Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

నిమ్మగడ్డ వైఖరి వైసిపి కి లాభం చేసిందా …?

నిమ్మగడ్డ వైఖరి వైసిపి కి లాభం చేసిందా …?
నిమ్మగడ్డ రమేష్ కుమార్ వైఖరి వైకాపాకు లాభం చేకూర్చిందా? అంటే అవుననే అంటున్నారు. పరిశీలకులు . ఆయన చేసిన వత్తిడి,చేసిన హంగామా , ఏపీ రాజకీయాలను హిట్ ఎక్కించాయి . రమేష్ కుమార్ ……ఏపీ ఎన్నికల రాష్ట్ర ప్రధాన కమిషనర్…… స్థానిక సంస్థల ఎన్నికలలో ఆయన ప్రభుత్వానికి కొరకరాని కొయ్యగా మారారు ……… ఎన్నికల నిర్వహణ విషయంలో రాష్ట్రంలో ఉన్న అధికార వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల సంఘం ప్రధాన కార్యదర్శిగా ఉన్న రమేష్ కుమార్ కు మధ్య పచ్చగడ్డి వేస్తె భగ్గుమనే వైషమ్యాలు ఉన్నాయి. ఆయన చంద్రబాబు నాయుడు నియమించిన వ్యక్తి అయినందున రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారనే ముద్ర పడ్డారు. అయితే అది ఒకందుకు వైకాపాకు లాభం చేసిందనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి. నిమ్మగడ్డ వైకాపాకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలకు ప్రత్యేకంగా తెలుగుదేశానికి అనుకూలంగా వ్యవరించటం అనే విమర్శలు వెల్లు ఎత్తిన నేపథ్యంలో అనేక ఇబ్బందులు పడ్డారు. పైగా వైకాపాకు వ్యతిరేకంగా ఏ నిర్ణయం తీసుకోవాలన్న ఆయన పై పడ్డ ముద్రతో కావాలనే ఆయన ఆలా వ్యవహరిస్తున్నారని ప్రచారం జరిగింది. దీనితో ఒక రకంగా వైకాపాకు మంచే జరిగిందని కొందరి అభిప్రాయం . అంతే కాకుండా ఆయన తీసుకున్న అనేక నిర్ణయాలు వివాదాస్పదం అయ్యాయి. మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి , బొత్స సత్యనారాయణ,సజ్జల రామకృషరెడ్డి లపై గవర్నర్ కు ఫిర్యాదు చేయటమే కాకుండా పెద్దిరెడ్డిని గృహ నిర్బంధం చేస్తూ ఆదేశాలు జారీచేయటం తీవ్ర విమర్శలకు దారి తీసింది. దీంతో ఆయన కోర్ట్ ను ఆశ్రయించారు. కోర్ట్ నిమ్మగడ్డ చర్యలను కొట్టి వేసింది.జోగిరమేష్ విషయంలోనూ అదే జరిగింది. అదే సందర్భంలో తెలుగుదేశం మానిఫెస్టో విడుదల చేసింది. గ్రామ పంచాయతీల ఎన్నికలు పార్టీల రహితంగా జరుగుతాయి. వాటికీ పార్టీలకు నేరుగా ఏసంబంధం ఉండదు. అందువల్ల తెలుగుదేశంపై చర్యలు తీసుకోవాలని వైకాపా ఎన్నికల కమిషనర్ కు ఫిర్యాదు చేసింది. నిమ్మగడ్డ వారి మానిఫెస్టో ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించి చేతులు దులుపుకున్నారు. తెలుగుదేశం విడుదల చేసిన మానిఫెస్టో అప్పటికే చాల రోజులు అయింది. ప్రజలలోకి వెళ్ళింది . వెళ్లిన మానిఫెస్టో రద్దు చేస్తున్నానని ప్రకటించటం హాస్యాస్పదంగా ఉందనే అభిప్రాయాలూ వ్యక్తం అయ్యాయి. ఒకరకంగా చెప్పాలంటే ఆయన ప్రతి విషయంలోనూ తెలుగుదేశం చెప్పినట్లు నడుచుకుంటున్నాడని ప్రజలలో బాగాప్రచారం జరిగింది. ప్రజలలో ఎన్నికల కమిషన్ తీసుకుంటున్న చర్యలు ఏకపక్షంగా ఉన్నాయనే అభిప్రాయాలూ వ్యక్తం కావటం వైకాపాకు కలిసి వచ్చింది. వైకాపా శ్రేణులు కూడా అప్రమత్తం అయ్యాయి.రాష్ట్రం లో ఒకరకమైన వాతావరం నెలకొన్నది. నిమ్మగడ్డను ప్రభుత్వానికి , వైకాపాకు నిత్యం తగాదాలు అధికారులపై చర్యలు ,నిమ్మగడ్డను ఆకాశానికి వేట మీడియా,ఒకవైపు , మరో వైపు ఆయన చర్యలను తూర్పారబట్టే మీడియా ఒకవైపు రెండు చీలాయి. దీంతో వైకాపా బాగా ఎలర్ట్ అయింది. ఎక్కడికక్కడ ఎన్నికలలో తమ సత్తా చాటాలని నిర్ణయానికి వచ్చారు.మంత్రులు ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలు , ఎంపీలు ఎవరికీ వారు పంచాయతీలలో తమకు అనుకూలమైన వారిని గెలిపించుకునేలా ప్రణాళికలు రూపొందించారు. ఫలితంగా వైకాపా పంచాయతీ ఎన్నికలలో విజయవంతం అయింది. రమేష్ కుమార్ ఒకరంకంగా వైకాపాకు మేలు చేశాడనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి. అంతే కాకుండా మున్సిపాలిటీలకు , జడ్పీలకు ,ఎంపీపీలు ఎన్నికలు జరపాల్సి ఉండగా మార్చ్ లో రమేష్ కుమార్ రిటైర్ అయినా తరువాత జరుపుదామని భావించినప్పటికీ అయినా ఉండగానే ఎన్నికలు జరపాలనే నిర్ణయించుకున్నారు. ఆయన కూడా ప్రభుత్వంపై అధికారులపై కొంత దూకుడు తగ్గించాడు. మొదటి దశలో ఎన్నికలు జయప్రదంగా నిరాయించేందుకు తోడ్పడిన అధికారులను అభినందించారు. గత సంవత్సరం నిలిచిపోయిన దగ్గరనుంచి తిరిగి ఎన్నికలు నిరాయించనున్నట్లు ప్రకటించారు. మందు తెలుగుదేశం తో సహా ప్రతి పక్షాలు గతంలో జరిగిన ఎన్నికలను రద్దు చేస్తారనే అనుకున్నాయి. వారి అంచనాలను తలకిందులు చేస్తూ నిమ్మగడ్డ నిర్ణయం వారికీ ఆశ్చర్యాన్ని కలిగించాయి. జగన్ తో నిమ్మగడ్డ మిలాఖత్ అయ్యారనే అనుమానాలు బయలుదేరాయి. సో మొత్తానికి ఏపీలో స్థానిక ఎన్నికల ఎపిసోడ్ కు తెరపడినట్లే నేనే భావన నెలకొన్నది .

Related posts

బండి సంజయ్ మార్పును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఆరెస్సెస్…

Drukpadam

నీరవ్ మోదీ అన్నంత మాత్రాన ఆయనను సస్పెండ్ చేసేస్తారా?: మల్లికార్జున ఖర్గే

Ram Narayana

బండి సంజయ్ ది ప్రజా సంగ్రామ యాత్ర కాదు ప్రజా వంచన యాత్ర :కేటీఆర్ ఫైర్!

Drukpadam

Leave a Comment