Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

షర్మిల రాజకీయాలు వైయస్ ,కేసీఆర్ కుటుంబాల డ్రామానా ?

షర్మిల రాజకీయాలు వైయస్ ,కేసీఆర్ కుటుంబాల డ్రామానా ?
-కేసీఆర్ కు మేలు చేసేందుకే షర్మిల అడుగులు వేస్తున్నారా ?
-కాంగ్రెస్, బీజేపీల విమర్శలు నిజమేనా ?
-అన్న అండదండలు కూడా ఉన్నాయా ?
షర్మిల రాజకీయాలు వైయస్ , కేసీఆర్ కుటుంబాల డ్రామానా ? …. కేసీఆర్ కు మేలు చేసేందుకే ఆమె అడుగులు వేస్తున్నారా? అన్నఅండదండలు , ఆమెకు ఉన్నాయా ?…. కాంగ్రెస్ ,బీజేపీ ల విమర్శలు నిజమేనా ….? ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారిన చర్చ…. ఇందులో నిజం ఎంత ….. నిజంగానే వైయస్ కుటుంబానికి , కేసీఆర్ కుటుంబానికి మధ్య అంత స్నేహ పూర్వక సంబంధాలు ఉన్నాయా ?కేసీఆర్ కు మేలు చేసేందుకు వైయస్ కుటుంబాన్ని రంగంలోకి దించారా…? ఉన్నట్లు ఉండి షర్మిల రాజకీయ రంగ ప్రవేశంపై రకరకాల పుకార్లు . ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు , తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. ఆయనకు నష్టం చేసేవిధంగా తెలంగాణాలో ఏమి చేయకూడదనేది కూడా జగన్ అభిప్రాయం . అందువల్ల షర్మిల పార్టీ వెనక కేసీఆర్ ఉన్నారనే ప్రచారానికి అవకాశం కలుగుతుంది. తెలంగాణాలో కేసీఆర్ ప్రభుత్వానికి ప్రజలలో వ్యతిరేకత ప్రారంభమైందనే అభిప్రాయాలూ ఉన్నాయి. ఇటీవల దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక , గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలలో టీఆర్ యస్ పట్ల ప్రజలలో ఉన్న వ్యతిరేకత అర్థం అయింది. పట్టభద్రుల ఎన్నికలు,ఖమ్మం ,వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు , నాగార్జున సాగర్ ఉప ఎన్నిక టీఆర్ యస్ కు ప్రతిష్టాత్మకంగా మారాయి . దీంతో రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్నా పరిణామాల నేపథ్యంలో తమకు దూరం అవుతున్న సామజిక వర్గాలను కట్టడి చేయాలనే ఉద్దేశంతో షర్మిల ను రాజకీయ పార్టీ పెట్టాలని కేసీఆర్ ప్రొత్సావించారనేది కాంగ్రెస్ అభిప్రాయం .ఇలాంటి అభిప్రాయాన్నే బీజేపీ కూడా వ్యక్తం చేస్తుంది.దాదాపు రెండు సంవత్సరాలు రాజకీయాలకు దూరంగా ఉన్న షర్మిల కు అందునా తెలంగాణాలో పార్టీ పెట్టాలని ఇక్కడ రాజన్న రాజ్యం తేవాలని ఎందుకు  అనిపించింది. అనే సందేహాలు కలగటం సహజం . అందుకనే ఆమె జగనన్న వదిలేసినా బాణం ,ఇప్పుడు కేసీఆర్ బాణం అంటూ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అంటున్నారు. ఇది కచ్చితంగా కేసీఆర్ రాజకీయ కుట్రలో భాగమేనని బీజేపీ ఆరోపణ . తెలంగాణ రాజకీయాలలో దుబ్బాక , గ్రేటర్ ఎన్నికల తరువాత బీజేపీ దూకుడు పెంచింది. ఆరెండు చోట్ల కారణాలు ఏమైనా బీజేపీ కి అనుకూలంగా ఫలితాలు వచ్చాయి. దీంతో వారు 2023 ఎన్నికలలో తమదే అధికారం అంటున్నారు. పైగా బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. అవకాశం దొరికినప్పుడల్లా కేసీఆర్ పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. రాష్టంలో ప్రత్యాన్మాయం బీజేపీనే అనే టాక్ బయలు దేరింది. అనేక జిల్లాలలో బీజేపీ వైపు నాయకులూ మొగ్గు చూపుతున్నారు. దీంతో టీఆర్ యస్ ఆలోచనలో పడింది. ఇప్పటి నుంచే సరైన ఎత్తుగడలు వేయకపోతే ప్రతికూల ఫలితాలు ఉంటాయనే అభిప్రాయంతో కేసీఆర్ ముందుచూపుతో అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగానే షర్మిల ను పెట్టి రెడ్డి సామాజికవర్గం దూరంకాకుండా చేసుకుంటున్నారనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి. బలమైన రెడ్డి సామజిక వర్గం ఇప్పటికి కాంగ్రెస్ కు అనుకూలంగా ఉంది. వారు కాంగ్రెస్ ను వీడి ఇప్పుడిప్పుడే బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు. డీ కే అరుణ , జితేందర్ రెడ్డి , లాంటి వారు చేరారు. కిషన్ రెడ్డి, ఇంద్రసేనా రెడ్డి లాంటి వారు ఉన్నారు. రేవంత్, కోమటి రెడ్డి బ్రదర్స్ కోసం బీజేపీ గాలం వేస్తుంది. జానారెడ్డి కోసం ప్రయత్నాలు చేసిందనే వార్తలు వచ్చాయి. బలమైన నేతలుగా ఉన్న ,కొండా విశ్వేశ్వర రెడ్డి , పొంగులేటి శ్రీనివాస రెడ్డి లకోసం ప్రయత్నాలు కొనసాగిస్తుంది. అందువల్ల ఓటర్లను ప్రభావితం చేసే రెడ్డి సామజిక వర్గం కీలకమైనందున వారికీ అడ్డుకట్ట వేసేందుకే షర్మిల ను వ్యూహాత్మకంగా కేసీఆర్ తెలంగాణ రాజకీయాలలో దింపుతున్నారని ప్రచారం ఉంది. ఈ విషయం జగన్ కు కూడా తెలుసునని ప్రచారం ఉండగా తమ పార్టీకి గానీ జగన్ కు గానీ ఎలాంటి సంబంధం లేదని పార్టీ పెట్టె ఆలోచన విరమించుకోవాలని షర్మిలను కోరామని ఆపార్టీ నేత సజ్జల రామకృష్ణరెడ్డి చెబుతున్నారు. వివిధ పార్టీలమీద ఒంటికాలిపై లేచే టీఆర్ యస్ మంత్రులు నాయకులూ షర్మిల పార్టీపై పెద్దగా స్పందిచకపోవటంతో వీరి బంధాలపై అనుమానాలకు తావిస్తుంది.

Related posts

వీధి రౌడీలా చంద్రబాబు ….ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి !

Drukpadam

జ‌గ‌న్‌ను కూడా బీజేపీ వ్య‌తిరేక కూట‌మిలో చేర్చుకోవాలి!… కేసీఆర్‌కు సీపీఐ నారాయ‌ణ స‌ల‌హా!

Drukpadam

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత కిషోర్ సంచలన నిర్ణయం

Drukpadam

Leave a Comment