Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

పవన్ ఆరోపణలు ఒక్కటైనా నిరూపించగలరా ? పేర్ని నాని సవాల్!

పవన్ ఆరోపణలు ఒక్కటైనా నిరూపించగలరా ? పేర్ని నాని సవాల్!
-పవన్ ను ఏకిపారేసిన రవాణా మంత్రి
-యుద్ధ వీరుడు, యోధుడు అంటూ పవన్ కల్యాణ్ పై సెటైర్లు
– ఏపీ తెలంగాణ మధ్య గణాంకాలతో సహా వివరించిన నాని
-పవన్ కల్యాణ్ వర్సెస్ ఏపీ మంత్రులు
-తాజాగా పేర్ని నాని కౌంటర్
-పవన్ వాస్తవాలు తెలుసుకోవాలని హితవు

జనసేనాని పవన్ కల్యాణ్ సినీ రంగ సమస్యల విషయంలో ఏపీ ప్రభుత్వాన్ని తీవ్రస్థాయిలో విమర్శించడం తెలిసిందే. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు రిపబ్లిక్ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికగా నిలిచింది. ఈ కార్యక్రమంలో పవన్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రి పేర్ని నాని అదేస్థాయిలో ఘాటుగా బదులిచ్చారు. పవన్ కల్యాణ్ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని అన్నారు. పవన్ చేస్తున్న ఆరోపణల్లో ఒక్కటైనా నిరూపించగలరా అని సవాల్ విసిరారు. యుద్ధ వీరుడు, యోధుడు అంటూ సెటైర్లు వేశారు.

“తెలంగాణ ప్రభుత్వం థియేటర్లు తెరిస్తే, ఏపీలో థియేటర్లను వైసీపీ సర్కారు మూతవేసిందని, ఇదంతా తనపై కక్షతోనే అని పవన్ కల్యాణ్ ఆరోపించారు. ఏపీలో 1100 వరకు థియేటర్లు రన్నింగ్ కండిషన్ లో ఉంటే, వాటిలో 800 థియేటర్లలో ప్రస్తుతం ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. కానీ తెలంగాణలో 519 థియేటర్లకు గాను, 413 థియేటర్లే నడుస్తున్నాయి. ఏపీలో సీఎం జగన్ ఉక్కుపాదాల కింద నలిగిపోతుందని భావిస్తున్న సినీ రంగాన్ని కాపాడేందుకు వచ్చిన యోధుడు గారూ, అయ్యా పీకే గారూ ఈ విషయాన్ని గుర్తించండి.

ఇటీవల చిరంజీవి లవ్ స్టోరీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎంతో ప్రశాంతంగా ఏపీ ప్రభుత్వాన్ని అర్థించారు. ఆ సినిమా ఇప్పుడు ఏపీలో 510 థియేటర్లలో ఆడుతోంది. తెలంగాణలో లవ్ స్టోరీ చిత్రానికి తొలిరోజు షేర్ రూ.3 కోట్లు కాగా, ఏపీలో తొలి రోజు షేర్ రూ.3.88 కోట్లు వచ్చింది. దీనికి యుద్ధవీరుడు గారు ఏమంటారు? దీనిపై చిత్రనిర్మాత సునీల్ నారంగ్ ఒక్క మాట స్పందించినా చాలు చిత్ర పరిశ్రమకు మేలు చేసినవారవుతారు. నారంగ్ కుటుంబం ఎన్నో ఏళ్లుగా చిత్రసీమలో ఉంది. తెలుగు సినీ పరిశ్రమను ఏపీలో సీఎం జగన్ ఏం ఇబ్బంది పెట్టారో చెప్పండి” అంటూ పేర్ని నాని ప్రశ్నించారు.

Related posts

ఏపీకి ప్రత్యేక హోదాపై స్పందించిన కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ

Ram Narayana

పుంగనూరు పుడింగీ… ఎవడ్రా నువ్వు?: శ్రీకాళహస్తి సభలో చంద్రబాబు ఫైర్

Ram Narayana

ఉద్యోగుల పీఆర్ సి- ముఖ్యమంత్రి పైనే ఆశలు

Drukpadam

Leave a Comment