Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలురాజకీయ వార్తలు

లఖింపూర్ ఖేరీ నిరసనల్లో 8 మంది మృతి…

లఖింపూర్ ఖేరీ నిరసనల్లో 8 మంది మృతి…
కేంద్ర హోమ్ శాఖ సహాయమంత్రి కాన్వాయ్ ఢీకొని రైతుల మృతి
ఆగ్రహం చెందిన రైతులు వాహనాలకు నిప్పు
హోమ్ మంత్రి కుమారుడే వాహనం నడిపాడని ఆరోపణలు
హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న కలెక్టర్ ,ఎస్పీ
సంఘటనపై ముఖ్యమంత్రి ఆరా

ఉత్తర ప్రదేశ్‌లోని లఖింపూర్‌లో జరుగుతున్న రైతుల ఆందోళనలో 8 మంది మరణించారు. కేంద్రమంత్రి ,యూ పీ ఉపముఖ్యమంత్రి లు పాల్గొనే కార్యక్రమాల వద్ద నిరసన తెలిపేందుకు రైతులు ప్రయత్నించడంతో ఈ ఘోరం జరిగింది. కేంద్రం తెచ్చిన నల్ల చట్టాలు రద్దు చేయాలనీ గత పది నెలలుగా రైతులు ఢిల్లీ సరిహద్దులలో ఉద్యమం నడుపుతున్న సంగతి తెలిసిందే .రైతుల నిరశనపై కేంద్ర హోమ్ మంత్రి కుమారుడు వాహనం మళ్లించడం తో అక్కడ ఉన్న రైతులపైకి వాహనం వెళ్ళింది. దీంతో నిరసన తెలియజేస్తున్న అమాయక రైతు లు బలైయ్యారు. రైతులపైకి కేంద్ర హోమ్ మంత్రి కాన్వాయ్ వెళ్లి రైతులు మరణించారని వార్త తెలియడంతో యూపీ ,హర్యానా, పంజాబ్ రాష్ట్రాలలో రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు లఖింపూర్ జిల్లా మేజిస్ట్రేట్ డాక్టర్ అరవింద్ చౌరాసియా తెలిపిన వివరాల ప్రకారం కారు కింద పడి ఇద్దరు వ్యక్తులు నలిగిపోయారని, వాహనం బోల్తా పడడంతో మరో ముగ్గురు మరణించారు .

 

లఖీమ్‌పూర్‌లో ఇంటర్నేట్ బంద్, 8కి చేరిన మృతుల సంఖ్య, ప్రియాంక గాంధీ హౌస్ అరెస్ట్

రైతులు మరణించిన వార్త బయట ప్రపంచానికి తెలియకుండా ఉండేందుకు లఖిమ్ పూర్ కు అదనపు బలగాలను రప్పించారు. హింస చెలరేగడంతో ఆందోళనకారులు పలు వాహనాలకు నిప్పుపెట్టారు. పరిస్థితిని నియంత్రించేందుకు భారీగా పోలీసులను మోహరించారు. మరోవైపు ఉద్రిక్త పరిస్థితి నేపథ్యంలో అక్కడ ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు.

ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరిలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ రైతులు రోడ్డు పక్కన నిరసన తెలిపారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేశవ్ మౌర్య, కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కాన్వాయ్‌లోని వాహనాలు కొందరు రైతులను ఢీకొన్నాయని సంయుక్త కిసాన్‌ మోర్చా ఆరోపించింది. లఖింపూర్‌లో ఆందోళనకారులు పలు వాహనాలకు నిప్పుపెట్టారు. పరిస్థితిని అదుపు చేసేందుకు భారీగా పోలీసులను మోహరించారు.

