జాతీయ వార్తలు

మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ!

  • ఛత్తీస్ గఢ్ లో లొంగిపోయిన 50 మంది మావోయిస్టులు
  • వీరిలో 10 మంది మహిళా మావోయిస్టులు
  • అందరికీ పునరావాసం కల్పిస్తామన్న బీజాపూర్ ఎస్పీ

మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్ గఢ్ లో 50 మంది మావోయిస్టులు పోలీసుల ముందు లొంగిపోయారు. బీజాపూర్ జిల్లా ఎస్పీ సమక్షంలో వీరు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో 10 మంది మహిళా మావోయిస్టులు కూడా ఉన్నారు. వీరిలో 14 మంది తలలపై రూ. 68 లక్షల రివార్డు ఉంది.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ… 50 మంది మావోయిస్టులు ఆయుధాలతో సహా లొంగిపోయారని తెలిపారు. వీరి లొంగుబాటులో సీఆర్పీఎఫ్, ఎస్టీఎఫ్, డీఆర్జీ కీలక పాత్ర పోషించాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం పునరావాస చర్యల్లో భాగంగా వీరిలో ఒక్కొక్కరికి రూ. 25 వేల చెక్ లను అందించామని తెలిపారు. వీరు జనజీవన స్రవంతిలో కలిసేందుకు పునరావాసం కల్పిస్తామని చెప్పారు.

Related posts

ఆత్మహత్యాయత్నం చేసిన తమిళనాడు ఎంపీ మృతి

Ram Narayana

మూడోసారి ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం… హాజరైన చంద్రబాబు, పవన్ కల్యాణ్

Ram Narayana

దావూద్ ఇబ్రహీం నుంచి ప్రాణభయంతోనే భారత్‌ను వీడా: లలిత్ మోదీ

Ram Narayana