Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఢిల్లీ సరిహద్దులలో రైతు ఉద్యమం పై పోలిసుల జులుం…

ఢిల్లీ సరిహద్దులలో రైతు ఉద్యమం పై పోలిసుల జులుం
-వాటర్ క్యానన్లతో దాడి…లాఠీలతో రైతులను చెల్లాచెదురు చేసిన పోలీసులు

-సాగుచట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులపై వాటర్ కేనన్ల ప్రయోగం
-హర్యానా ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నం
-బారికేడ్లు దూకి లోపలికి ప్రవేశించే యత్నం
-వాటర్ కేనన్లు ప్రయోగించి చెదరగొట్టిన పోలీసులు

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులపై హర్యానా పోలీసులు వాటర్ కేనన్లు ప్రయోగించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా పాల్గొంటున్న ఓ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు రైతులు ప్రయత్నించిన సమయంలో ఈ ఘటన జరిగింది. మంత్రి హాజరయ్యే కార్యక్రమం కోసం స్థానిక ప్రభుత్వ కళాశాల ప్రాంగణంలో ఏర్పాట్లు చేశారు. దీనిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన రైతులు బారికేడ్లు దూకి లోపలికి ప్రవేశించేందుకు యత్నించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు రైతులపై లాఠీచార్జ్ చేశారు. వారిని చెదరగొట్టేందుకు వాటర్ కేనన్లు ప్రయోగించారు.

మరో ఘటనలో అంబాలాలో బీజేపీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన సమావేశాన్ని కూడా రైతులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఓపీ ధన్‌కడ్, ఎమ్మెల్యే ఆర్ఎల్ కటారియా వస్తున్న విషయం తెలుసుకున్న రైతులు రోడ్డుకు అడ్డంగా బైఠాయించి అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో వీరిని చెదరగొట్టేందుకు పోలీసులు వాటర్ కేనన్లు ప్రయోగించారు.

రైతులపై వాటర్ క్యానన్లు ప్రయోగించటంపై రైతు సంఘాలు మండి పడుతున్నాయి. కేంద్రం తెచ్చిన నల్ల చట్టాలను రద్దు చేసేంతవరకు తమ పోరాటం కొనసాగుతుందని ,పోలీసులతో కేంద్రం తమ ఉద్యమనాన్ని విచ్ఛన్నం చేసేందుకు ప్రయత్నించడం నిష్ప్రయోజనం అవుతుందని రైతు సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ పేర్కొన్నది . ఇంతకూ ముందు కూడా ఇదే రీతిలో తమపై పోలీస్ నిర్బంధ కాండ కొనసాగిన విషయాన్నీ గుర్తు చేశారు. దేశవ్యాపితంగా తమకు లభిస్తున్న మద్దతు తో కంగు తిన్న కేంద్రం రైతులపై అన్ని రకాల నిర్బంధాలకు పుంజుకుంటుందని విమర్శించారు. కేంద్రం తెచ్చిన నల్ల చట్టాలు రద్దు చేయకుండ కేంద్ర చర్చలు జరపాట్లపై వారు మండి పడుతున్నారు. ఇటీవల జరిగిన బంద్ తో వ్యవసాచట్టాలు రద్దుపై దేశవ్యాపిత మద్దతు ఉందని రుజవైందని రైతు సంఘాల నేతలు గుర్తు చేస్తున్నారు .

Related posts

సిమెంట్ రేటు తగ్గించరు కానీ, సినిమా టికెట్ల ధరలు తగ్గిస్తారట!: చంద్రబాబు వ్యంగ్యం!

Drukpadam

విశాఖ లో అడుగు పెట్టనివ్వం -ఏపీ సీఎం జగన్

Drukpadam

బీజేపీకి ఝలక్ రాజకీయాలకు ఇక సెలవు…సంచలన నిర్ణయం తీసుకున్న బాబుల్ సుప్రియో!

Drukpadam

Leave a Comment