Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

లంచం కొంచెం తీసుకోండి..మరీ ఎక్కువ తీసుకోకండి ప్లీజ్ :మధ్యప్రదేశ్ బీఎస్పీ ఎమ్మెల్యే!

లంచం కొంచెం తీసుకోండి..మరీ ఎక్కువ తీసుకోకండి ప్లీజ్ :మధ్యప్రదేశ్ బీఎస్పీ ఎమ్మెల్యే!
-అధికారులకు సలహాలిస్తున్న ఎమ్మెల్యే
-మధ్యప్రదేశ్‌‌లో బీఎస్పీ ఎమ్మెల్యే రామాబాయి పాఠాలు
-పీఎంఏవై కింద ఇళ్లు ఇప్పిస్తామని లంచం తీసుకున్న అధికారులు
-మరీ ఎక్కువ తీసుకున్నారని నిందించిన ఎమ్మెల్యే

లంచం సర్వాంతర్యామి … ఒక సినిమాలో దేవుడు ఎక్కడ ఉన్నాడురా ? అంటే ఇందుగలడు అందుగలడను సందేహం లేదు ఎందెందు ఎతికినా అందేందే కలడు నాయన అని హీరణ్య కశ్యపుడికి కుమారుడు చెబుతాడు … అది సినిమా … పురాణాలు అనుకున్నాం …కాని నేడు అన్ని చోట్ల లంచం జాడ్యం పట్టుకున్నది . మధ్యప్రదేశ్ లో ఒక ఎమ్మెల్యే స్వయంగా అధికారులను లంచం తీసుకోండి కాని మరీ ఎక్కవగా వద్దకు ప్లీజ్ అంటూ ప్రాధేయపడటం చర్చనీయాంశంగా మారింది. …

అధికారులు లంచం తీసుకుంటున్నారని ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు ప్రజలు. ఎవరైనా అధికారులను మందలిస్తారు. లేదంటే సస్పెండ్ చేస్తారు. కానీ ఆ ఎమ్మెల్యే మాత్రం మరీ అంత లంచం తీసుకోవద్దని, కొంచెం తీసుకోవాలని సలహా ఇచ్చింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని సాటువా గ్రామంలో జరిగింది. తమకు ప్రధానమంత్రి ఆవాసయోజన (పీఎంఏవై) కింద ఇళ్లు ఇప్పిస్తామని చెప్పి భారీగా లంచాలు వసూలు చేస్తున్నారని గ్రామస్థులు ఆమెకు ఫిర్యాదు చేశారు.

ఈ విషయం తెలిసిన ఎమ్మెల్యే.. గ్రామస్థులు, అధికారులను పిలిచి సమావేశం ఏర్పాటు చేసింది. ఈ పంచాయతీలో గ్రామస్థులను నిలబెట్టి ‘నీ దగ్గర ఎంత తీసుకున్నారు?’ అంటూ ప్రశ్నించింది. వారిలో ఒకరు రూ.9 వేలు, మరొకరు రూ. 6 వేలు, మరొకరు రూ. 5 వేలు ఇలా సమాధానాలు చెప్పారు.

ఈ మాటలన్నీ విన్న బీఎస్పీ ఎమ్మెల్యే రాధాబాయి.. అధికారులను మందలించారు. ‘‘లంచం తీసుకోవద్దని నేను చెప్పను. కానీ మరీ అంత తీసుకోకూడదు. వెయ్యి రూపాయలు చాలు.’’ అని చెప్పింది. అలాగే అవినీతి రాజ్యం అనే అర్థం వచ్చేలా ఒక హిందీ సామెత కూడా చెప్పారామె. అనంతరం వారిని శిక్షించకపోవడమే ఎక్కువని, కాబట్టి వాళ్లు తీసుకున్న లంచం తిరిగిచ్చేయాలని అధికారులకు సూచించారు.

దీన్నంతా అక్కడే ఉన్న ఒక వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది తెగ వైరల్ అవుతోంది. గతంలో కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సీఏఏ బిల్లుకు రాధాబాయి మద్దతు తెలిపింది. అప్పుడు పార్టీ అధినేత్రి మాయావతి ఆమెను సస్పెండ్ చేశారు. ఆ తర్వాత తన మాటలను వక్రీకరించారంటూ రాధాబాయి వివరణ ఇచ్చుకున్నారు.

 

Related posts

బూతులు తిట్టడం అనేది చేతగాని వాళ్లు చేసే పని: సజ్జల!

Drukpadam

ఏపీ, చత్తీస్‌గఢ్, ఝార్ఖండ్‌లకు ప్రత్యేక హోదా ఇవ్వండి.. కేంద్రానికి విజయసాయి నేతృత్వంలోని స్థాయీ సంఘం సిఫార్సు!

Drukpadam

కేసీఆర్ వ్యాఖ్యలపై స్పందించిన కేంద్రం… ‘అపోహలు-వాస్తవాలు’ పేరిట ప్రకటన విడుదల!

Drukpadam

Leave a Comment