క్రైమ్ వార్తలు

ప్రియుడిని ఇంటికి పిలిపించుకున్న యువతి.. సన్నిహితంగా ఉండగా చూశారని చెల్లెళ్ల హత్య

  • ఉత్తరప్రదేశ్‌లోని బల్రాయ్ పోలీస్ స్టేషన్‌లో ఘటన
  • తల్లిదండ్రులు లేకపోవడంతో ప్రియుడిని ఇంటికి పిలిపించుకున్న యువతి
  • చెల్లెళ్లను ఎవరో చంపేశారని నమ్మించే యత్నం
  • దుస్తులపై రక్తపు మరకలతో దొరికిపోయిన నిందితురాలు
Girl killed her sisters as they saw her with boy friend

తల్లిదండ్రులు ఇంట్లో లేకపోవడంతో ప్రియుడిని ఇంటికి పిలిపించుకుందో యువతి. వారిద్దరూ సన్నిహితంగా ఉండడం చెల్లెళ్లు చూశారు. ఈ విషయాన్ని వారు తల్లిదండ్రులకు ఎక్కడ చెప్పేస్తారోనన్న భయంతో వారిని దారుణంగా హతమార్చింది. ఉత్తరప్రదేశ్‌లోని బల్రాయ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందీ ఘటన. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బహదూర్‌పూర్ గ్రామానికి చెందిన అంజలి (20) కొన్నాళ్లుగా ఓ యువకుడిని ప్రేమిస్తోంది.

ఇటీవల తల్లిదండ్రులు బయటకు వెళ్లడంతో ప్రియుడ్ని నేరుగా ఇంటికి పిలిపించుకుంది. అతడితో సన్నిహితంగా ఉండగా ఆమె ఆరు, నాలుగు సంవత్సరాల వయసున్న చెల్లెళ్లు చూశారు. దీంతో ఈ విషయాన్ని వారు తల్లిదండ్రులు చెప్పేస్తారేమోనన్న భయంతో వారిద్దరినీ పదునైన ఆయుధంతో హతమార్చింది.

ఇంటికి వచ్చిన తల్లిదండ్రులకు చెల్లెళ్లను ఎవరో చంపేశారని చెప్పి వారిని నమ్మించే ప్రయత్నం చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో అంజలి దుస్తులపై రక్తపు మరకలు ఉండడాన్ని గుర్తించి ప్రశ్నిస్తే అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ హత్యలో ఆమెకు మరికొందరు సహకరించినట్టు అనుమానిస్తున్న పోలీసులు అంజలిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Related posts

నిద్రమాత్రలిచ్చి.. ప్రియుడితో కుమార్తెపై అత్యాచారం చేయించిన తల్లి!

Ram Narayana

పంజాబ్‌ మిలటరీ స్టేషన్‌లో కాల్పుల కలకలం…!

Drukpadam

కర్ణాటకలో హైదరాబాద్ బిల్డర్ దారుణ హత్య.. వెంట వెళ్లిన వారే హంతకులా?

Ram Narayana