Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఏపీ కాబినెట్ లో 100 శాతం కొత్తవారే అంటున్న సీఎం జగన్ !

ఏపీ కాబినెట్ లో 100 శాతం కొత్తవారే అంటున్న సీఎం జగన్ !
సీఎం నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్న మంత్రి బాలినేని
ఒంగోలులో మీడియాతో మాట్లాడిన బాలినేని
ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన వైనం
మంత్రి పదవి పోయినా బాధపడనని వెల్లడి
తనకు పార్టీయే ముఖ్యమని ఉద్ఘాటన

ఏపీ లో కాబినెట్ ప్రక్షాళనకు సీఎం జగన్ కసరత్తు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి ముఖ్యమంత్రిగా సీఎం బాధ్యతలు స్వీకరించిన తరువాత కాబినెట్ ఏర్పాటుకు కొన్ని రోజులు ఆలోచనలు చేసిన అనంతరం మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. మంత్రి వర్గ ఏర్పాటు సందర్భంగానే ఆయన తన మంత్రివర్గం కేవలం రెండున్నర సంవత్సరాలు మాత్రమేనని స్పష్టం చేశారు. అందువల్ల జగన్ మంత్రివర్గానికి రెండున్నర సంవత్సరాలు కావస్తుంది. దాంతో మంత్రివర్గ మార్పుపై ఆశక్తి నెలకొన్నది . కొత్తగా ఎవరెవరిని తీసుకుంటారు. ఎవరికీ అవకాశం ఉంటుంది. అనేది చర్చనీయాంశం అయింది. మొత్తం 25 మంత్రులు ఉండగా వారిని అందరిని మారుస్తారా ?లేక కొంతమందిని మారుస్తారా ? అనేది ఇప్పుడు ఏపీ లో హాట్ టాపిక్ గా మారింది. సీనియర్ మంత్రులుగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , బొత్స సత్యనారాయణ , బాలినేని శ్రీనివాస్ రెడ్డి , పినిపే విశ్వరూప్ , లాంటి వారు ఉన్నారు. వారిని మార్చుతారా ? లేదా ? అనేది చూడాల్సి ఉంది. వీరంతా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైయస్ మంత్రివర్గంలో మంత్రులుగా చేసినవారే .

ఈసారి మంత్రి వర్గ కూర్పు ఎలాఉండబోతుంది.ఎవరిని తీసుకుంటారు అనేది ఆశక్తి రేకెత్తిస్తుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రులుగా ఉన్న ధర్మాన ప్రసాద్ రావు , ఆనం రాంనారాయణ రెడ్డి ,కొలుసు పార్థసారధి లు మంత్రి పదవులను ఆశిస్తున్నారు. వేరే గాక చిత్తూరు నుంచి రే కె రోజా , భూమన కరుణాకర్ రెడ్డి , కర్నూల్ నుంచి కాటసాని రాంభూపాల్ రెడ్డి గుంటూరు నుంచి రామకృష్ణ రెడ్డి , అంబటి రాంబాబు , కృష్ణ జిల్లా నుంచి జోగి రమేష్ , సామినేని ఉదయభాను , పశ్చిమ గోదావరి నుంచి ప్రసాదరాజు , మరొకరికి అవకాశం ఉండవచ్చు . ఇక తూర్పు గోదావరినుంచి దాడిశెట్టి రాజా , ద్వారం పూడి చంద్రశేఖర్ రెడ్డి , విశాఖ నుంచి అమర్ , శ్రీకాకుళం నుంచి తమ్మినేని సీతారాం , మరో ఇద్దరు ముగ్గురు మహిళలు , ఎస్సీ ,ఎస్టీ సామాజికవర్గాలనుంచి తీసుకునే అవకాశం ఉంది.

మంత్రి వర్గ మార్పును నిర్దారించిన బాలినేని

ఏపీ కేబినెట్ విస్తరణ అంటూ వార్తలొస్తున్న నేపథ్యంలో విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒంగోలులో మీడియాతో మాట్లాడుతూ, కేబినెట్ లో 100 శాతం కొత్తవారిని తీసుకుంటామని సీఎం చెప్పారని బాలినేని వెల్లడించారు. సీఎం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా శిరసావహిస్తానని స్పష్టం చేశారు. ఒకవేళ తన మంత్రి పదవి పోయినా బాధపడనని, సీఎం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని పేర్కొన్నారు. తనకు పార్టీయే ముఖ్యమని, పదవులు ముఖ్యం కాదని అన్నారు.

 

Related posts

కేజ్రీవాల్ పార్టీ నుండి కాంగ్రెస్‌కు ఊహించని ఆఫర్!

Drukpadam

టీపీసీసీ చీఫ్ గా రేవంత్ నియామకం కొందరికి మోదం …కొందరికే ఖేదం…

Drukpadam

రేణుకాచౌదరితో పొంగులేటి ఏకాంత చర్చలు …మెత్తబడ్డ ఫైర్ బ్రాండ్

Drukpadam

Leave a Comment