Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఉక్కే కదా…? అనుకుంటే తుక్కు రేగుతుంది.

ఉక్కే కదా అనుకుంటే తుక్కు రేగుతుంది విశాఖలో… ఉక్కును తక్కువ చేస్తే తమతడాక చూపిస్తామంటున్నారు.
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఏర్పాటైన పరిశ్రమను నష్టాల పేరుతొ అమ్మెందుకు సిద్ధమైంది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం . దీనిపై అన్ని రాజకీయపార్టీలు ఆందోళన బాట పట్టాయి. ఉక్కు కదా అనుకుంటే తుక్కురేగుతుందని అంటున్నారు. విశాఖ వాసులు . ఇప్పటికే విశాఖ నగరం హీటెక్కింది . ప్రదర్శనలు ,దీక్షలు , సభలు సమావేశాలతో నగరం బిజీగా మారింది. తెలుగుదేశానికి చెందిన ఘంటా శ్రీనివాసరావు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. మరో నేత శ్రీనివాసరావు ఆమరణ దీక్ష చేపట్టారు. వామపక్షాలు , కార్మిక సంఘాల ఆందోళనలతో విశాఖనగరం అట్టుడుకుతోంది. అధికారంలో ఉన్న వైకాపా పై దీన్ని నిలబెట్టాల్సిన ప్రధాన భాద్యత ఉంది. అని ప్రతిపక్ష తెలుగుదేశం పక్కకు తప్పుకుంటే ప్రజలు క్షమించరు .రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసి వచ్చే అసెంబ్లీ నాటికి బలమైన శక్తిగా నిలవాలనే బీజేపీ ఆశలకు ఇది గండి కొట్టే ఆవకాశం ఉందని పరిశీలకుల అభిప్రాయం. ఇప్పటికే ప్రత్యేక హోదా విషయంలో మాటతప్పిందనే అభిప్రాయాలూ బీజేపీ పై ఉన్నాయి. రాష్టంలో బీజేపీ పార్ట్నర్ గా ఉన్న జనసేన ఉక్క ఫ్యాక్టరీ విషయంలో కేంద్రంలో బీజేపీ పెద్దలను కలుస్తామని ఢిల్లీ వెళ్లి కలిసిన తరువాత మాట్లాడటంలేదనే విమర్శలు ఉన్నాయి.ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్ జగన్ మోహన్ రెడ్డి ప్రధానికి లేఖ రాశారు. విశాఖ ఉక్కుకు మైన్స్ కేటాయించి ఆదుకోవాలని కోరారు. దీనితో సరిపోదని దీనిపై ఒక నిర్ణయం చేసేవరకు కేంద్రం వెంటపడాలని డిమాండ్ చేస్తున్నారు విశాఖవాసులు . ఇక చంద్రబాబు దీన్ని జగన్ పై నెట్టి విశాఖలో రాజకీయం చేయాలనీ చూస్తున్నారు.ఎవరికీ వారు తప్పించుకుంటే కుదరనేది విశాఖవాసులు మాట . విశాఖ ఉక్కు ప్రవేటీకరణ ఆపాలని జరుగుతున్నా ఆందోళన రాష్ట్ర వ్యాపితం కానున్నది. ఇప్పటికే తిరుపతిలో సీఐటీయూ ఆధ్వర్యంలో కడప లో ఉక్కు ఫ్యాక్టరీ నెలకొల్పాలని , విశాఖ ఉక్కు ప్రవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ తిరుపతి నుంచి కడపకు బైకు ర్యాలీ నిర్వహిస్తున్నారు.

అసలు విశాఖ ఉక్కుకోసం1966 నవంబర్ 1 వతేదీన ప్రారంభమైంది ఉద్యమం . నాటినుంచి ఉక్కు ఫ్యాక్టరీ సాధించేవరకు విశ్రమించలేదు. ఉమ్మడి రాష్ట్ర వ్యాపితంగా అనేక ఆందోళనలు జరిగాయి. 32 మంది ప్రాణాల బలిదానం తో విశాఖ ఉక్కును నాటి కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి అంగీకరించక తప్పింది కాదు. 7 .5 లక్షల మిలియన్ టన్నుల సామర్థ్యం తో ఉన్న ఉక్కు పరిశ్రమ ప్రస్తుతం 6 .5 లక్షల మిలియన్ టన్నుల ఉక్కును ఉత్పత్తి చేస్తుంది. 20 వేల ఎకరాలలో ఏర్పాటైన ఈ ప్రతిష్టాత్మక పరిశ్రమకు 1971 లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ శంఖుస్థాపన చేశారు.1977 నిర్మాణం ప్రారంభమైంది . రాష్ట్ర ప్రభుత్వం కూడా 10 వేల కోట్ల రూపాయలు ఇచ్చింది . 1979 రష్యాతో ఒప్పందం కుదిరింది.3897 .28 కోట్ల అంచనాలతో 3 .4 మిలియన్ టన్నుల సామర్థ్యం తో కర్మాగారాన్ని ప్రారంభించారు. 1987 నాటికీ గానీ కర్మాగారం పూర్తికాలేదు.1990 లో ఉత్పత్తి ప్రారంభమైంది. 1992 ఆగస్టు 8 న అప్పటి ప్రధాని పి,వి నరసింహారావు విశాఖ ఉక్కు పరిశ్రమను జాతికి అంకితం చేశారు. నిర్మాణవ్యయం 9 వేలకోట్లకు చేరుకుంది.1994 లో 50 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ప్రారంభంలో ఉక్కు ఉత్పత్తిలో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచి ఖ్యాతిగడించిన పరిశ్రమ రానురాను నిధులు లేక నిరసించింది.1998 -2000 సంత్సరాలలో ఖాయిలా పరిశ్రమగా ప్రకటించటంతో కార్మికసంఘాలు ,రాజకీయపార్టీలు ఆందోళన బాటపట్టాయి. దీంతో దిగివచ్చిన కేంద్రం అప్పులలో వడ్డీలను ఈక్విటీలుగా మార్చింది. ఆ తరువాత ప్రపంచంలోనే అగ్రగామిగా మారింది. కానీ నేడు నష్టాల పేరుతో దాన్ని ప్రవేట్ పరం చేయాలనీ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించటం పై భగ్గుమంటున్నారు. గత ప్రభుత్వాలు ఆదుకొని ప్రభుత్వ రంగంలో నిలిపిన పరిశ్రమలను తెగనమ్మే చర్యలపై విమర్శలు వెల్లు ఎత్తుతున్నాయి .

Related posts

మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కు హరీశ్ రావు కౌంటర్!

Drukpadam

శాసనసభలో చాడ వెంకటరెడ్డి ప్రసంగాల పుస్తక ఆవిష్కరణ …..

Drukpadam

వరుసగా రెండో రోజూ రేవంత్​ హౌస్​ అరెస్ట్​.. రేవంత్ ఇంటి వద్ద ఉద్రిక్తత!

Drukpadam

Leave a Comment