Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి సిద్దు గుడ్ బై …నిలకడలేని మనిషి సిద్దు అన్న అమరిందర్!

పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి సిద్దు గుడ్ బై …నిలకడలేని మనిషి సిద్దు అన్న అమరిందర్!
-పాకిస్తాన్ తో సిద్ధుకు సంబంధాలు …ఆయన ప్రమాదకారి అన్న కెప్టెన్
-సిద్దూ నిలకడ లేని మనిషి అని నేను ముందే చెప్పానన్న అమరీందర్
-పంజాబ్ లాంటి రాష్ట్రానికి ఆయన సరిపోరని వ్యాఖ్య

పంజాబ్ పీసీసీ చీఫ్ పదవికి నవజ్యోత్ సింగ్ సిద్ధూ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. పంజాబ్ భవిష్యత్తు విషయంలో తాను రాజీ పడలేనంటూ సోనియా గాంధీకి పంపిన రాజీనామా లేఖలో ఆయన పేర్కొన్నారు. సిద్ధూ రాజీనామాపై పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

సిద్ధూ ఒక నిలకడ లేని వ్యక్తి అనే విషయాన్ని తాను ఇంతకు ముందే చెప్పానని ఆయన ట్వీట్ చేశారు. దేశ సరిహద్దుల్లో ఉన్న పంజాబ్ లాంటి రాష్ట్రానికి ఆయన సరిపోరని చెప్పారు. పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, ఆ దేశ ఆర్మీ చీఫ్ బజ్వాకు సిద్ధూ అత్యంత సన్నిహితుడని… మన దేశానికి సిద్ధూ ప్రమాదకారి అని ఇటీవలే అమరీందర్ సింగ్ తీవ్ర ఆరోపణలు చేశారు. గత కొంత కాలంగా అమరీందర్ కు, సిద్ధూకు మధ్య తీవ్ర వివాదం నెలకొంది. ఇద్దరూ ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకున్నారు. ఈ క్రమంలో ఇటీవలే అమరీందర్ ను సీఎం పదవి నుంచి పార్టీ అధిష్ఠానం తొలగించింది.

వచ్చే సంవత్సరం ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పంజాబ్ లో జరుగుతున్న పరిణామాలు కాంగ్రెస్ కు తలనొప్పిగా మారాయని అభిప్రాయాలూ ఉన్నాయి. అధికారం ఉన్న రెండుమూడు రాష్ట్రాలలో పంజాబ్ కాంగ్రెస్ కు ఒక బలమైన రాష్ట్రంగా ఉంది. ఇక్కడ ఇటీవల కాలంలోనే కాంగ్రెస్ అధ్యక్షుడి ఎన్నిక ,సీఎం మార్పు వివాదంగా మారాయి. సిద్దును నమ్ముకున్న కాంగ్రెస్ అధిష్టానం అక్కడ జరుగుతున్న పరిణామాలతో ఆందోళన చెందుతుంది. ఈ నేపథ్యంలో సిద్దు పీసీసీ అధ్యక్ష పదవికి రాజినామా చేయడం ఆశక్తిగా మారింది. రేపు పంజాబ్ లో ఏమి జరుగుతుంది. అమరిందర్ బీజేపీ లో చేరతారా ? పీసీసీ అధ్యక్షుడిగా కాంగ్రెస్ ఎవరిని నియమిస్తుంది. అనేది ఆశక్తిగా మారింది .

Related posts

కేసీఆర్ ను ఏమైనా అంటే చుక్కలు చూపిద్దాం: కేటీఆర్

Drukpadam

తెలంగాణ అసెంబ్లీలో మాటకు మాట… ర‌చ్చ‌!

Drukpadam

డ్రగ్స్ వ్యవహారంలో టీడీపీ ,వైసీపీ మధ్య మాటల యుద్ధం ….

Drukpadam

Leave a Comment