Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

గడ్డి అన్నారం పండ్ల మార్కెట్ తరలింపు …వ్యాపారుల ,హమాలీల నిరసనలు!

గడ్డి అన్నారం పండ్ల మార్కెట్ తరలింపు …వ్యాపారుల ,హమాలీల నిరసనలు!
అన్ని సదుపాయాలు కల్పించాం … బాటసింగారం తరలించాలంటున్న ప్రభుత్వం
35 సంవత్సరాలు గా ఇక్కడే ఉన్నాం ఇక్కడ నుంచి వెళ్ళేది లేదు అంటున్న వ్యాపారులు
అర్ధ‌రాత్రి నుంచి మూత‌ప‌డ‌నున్న గ‌డ్డి అన్నారం పండ్ల మార్కెట్
బాట‌సింగారం లాజిస్టిక్ పార్కుకు తరలింపు
అక్టోబ‌రు 1 నుంచే అక్క‌డ క్ర‌య విక్ర‌యాలు
ప్ర‌భుత్వ నిర్ణ‌యంతో వ‌ర్త‌కులు, హ‌మాలీల ఆందోళ‌న బాట‌

హైద్రాబాద్ లో ఉన్న గడ్డి అన్నారం పండ్ల మార్కెట్ దేశంలోనే ప్రసిద్ధి చెందింది .,,, అనేక రాష్ట్రాల నుంచి ఇక్కడకు వివిధ రకాల పండ్లు వస్తుంటాయి. సుమారు 35 సంవత్సరాలుగా వందలాది వ్యాపారాలు , వేలాదిగా హమాలీలు ఈ మార్కెట్ పై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. వందల వేళా సంఖ్యలో వివిధ ప్రాంతాల నుంచి కొనుగోలు దార్లు అమ్మకం దార్లు ఇక్కడికి వస్తుంటారు . ఇది భారత్ దేశంలోని పండ్ల మార్కెట్లలో మంచి గుర్తింపు కలిగి ఉంది. అలంటి గడ్డి అన్నారం ఇక చరిత్ర పుటల్లో కలవనున్నది . దీన్ని బాటసింగారం కు తరలించనున్నారు. అయితే అక్కడ వ్యాపారాలు ,హమాలీలు ప్రభుత్వ మార్కెట్ తరలింపు చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

హైదరాబాద్ లోని గడ్డి అన్నారం పండ్ల మార్కెట్ ఈ అర్ధ‌రాత్రి నుంచి మూత‌ప‌డ‌నుంది. ఈ రోజు అర్ధ‌రాత్రి నుంచి దానికి తాళాలు వేసేస్తామ‌ని తెలంగాణ‌ ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది. ఆ మార్కెట్‌ను బాట‌సింగారం లాజిస్టిక్ పార్కుకు తరలిస్తున్నారు. అక్టోబ‌రు 1 నుంచి ఇక అక్క‌డ క్ర‌య విక్ర‌యాలు ప్రారంభ‌మ‌వుతాయి. అక్కడ అన్ని హంగులతో విశాలమైన మార్కెట్‌ను ఏర్పాటు చేశామ‌ని అధికారులు అంటున్నారు.

గడ్డి అన్నారం మార్కెట్ కొన్ని ఎకరాల్లోనే ఉండ‌డంతో పాటు అది దశాబ్దాల కిందటి నిర్మాణం కావడంతో అందులో సదుపాయాలు లేవ‌ని ప్ర‌భుత్వం అంటోంది. అయితే, ప్ర‌భుత్వ నిర్ణ‌యంతో వ‌ర్త‌కులు, హ‌మాలీలు ఆందోళ‌న బాట‌ ప‌ట్టారు. త‌మ‌తో చ‌ర్చించ‌కుండానే అధికారులు నిర్ణ‌యాలు తీసుకున్నార‌ని చెప్పారు. 35 ఏళ్ల పాటు గ‌డ్డి అన్నారం పండ్ల మార్కెట్‌లో కార్య‌క‌లాపాలు జ‌రుగుతున్నాయ‌ని గుర్తు చేసుకున్నారు.

ఇక్క‌డ ఆసుప‌త్రి క‌డ‌తామ‌ని ప్ర‌భుత్వం చెబుతోంద‌ని, త‌మ‌ను ఎటువంటి స‌దుపాయాలు లేని చోటుకి త‌ర‌లిస్తుండ‌డం బాధాక‌ర‌మ‌ని చెప్పారు. వేరే చోట మార్కెట్ ఏర్పాటు చేస్తున్నామ‌ని అధికారులు అంటున్నార‌ని, దాన్ని తాము ప‌రిశీలించామ‌ని, అక్క‌డ ఎటువంటి స‌దుపాయాలూ క‌ల్పించ‌లేద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తాము గ‌డ్డి అన్నారం పండ్ల మార్కెట్ నుంచి త‌మ వ్యాపారాల‌ను త‌ర‌లించ‌బోమ‌ని తెగేసి చెబుతున్నారు.

Related posts

సీఎం పెన్ డ్రైవ్ లు జడ్జిలకు పంపడం సరికాదన్న జస్టిస్ గవాయ్…క్షమాపణలు చెప్పిన దుశ్యంత్ దవే …

Drukpadam

తమిళనాడు జాలర్ల వలకు చిక్కిన రూ.50 కోట్ల విలువైన అంబర్‌గ్రిస్!

Drukpadam

హెలికాప్ట‌ర్ బ్లాక్ బాక్స్ ల‌భ్యం.. ప్ర‌మాదానికి కార‌ణాలు వెల్ల‌డ‌య్యే ఛాన్స్‌!

Drukpadam

Leave a Comment