 

లఖిమ్‌పూర్‌ ఖేరీలో డిప్యూటీ సీఎం కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య కార్యక్రమానికి హాజరవుతున్న విషయం తెలుసుకున్న రైతులు నల్లజెండాలతో నిరసన తెలుపాలని భావించారు. కేంద్రం తీసుకొచ్చిన చట్టాలను వెనక్కి తీసుకోవాలంటూ రోడ్డుపై బైఠాయించేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో ఓ కారు రైతులపైకి దూసుకొచ్చింది. అందరు చూస్తుండగానే రైతులను గుద్దుకుంటూ వెళ్లిపొయింది కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్‌ మిశ్రా తనయుడు ఆశీష్‌ మిశ్రా కారు నడుపుతున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. డిప్యూటీ సీఎం కేశవ్‌ ప్రసాద్‌ మౌర్యకు స్వాగతం పలికి తీసుకొచ్చేందుకు ఆశీష్‌ మిశ్రా వెళ్తున్నట్లుగా సమాచారం. విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌.. అదనపు డీజీపీ ప్రశాంత్‌కుమార్‌ను లఖిమ్‌పూర్‌ ఖేరీకి వెళ్లి పరిస్థితి సద్దుమణిగేలా చూడాలని ఆదేశించారు. పలువురు ఉన్నతాధికారులు లఖిమ్‌పూర్‌ ఖేరీలో ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు డీజీపీ ముకుల్‌ గోయల్‌ తెలిపారు. ఘటనను రైతుల హత్యగా కాంగ్రెస్‌ పార్టీ నేత రాహుల్‌ గాంధీ ఆరోపించారు. కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా సోమవారం లఖింపూర్ ఖేరిని సందర్శించి బాధిత రైతు కుటుంబాలను పరామర్శిస్తారు. ప్రియాంక గాంధీ పర్యటన నేపథ్యంలో.. ఆమెను ముందస్తుగా అరెస్ట్ చేశారు. గృహ నిర్బందం చేయడంతో.. సోమవారం లఖీమ్ పూర్ పర్యటనపై అనుమానాలు నెలకొన్నాయి.

లఖింపూర్ ఖేరిలో డిప్యూటీ సిఎం కేశవ్ ప్రసాద్ మౌర్య ప్రాజెక్టులను ప్రారంభించడానికి ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు, ఆ తర్వాత ఆయన హోం శాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా స్వగ్రామంలో మరొక కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సమాచారం అందుకున్న రైతు నాయకులు డిప్యూటీ సీఎంకు తమ నిరసన తెలియజేయడానికి తరలివచ్చారు. ఈ సమయంలో, టికునియా పట్టణంలో బిజెపి మద్దతుదారుల వాహనం ఢీకొని కొందరు రైతులు గాయపడ్డారు. ఈ సంఘటనతో ఆగ్రహించిన రైతులు ఒక కారుకు నిప్పు పెట్టారు

పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. డిప్యూటీ సీఎం కార్యక్రమం మధ్యలోనే ఆగిపోయింది. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో.. జిల్లా కలెక్టర్, పోలీసు సూపరింటెండెంట్ అక్కడికి చేరుకున్నారు. భారీగా పోలీసులను మొహరించారు. మరోవైపు, భారతీయ కిసాన్ యూనియన్ హోం శాఖ సహాయ మంత్రి కుమారుడి వాహనంతో ముగ్గురు రైతులను తొక్కించిందని ఆరోపించారు. బికేయు నాయకుడు రాకేష్ టికాయత్ లఖింపూర్ చేరుకొని చనిపోయిన రైతుల మృత దేహాలను సందర్శించి నివాళులు మరిపించి , వారి కుటుంబసభ్యులను పరామర్శించారు.

Related posts

ఎన్నికలు ఎప్పుడొచ్చినా గెలుపు మాదే: కాంగ్రెస్ ఇంచార్జి మాణిక్యం ఠాకూర్ !

Drukpadam

యూపీలో ఎన్నికల్లో మ‌హిళ చీర కొంగు లాగి రెచ్చిపోయిన ప్రత్యర్థులు !

Drukpadam

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో ఓట్ల లెక్క ప్రకారం టీఆర్ యస్ కు ఏకపక్షమే కానీ ….

Drukpadam

Leave a Comment