హుజూరాబాద్, బద్వేల్ ఉపఎన్నికలు అక్టోబర్ 30న!
షెడ్యూల్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం
అక్టోబర్ 1 నుంచి 8 వరకు నామినేషన్ల స్వీకరణ
పోలింగ్ అక్టోబర్ 30 న
నవంబర్ 2న ఓట్ల లెక్కింపు
తెలంగాణలో అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిన హుజూరాబాద్ ఉపఎన్నిక
ఇప్పటికే ప్రచారంలో పోటీపడుతున్న టీఆర్ యస్ బీజేపీ లు
ఇంకా ఖరారు కానీ కాంగ్రెస్ అభ్యర్థి
షర్మిల , ప్రవీణ్ కుమార్ లపార్టీ లు పోటీపై సందిగ్ధం
తెలంగాణలో రాజకీయ వేడిని పుట్టిస్తున్న హుజూరాబాద్, ఏపీలో బద్వేలు శాసనసభ స్థానాల ఉపఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. అక్టోబర్ 30న పోలింగ్ జరగనుంది. అక్టోబర్ 1న నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్ దాఖలుకు అక్టోబర్ 8ని చివరి తేదీగా నిర్ణయించారు. అక్టోబర్ 11న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. అక్టోబర్ 13 నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ. నవంబర్ 2న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. తెలుగు రాష్ట్రాల్లోని ఈ రెండు నియోజకవర్గాలతో పాటు దేశంలోని 14 రాష్ట్రాల్లోని 30 అసెంబ్లీ, 3 లోక్ సభ నియోజకవర్గాలకు అక్టోబర్ 30న ఉపఎన్నికలను నిర్వహించనున్నారు.
హుజూరాబాద్ ఉపఎన్నికకు షెడ్యూల్ విడుదల కావడంతో ఒక్కసారిగా రాజకీయ పరిణామాలు మారిపోతున్నాయి. ప్రచారాన్ని హోరెత్తించడానికి అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఈ ప్రచారాలకు కీలక జాతీయ నేతలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామా చేయడంతో హుజూరాబాద్ కు ఉపఎన్నిక వచ్చింది. ఏపీలోని బద్వేల్ లో వైసీపీ ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య మృతి చెందడంతో అక్కడ ఉపఎన్నిక జరుగుతోంది.
హుజురాబాద్ లో మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీ అభ్యర్థిగా పోటీచేస్తుండటంతో ఆహ్వాన ఇప్పటివరకు ప్రాతినిధ్యం వహించిన నియోజగవర్గం కావడంతో అందరి ద్రుష్టి దానిపైనే ఉంది. ఎన్నికల షడ్యూల్ రాకముందు నుంచే బీజేపీ ,టీఆర్ యస్ పార్టీలు హోరా హోరి ప్రచారం చేస్తున్నాయి. అనేక హామీలతో అధికారంలో ఉన్న టీఆర్ యస్ హుజారాబాద్ పై గులాబీ జెండా ఎగర వేయాలనే పట్టుదలతో ఉంది . అందుకోసం అన్ని మార్గాలను అన్వేషిస్తుంది. వివిధ పార్టీలకు చెందిన నాయకులను టీఆర్ యస్ లో చేర్చుకోవడం , దళిత బందు తెచ్చి ఫైలట్ ప్రాజక్ట్ గా హుజురాబాద్ ను ఎంపిక చేసి సుమారు 2 వేల కోట్ల రూపాయలను కేటాయించింది. ఎన్నికల్లో మంచి వ్యూహకర్తగా పేరున్న హరీష్ రావు ను ఇంచార్జి గా నియమించి , గెల్లు శ్రీనివాస్ అనే బిసి వర్గానికి చెందిన విద్యార్ధి ఉద్యమ నాయకుడిని పోటీలో పెట్టింది.
టీఆర్ యస్ నుంచి సిట్టింగ్ అభ్యర్థిగా ఉన్న ఈటల బీజేపీ లో చేరి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆయన ఇప్పుడు బీజేపీ అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. పోటీ రసవత్తరంగా మారె అవకాశాలు ఉన్నాయి. కాగ్రెస్ నుంచి గత ఎన్నికల్లో పోటీచేసిన పాడి కౌశిక్ రెడ్డి టీఆర్ యస్ చేరారు. బీజేపీ లో ఉన్న పెద్ది రెడ్డి సైతం టీఆర్ యస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇక కాంగ్రెస్ తరుపున ఇంకా అభ్యర్థిని నిర్ణయించలేదు . మాజీ మంత్రి కొండా సురేఖ పోటీ చేస్తారని ప్రచారం జరుగుతుంది. మరికొందరు కూడా కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. అక్టోబర్ 30 న జరగనున్న ఈ ఎన్నిక కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. బీజేపీ కూడా కేంద్ర నాయకత్వం హుజురాబాద్ లో గెలుపు ద్వారా 2023 ఎన్నికల్లో తెలంగాణాలో తామే అధికారంలోకి వస్తామని ,టీఆర్ యస్ కు ప్రత్యాన్మయం తామే అని చాటి చెప్పదలచుకున్నది . హుజురాబాద్ ఓటర్ల తీర్పు కోసం రాష్ట్రం ఎదురు చూస్తున్నది ..