భట్టి విక్కమార్క
సీఎల్పీ నాయకులు
మన రాష్ట్రంలో వక్ఫ్ బోర్డు భూములు అన్యాక్రాంతం అయ్యాయి. అన్యాక్రాంతం అయిన భూములు తిరిగి వెనక్కు తీసుకోలేదు. వాటిని వెనక్కు తీసుకునే ఆలోచన ప్రభుత్వానికి ఏమైన ఉందా? అని సీఎల్పీ నేత భట్టి ప్రశ్నించారు.
వక్ఫ్ బోర్డు భూముల అన్యాక్రాంతం అయిన భూములను కాపాడేందుకు వేసిన హౌజ్ కమిటీ.. ఈ నాటి వరకూ తీసుకున్న నిర్ణయాలను సభలో పెట్టినట్టు లేదు.
హౌజ్ కమిటీ నిర్ణయాలపై చర్చ జరగాలి.
కాంగ్రెస్ శాసనసభా పక్షం నుంచి కొన్ని నిర్దిష్టమైన ఆలోచనలను సభతో పంచుకోవాలి అని అన్నారు
మమనమంతా భారతీయులం.. ఇక్కడ జీవించడం, సమానంగా ఎదగడం, సమాన అవకాశాలు పొందడం, అలా ఉండేలా చూడడం మనందరి భాధ్యత.
రాష్ట్రంలో మైనార్టీ సోదరులు, మైనార్టీలు ఎక్కువగా నివాసముంటున్న ప్రాంత వెనుకబాటుతనాన్ని మనమంత కలిసి ఆలోచన చేసి వారందరినీ ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ శాసనసభా పక్షం నమ్ముతోంది.
దేశ స్వాతంత్ర్యంలోనూ, నవభారత నిర్మాణంలోనూ, మైనార్టీ సోదరులు త్యాగాలు, పాత్ర చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి.
ఇంక్విలాబ్ జిందాబాద్ అనే స్లోగన్ ను ఇచ్చింది.. ఒక ముస్లిం కవి.. మౌలానా అస్రత్ గారు ఇచ్చారు. ఇంక్విలాబ: జిందాబాద్ అనే నినాదంతోనే భగత్ సింగ్ లాంటి వారు స్వాతంత్ర పోరాటం చేశారు.
నిజాం నిరంకుశ పరిపాలనలో, రాజాకార్ల చేతిలో ఈ ప్రాంత రైతాంగ సోదరులు నలిగిపోతున్న సమయంలో కూడా ఎందరో మైనార్టీ సోదరులు ముందుకు వచ్చి సాయుధ రైతాంగ పోరాటానికి మద్దతు ఇచ్చారు.
రావినారాణరెడ్డి, దొడ్డి కొమరయ్య, చాకలి ఐలమ్మ, రామానంద తీర్థవంటి వారితో కలిసి పనిచేసిన ముస్లిం మైనార్టీ సోదరులు షోయబుల్లాఖాన్, మగ్దూం మొహియుద్దీన్, జవాద్ రజ్వీగారు ..
తెచ్చుకున్న స్వతంత్ర భారతంలో అందరూ సమానంగా బతకాలి.. అందరూ ఆత్మగౌరవంతో బతకాలి. అందరికీ సమానంగా వనరులు పంచబడాలి.
అందరికీ అవకాశాలు ఇవ్వాలన్న ఆలోచనతో గతంలో ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లిం, మైనార్టీ సోదరులకు 4 శాతం రిజర్వేషన్లను కల్పించింది.
స్వతంత్ర భారతదేశానికి జాకీర్ హుస్సేన్, ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ లను కాంగ్రెస్ పార్టీ రాష్ట్రపతులను చేసింది.
ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తానన్న కేసీఆర్ తన మాటను నిలబెట్టుకోవాలి.