Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

సిద్ధూకు ఫోన్ చేసి మాట్లాడిన పంజాబ్ సీఎం…

సిద్ధూకు ఫోన్ చేసి మాట్లాడిన పంజాబ్ సీఎం…
-సిద్ధూ-కెప్టెన్ వార్ విషయంలో సిద్ధూతో మాట్లాడినట్లు వెల్లడి
-పార్టీ చీఫ్ ఎవరైనా సరే, అతను కుటుంబ పెద్ద వంటి వాడు
-సిద్దు పంజాబ్ పీసీసీ చీఫ్ పదవికి గుడ్ బై చెప్పిన అనంతరం జరిగిన పరిణామం
-రాష్ట్రంలో ప్రధాన సమస్యగా మారిన విద్యుత్ కొరత
-గ్రామాల్లో చాలా ఇళ్లలో మీటర్లు తొలగించిన వైనం
-ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం హామీ

పంజాబ్‌లో హాట్ టాపిక్‌గా మారిన సిద్ధూ-కెప్టెన్ వివాదంపై రాష్ట్ర ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ చన్నీ స్పందించారు. తాను సిద్ధూకి ఫోన్ చేసినట్లు చెప్పారు. ‘‘పార్టీ చీఫ్ ఎవరైనా సరే, అతను కుటుంబ పెద్ద వంటి వాడు. అందుకే నేను సిద్ధూకు ఫోన్ చేశా. కూర్చొని మాట్లాడుకుందామని, సమస్యను పరిష్కరించుకుందామని చెప్పా’ అని పేర్కొన్నారు. దీనిపై సిద్దు నుంచి ఎలాంటి సమాధానం వచ్చిందో ఆయన వెల్లడించలేదు .

ఇక రాష్ట్ర సమస్యలపై స్పందిస్తూ, తాను రెగ్యులర్‌గా గ్రామాల్లో పర్యటిస్తున్నానని, అక్కడ ఎలక్ట్రిసిటీ అనేది ప్రధాన సమస్యగా ఉందని తెలిపారు. భారీగా ఉన్న బిల్లులు కట్టకపోవడంతో చాలా ఇళ్లలో మీటర్లు కూడా తొలగించారని చన్నీ తెలిపారు. కాంగ్రెస్‌లో సిద్ధూ వర్గానికి చన్నీ సన్నిహితుడనే సంగతి తెలిసిందే.

పంజాబ్‌లో ఎలక్ట్రిసిటీ సమస్యపై కూడా చన్నీ స్పందించారు. రాష్ట్రంలో కరెంటు బిల్లులు కట్టలేని 53 లక్షల కుటుంబాల బాధ్యతను తాము తీసుకుంటామని చెప్పారు. వీరిలో 75-80శాతం మంది 2కేడబ్ల్యూ కేటగిరీలోకి వస్తారని, వీరి చివరి బిల్లులను తాము చూసుకుంటామని హామీ ఇచ్చారు. బిల్లులు కట్టలేదని తొలగించిన కనెక్షన్లను మళ్లీ పునరుద్ధరిస్తామని తెలిపారు.

 

 సిద్ధూపై అమరీందర్ కామెంట్స్

  • 1996లో ఇంగ్లండ్ పర్యటన నుంచి అర్ధాంతరంగా తప్పుకున్న సిద్ధూ
  • అదే సిద్ధూ అసలు బుద్ధి అంటూ అమరీందర్ కామెంట్స్
  • పంజాబ్ వంటి సరిహద్దు రాష్ట్రానికి పనికిరాడని తేల్చేసిన వైనం
Sidhu deserted Indian team in England in 1996 that is his real character says Amarinder

పంజాబ్ కాంగ్రెస్ చీఫ్‌గా నవజోత్ సింగ్ సిద్ధూ రాజీనామా చేయడం కలకలం రేపింది. ఈ క్రమంలో ‘నేను ముందే చెప్పానా?’ అంటూ మాజీ సీఎం అమరీందర్ సింగ్ చేసిన ట్వీట్ వైరల్ అయింది. ఈ క్రమంలో మరోసారి సిద్ధూ రాజీనామాపై అమరీందర్ పెదవివిప్పారు. కాంగ్రెస్ చీఫ్‌గా ఎన్నికవడం, మళ్లీ రెండు నెలల్లో రాజీనామా చేయడం అంతా సిద్ధూ డ్రామా అంటూ అమరీందర్ మండిపడ్డారు. ఇది సిద్ధూ చంచల మనస్తత్వానికి నిదర్శనమని చెప్పారు.

ఈ సందర్భంగా 1996లో టీమిండియా ఇంగ్లండ్ పర్యటనను కూడా ప్రస్తావించారు. అప్పుడు భారత జట్టును అకస్మాత్తుగా వదిలి సిద్ధూ వచ్చేయడాన్ని గుర్తుచేశారు. తాను సిద్ధూని చిన్నతనం నుంచి చూస్తున్నానని, అదే సిద్ధూ నిజమైన వ్యక్తిత్వమని చెప్పారు. పంజాబ్ వంటి సరిహద్దు రాష్ట్రాన్ని పాలించడానికి సిద్ధూ పనికిరాడని తేల్చిచెప్పారు.

పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, ఐఎస్ఐ చీఫ్ బజ్వాతో సిద్ధూకి స్నేహం ఉందని, అలాంటి వ్యక్తి పంజాబ్ సీఎం అయితే దేశానికే ప్రమాదమని హెచ్చరించారు. తన హయాంలో మంత్రి పదవి ఇచ్చినప్పుడు కూడా చాలా వరస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చాడని సిద్ధూను విమర్శించారు.

Related posts

మల్లాది వాసు సారీ !…..వల్లభనేని వంశీ పశ్చాతాపం!!…

Drukpadam

రౌడీ షీట్ ఓపెన్ చేసినా నేను రెడీ… జ‌గ‌న్‌కు లోకేశ్ స‌వాల్‌!

Drukpadam

మిర్చిరైతులకు అండగా సిపిఎం :సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం!

Drukpadam

Leave a Comment