Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఇక‌ సమయం ఆసన్నమయింది’ అంటూ ప‌వ‌న్ క‌ల్యాణ్ కీల‌క వ్యాఖ్య‌!

‘ఇక‌ సమయం ఆసన్నమయింది’ అంటూ ప‌వ‌న్ క‌ల్యాణ్ కీల‌క వ్యాఖ్య‌!
-వైసీపీ ప్రభుత్వానిది ‘పాలసీ ఉగ్రవాదం’
-అన్ని రంగాలు, అన్ని వర్గాలు నాశనం
-దీనిని ఎదుర్కోవాల్సి ఉంది

వ‌రుస‌గా సినిమాల షూటింగుల్లో బిజీగా గ‌డుపుతోన్న జ‌న‌సేన అధినేత‌ ప‌వ‌న్ క‌ల్యాణ్ త్వ‌ర‌లోనే మ‌ళ్లీ పూర్తి స్థాయిలో రాజ‌కీయాల‌పై దృష్టి పెట్ట‌నున్న‌ట్లు తెలుస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం పోరాడ‌తాన‌ని ఇప్ప‌టికే ఆయ‌న ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. సాయితేజ్ హీరోగా నటించిన రిపబ్లిక్ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ లో ఏపీ స‌ర్కారుపై పవన్ కల్యాణ్ తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. అనంత‌రం కూడా ట్విట్ట‌ర్ వేదిక‌గా ఏపీ స‌ర్కారుపై ఘాటుగా విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఏపీ మంత్రులు త‌న‌పై విరుచుకుప‌డుతున్న నేప‌థ్యంలో ఆయ‌న తాజాగా మ‌రో ట్వీట్ చేశారు.

“వైసీపీ ప్రభుత్వం ‘పాలసీ ఉగ్రవాదం’ కి అన్ని రంగాలు అన్ని వర్గాలు నాశనం అయిపోతున్నాయి. దీనిని ఎదుర్కోవాల్సిన సమయం ఆసన్నమయింది” అంటూ ప‌వ‌న్ క‌ల్యాణ్ పేర్కొన్నారు. తాను ఇక రాజ‌కీయాల‌పైనే దృష్టి పెడ‌తాన‌న్న సంకేతాలు ఇచ్చారు.

పవన్ కళ్యాణ్ ,ఏపీ సర్కార్ మధ్య జరుగుతున్న మాటల యుద్ధం ఏపీ రాజకీయాలను హీట్ పుట్టిస్తుంది. పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ సినిమా ఫ్రీ రిలీజు ఫంక్షన్ లో చేసిన రాజకీయ ప్రసంగంపై మంత్రులు మండి పడ్డారు . ప్రధానంగా సమాచార ప్రసారాల శాఖ మంత్రి పేర్ని నాని పవన్ విమర్శలపై చేసిన ఎదురు దాడి చర్చనీయాంశం అయింది. ఒక మంత్రిని పట్టుకొని పవన్ కళ్యాణ్ సన్నాసి అని సంబోధించడం పై పవన్ కళ్యాణ్ నే తప్పు పడుతున్నారు. అసలు ఆ వేదికను రాజకీయ వేదికగా చేయకుండా ఉండాల్సిందని భావం వచ్చేలా సినీ ప్రముఖుల అంతర్గత చర్చల్లో ఉన్నట్లు సమాచారం . ఫీలిం ఛాంబర్ తరుపున పవన్ కళ్యాణ్ మాటలకూ తమకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించారు. దీంతో పవన్ కళ్యాణ్ ను ఒక వర్గం సినీ పరిశ్రమ దూరం పెడుతుందని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. పోసాని మురళి కృష్ణ సైతం పవన్ పై విరుచుక పడ్డారు. దీంతో ఏపీ లో రాజకీయాలు రంజుగా మారాయి.

Related posts

మీడియా ప్రమేయం లేకుండా సీబీఐ విచారణ జరపాలి: సజ్జల

Drukpadam

తాను టీఆర్ యస్ లో చేరుతున్నట్లు కేసీఆర్ ప్రచారం చేయిస్తున్నారు :ఈటల

Drukpadam

ప్రపంచంలోనే ఈ గ్రామంలో ముస్లింలు ఎంతో ప్రత్యేకం… 

Drukpadam

Leave a Comment