Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

సామ్ అండ్ చై విడిపోవడంపై సమంత , నాగార్జున భావోద్యేగ స్పందన!

-కొందరు ద్రోహులు, దుర్మార్గులు తాత్కాలికంగా గెలవొచ్చు… కానీ చివరికి ఓడిపోయేది వారే: సమంత

  • -విడిపోతున్నట్టు ప్రకటించిన నాగచైతన్య, సమంత
  • -సమంత భావోద్వేగభరితమైన పోస్టు
  • -గర్భంతో ఉన్న యువతి ఫొటో పంచుకున్న సామ్
  • -చివరికి ప్రేమే గెలుస్తుందని వ్యాఖ్యలు

నాగచైతన్యతో వైవాహిక బంధం ముగిసిందని ప్రకటించిన సమంత ఇన్ స్టాగ్రామ్ లో చేసిన ఓ పోస్టు ఆసక్తి కలిగిస్తోంది. “నేను నిరాశా, నిస్పృహలో ఉన్నప్పుడు ఎక్కువగా ఓ విషయాన్ని స్మరించుకుంటూ ఉంటాను.  చివరికి గెలిచేది సత్యం, ప్రేమ అని చరిత్ర ఆసాంతం నిరూపితమైంది. కొందరు ద్రోహులు, దుర్మార్గులు, హంతకులు ఉంటారు… వారు వెన్నుపోటు పొడుస్తారు, కుట్రలు చేస్తారు. కొన్నిసార్లే వాళ్లే గెలవొచ్చు… కానీ చివరికి వాళ్లే పతనమవుతారు. దీన్ని నేనెప్పుడూ నమ్ముతుంటాను” అంటూ సమంత ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ లో పోస్టు చేశారు.

ఈ పోస్టుకు సమంతా ఉపయోగించిన బ్యాక్ గ్రౌండ్ పిక్ చర్చనీయాంశంగా మారింది. గర్భంతో ఉన్న ఓ యువతి ఫొటోపై సమంత తన మ్యాటర్ ను పొందుపరిచారు. “మా అమ్మ చెప్పింది” అనే శీర్షికన ఆమె ఈ పోస్టు చేశారు.

 

నాగచైతన్య, సమంత విడిపోవడంపై నాగార్జున భావోద్వేగమైన స్పందన!

  • -సమంత, నాగచైతన్యలు విడిపోవడం దురదృష్టకరం
  • -భార్యాభర్తల మధ్య జరిగింది వారి వ్యక్తిగతం
  • -సమంత మాకు ఎప్పుడూ ఆప్తురాలిగానే ఉంటుంది
What happened between Samantha and Naga Chaitanya is unfortunate says Nagarjuna

తామిద్దరం వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతున్నామని సమంత, నాగచైతన్య సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఈ వార్తతో ఒక్కసారిగా అందరూ షాక్ కు గురయ్యారు. మరోవైపు ఈ అంశంపై నాగచైనత్య తండ్రి నాగార్జున స్పందించారు. ‘బరువైన హృదయంతో ఈ విషయాన్ని చెపుతున్నా. సమంత, నాగచైతన్యల మధ్య జరిగినది చాలా దురదృష్టకరం. భార్య, భర్తల మధ్య ఏం జరిగిందనేని వ్యక్తిగతం. వీళ్లిద్దరూ నాకు చాలా ఇష్టమైనవాళ్లు. సమంత మాతో గడిపిన ప్రతి క్షణం మా కుటుంబానికి ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఆమె ఎప్పుడూ మాకు ఆప్తురాలిగానే ఉంటుంది. నాగచైతన్య, సమంతలకు భగవంతుడు శక్తిని ప్రసాదిస్తాడని కోరుకుంటున్నా’ అని ట్విట్టర్ ద్వారా వ్యాఖ్యానించారు.

Related posts

హైదరాబాద్ ‘జూ’ లో నిజాం కాలంనాటి ఆడ ఏనుగు కన్నుమూత!

Drukpadam

టీడీపీ నేతలపై కేసుల్లో తొందరపాటు చర్యలొద్దు: పోలీసులకు హైకోర్టు ఆదేశం!

Drukpadam

ఎర్రజెండా గొప్పతనాన్ని చాటిన మేడే ….కార్మికవాడల్లో పండుగవాతావరణం!

Drukpadam

Leave a Comment