లఖిమ్ పూర్ ఖేరి ఘటనలో చనిపోయిన జర్నలిస్ట్ ఐ జె యూ సభ్యుడు!
-న్యూస్ కవర్ చేసేందుకు వెళ్లి కారు కింద నలిగిపోయిన రమణ్ కశ్యప్
-రైతుల నిరసనను కవర్ చేయడానికి వెళ్లిన కశ్యప్
-అతనిపై నుంచి దూసుకుపోయిన కారు
-కొడుకు మృతదేహాన్ని గుర్తుపట్టిన తండ్రి
ఉత్తరప్రదేశ్ లోని లఖింపూర్ ఖేరీ ఘటనలో నలుగురు రైతులతో పాటు మొత్తం ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. రైతులు నిరసన చేస్తున్న సమయంలో ఆ కార్యక్రమాన్ని కవర్ చేయడానికి స్థానిక ఛానల్ కు చెందిన రిపోర్టర్ రమణ్ కశ్యప్ (35) అక్కడకు వెళ్లారు. రమణ కశ్యప్ ఉత్తర ప్రదేశ్ శ్రమజీవి పత్రికార్ సంఘటన రాష్ట్ర సమితి సభ్యుడు .జర్నలిస్ట్ సమస్యల పరిస్కారం కోసం జరిగే ఆందోళనలో కశ్యప్ ఎప్పుడు ముందుటారని ఆ రాష్ట్ర అధ్యక్షుడు రాజేష్ త్రివేది , ప్రధాన కార్యదర్శి రమేష్ శంకర్ పాండే అన్నారు. కశ్యప్ మృతిపట్ల వారు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. దీనిపై విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. వారు కుటుంబానికి 50 లక్షల ఎక్సగ్రెసీవో అందించాలని కోరారు .
కేంద్రం తెచ్చిన రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయాల్సిందేనని జరుగుతున్న ఉద్యమం లో భాగంగా రైతులు కేంద్ర,రాష్ట్ర మంత్రుల పర్యటనలలో నిరసన తెలిపేదుకు వచ్చారు. రైతులు శాంతియుతంగా నిరసన తెలుపుతున్న సమయంలో వారిపైకి కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కాన్వాయ్ లోని ఒక కారు దూసుకుపోయింది. ఈ కారును అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా నడుపుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కారు కింద పడి రమణ్ కశ్యప్ నలిగిపోయాడు. ఘటన జరిగిన కొన్ని గంటల తర్వాత ఆయన మృతదేహాన్ని గుర్తించారు. ఆ మృతదేహం ఎవరిది అనే విషయం తొలుత ఎవరికీ అర్థం కాలేదు. శవాన్ని అతని తండ్రి గుర్తించిన తర్వాత కానీ అతను ఎవరనే విషయం వెలుగులోకి రాలేదు.
ఈ ఘటనపై రమణ్ తండ్రి రామ్ దులారీ మాట్లాడుతూ… ప్రమాదం జరిగినప్పటి నుంచి తన కుమారుడి ఆచూకీ దొరకలేదని చెప్పారు. మరుసటి రోజు రాత్రి 3 గంటలకు గుర్తు తెలియని మృతదేహం గురించి తనకు ఫోన్ కాల్ వచ్చిందని… తాను మార్చురీకి వెళ్లానని… ఆ మృతదేహం తన కొడుకుదేనని ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు.
రమణ కశ్యప్ ను అత్యంత దుర్మార్గంగా కార్ తో తొక్కించి ఆయన మరణానికి కారణమైన కేంద్రమంత్రి కొడుకుపై చర్యలు తీసుకోవాలని ,వారికుటుంబాన్ని ఆదుకోవాలని ఐ జె యూ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి కార్యదర్శి బల్విందర్ జమ్ములు డిమాండ్ చేశారు. కశ్యప్ మృతికి తీవ్ర సంతాపం ప్రకటించారు. కశ్యప్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం 50 లక్షల రూపాయలు సహాయం అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేని యెడల దేశవ్యాపిత ఆందోళన చేపట్టనున్నట్లు హెచ్చరించారు.