Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

లఖీంపూర్‌ హింసాకాండ: సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు…

లఖీంపూర్‌ హింసాకాండ: సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు…

  • -ఇలాంటి ఘోరాలు జరిగినప్పుడు ఎవరూ బాధ్యత తీసుకోరని వ్యాఖ్య 
  • -జంతర్‌ మంతర్‌ వద్ద నిరసన తెలిపేందుకు అనుమతి కోరుతూ రైతుల పిటిషన్ 
  • -వ్యవసాయ చట్టాలు అమలు కాకుండానే నిరసనలు ఎందుకని ప్రశ్న 

దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన లఖీంపూర్‌ ఖేరి హింసాకాండపై సుప్రీంకోర్టు పరోక్ష వ్యాఖ్యలు చేసింది. ఇలాంటి ఘోరాలు జరిగినప్పుడు ఎవరూ బాధ్యత తీసుకోరని అసంతృప్తి వ్యక్తం చేసింది. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశరాజధాని ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద నిరసన చేయాలని కొన్ని రైతు సంఘాలు నిర్ణయించాయి. దీనికి అనుమతి కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి.

ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు పైవ్యాఖ్యలు చేసింది. కేంద్రం ప్రతిపాదించిన వ్యవసాయ చట్టాలు ఇంకా దేశంలో అమల్లోకి రాలేదని, అలాంటప్పుడు నిరసనలు ఎందుకని ప్రశ్నించింది. ఇలా నిరసనలు చేసే సమయంలో లఖీంపూర్‌ వంటి ఘటనలు జరిగితే ఎవరూ బాధ్యత తీసుకోరని అసంతృప్తి వ్యక్తం చేసింది.

కాగా, ఉత్తరప్రదేశ్‌లోని లఖీంపూర్‌లో జరిగిన హింసాకాండలో 8 మంది మృత్యువాత పడ్డారు. కేంద్రమంత్రి తనయుడి కారును రైతులు అడ్డుకోవడంతో ఈ ఘర్షణ జరిగింది. ఆ కారు ఆగకుండా ముందుకు దూసుకుపోవడంతో కొందరు రైతులకు గాయాలయ్యాయి. దీంతో ఘర్షణ జరిగి 8 మంది మరణానికి దారి తీసింది.

Related posts

కరోనా తర్వాత పెరిగిపోయిన దీర్ఘకాలిక వ్యాధులు..!

Drukpadam

నల్గొండలో కుందూరు రఘువీర్ రెడ్డికి 5 లక్షలకు పైగా మెజార్టీ…

Ram Narayana

ఈవీఎంల ద్వారా ఎన్నికలు నిర్వహిస్తే పోటీ చేయను: రాచమల్లు శివప్రసాద్ రెడ్డి!

Ram Narayana

Leave a Comment