలంగాణ నీటి వాటా పై కేసీఆర్ పట్టు … ఢిల్లీ లోషెకావత్ తో భేటీ!
-షెకావత్ ను కలిసి లేఖ అందజేసిన తెలంగాణ సీఎం కేసీఆర్
-ఢిల్లీలో పర్యటిస్తున్న సీఎం కేసీఆర్
-జల వివాదాలపై షెకావత్ తో చర్చ
-గెజిట్ నోటిఫికేషన్ అమలు వాయిదా వేయాలని విజ్ఞప్తి
-ముందు వాటాల సంగతి తేల్చాలని వినతి

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నీటి వాటాలపై గట్టి పట్టుదలతో ఉన్నారు … తెలంగాణకు రావాల్సిన వాటాను తేల్చిన తరువాతనే గెజిట్ విడుదల చేయాలనీ అంతవరకూ గెజిట్ అమలు కాకుండా వాయిదా వేయాలని కేంద్రమంత్రిని కోరారు. కేసీఆర్ నీటి వాటాల విషయంలో అధికారులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడంలేదనే భావనతో తానే రంగంలోకి దిగారు. కృష్ణ ,గోదావరి జలాల విషయంలో ఇప్పటికే కేంద్రం ఒక గెజిట్ విడుదల చేసింది. తెలంగాణ ఉద్యమం రావడానికి నీటివాటాల్లో జరుగుతున్న అన్యాయం కూడా ఒక ప్రధాన అంశం గా ఉంది. మన రాష్ట్రం మన నీళ్లు , మన ఉద్యోగాలు , మన నిధులు కానీ ఉద్యోగాలు అనే నినాదం తోనే తెలంగాణా ఉద్యమం జరిగిన సంగతి తెలిసిందే . అందువల్ల కృష్ణ ,గోదావరి జలాల విషయంలో వాటాల సంగతి పై తెలంగాణ సర్కార్ తీవ్ర అసంతృప్తితో ఉంది. అందుకే కేసీఆర్ పనిలో పనిగా కేంద్రంలో మంత్రులను కలుస్తున్నారు. వారిని మెప్పించి ఒప్పించే పనిలో ఉన్నారు. ఇప్పటికే విడుదల చేసిన గెజిట్ తమకు అన్యాయం జరిగిందని అందువల్ల ఆ గెజిట్ వాయిదా వేయాలని కేంద్ర నీటిపారుదల శాఖా మంత్రి గజేంద్ర సింగ్ షకావత్ తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.

పొరుగు రాష్ట్రాలతో జల వివాదాలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించుకోవాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. గజేంద్ర సింగ్ షెకావత్ తో భేటీ సందర్భంగా జల వివాదాలపై పలు అంశాలను షెకావత్ కు వివరించారు. ముఖ్యంగా 5 అంశాలతో కూడిన లేఖను ఆయనకు అందజేశారు.

కాగా, ఈ సమావేశంలో కేంద్ర గెజిట్ నోటిఫికేషన్ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. ఉమ్మడి ప్రాజెక్టులను మాత్రమే కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిలో ఉంచాలని కోరారు. గెజిట్ నోటిఫికేషన్ అమలును వాయిదా వేయాలని, ముందు వాటాల సంగతి తేల్చాలని, ఆ తర్వాతే బోర్డుల పని చేపట్టాలని పేర్కొన్నారు. షెకావత్ తో కేసీఆర్ భేటీ దాదాపు 40 నిమిషాల పాటు సాగింది.

Related posts

మోదీ ప్రధాని అయ్యింది ఉల్లిపాయల ధరలు తగ్గించడానికి కాదు!: కేంద్ర మంత్రి పాటిల్

Drukpadam

తెలుగు తల్లి, తెలంగాణ బిడ్డ అంటూ షర్మిలకు గద్దర్ ప్రశంసలు..!

Drukpadam

జోరుగా రాహుల్ భారత్ జోడో యాత్ర …పాల్గొన్న బాలీవుడ్ హీరోయిన్…

Drukpadam

Leave a Comment