Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

రైతు ఉద్యమం నుండి మోడీ తప్పించుకోలేరు- డాక్టర్ ఆశిష్ మిట్టల్

రైతు ఉద్యమం నుండి మోడీ తప్పించుకోలేరని ఢిల్లీ రైతు ఉద్యమ కోర్ కమిటీ సభ్యులు అఖిల భారత రైతు కూలీ సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆశిష్ మిట్టల్ అన్నారు. రైతు వ్యతిరేక 3 వ్యవసాయ చట్టాలను తెచ్చిన ప్రధానమంత్రి నరేంద్రమోడీ రైతులు చేస్తున్న రైతు ఉద్యమం నుండి ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేరని సోమవారం రాత్రి సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో ఖమ్మం డెవిల్ గ్రౌండ్ లో రైతు గర్జన సభ జరిగింది ఈ సభలో పాల్గొన్న మిట్టల్ మాట్లాడుతూ మూడు వ్యవసాయ చట్టాలతో వ్యవసాయ రంగాన్ని మొత్తం కార్పొరేట్ శక్తులు పెట్టడమే కాకుండా ప్రకృతి సంపదలు అన్నీ కూడా వారి చేతుల్లోకి వెళ్తాయి అన్నారు.అందుకోసమే రైతాంగ ఉద్యమానికి ముస్లింలు సిక్కులు కాదు ప్రపంచం మొత్తం తమ మద్దతు రైతు ఉద్యమానికి తెలియజేస్తున్నారు మోడీ హిట్లర్ లాగా వ్యవహరిస్తున్నాడు మోడీ తెచ్చిన చట్టాలతో రైతులు తమ అస్తిత్వాన్ని కోల్పోతారు రైతులు పండించిన పంటకు మద్దతు ధర నిర్ణయించారు ప్రభుత్వం కూడా తమ బాధ్యత ఉండదు రైతుల అభిప్రాయాలకు అవకాశమే లేదు అందుకే ఈ చట్టాలను వెంటనే రద్దు చేయాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు.

Related posts

ఈడీ ప్ర‌శ్న‌కు తానిచ్చిన‌ ఆన్స‌ర్‌ను చెప్పిన రాహుల్ గాంధీ.. సోష‌ల్ మీడియాలో ట్రోలింగ్!

Drukpadam

బీజేపీ విధానాలపై సీపీఎం ప్రజాగర్జన….తమ్మినేని

Drukpadam

గ‌వ‌ర్న‌ర్ వ‌ద్ద‌కు ఏపీ కొత్త జిల్లాల ఆర్డినెన్స్‌

Drukpadam

Leave a Comment