Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
సినిమా వార్తలు

మా ఎన్నికలు ….రెండుగా విడిపోయిన సినీ దిగ్గజాలు…

మా ఎన్నికలు ….రెండుగా విడిపోయిన సినీ దిగ్గజాలు…
పరస్పర ఆరోపణలు …అసహనం వ్యక్తం చేస్తున్న అగ్ర హీరోలు
మంచు విష్ణుపై ప్రకాశ్ రాజ్ ఫిర్యాదు.. సంచలన ఆరోపణలు
ఎన్నికల అధికారికి ఫిర్యాదు
ఈవీఎంలపై నమ్మకం లేదని మంచు విష్ణు కామెంట్
పోస్టల్ బ్యాలెట్ కుట్ర చేస్తున్నారని ప్రకాష్ రాజ్ ఆరోపణ
అర్హుల సంతకాలు సేకరిస్తున్నారని మండిపాటు
కృష్ణ, కృష్ణంరాజు, శారదల ఫీజు కట్టారని ఆగ్రహం
ఇంత దిగజారుతారా? అని నిలదీత

అనేక సంఘాలు గుర్తిపుకోసం , తమ సమస్యల పరిస్కారం కోసం ఎన్నికలు నిర్వహిస్తుంటాయి. సినీ పరిశ్రమకూడ తమ సమస్యల పరిస్కారం కోసం , సంక్షేమ కార్యక్రమాలు అమలు కోసం ప్రతి రెండు సంత్సరాలకు ఒకసారి ఎన్నికలు నిర్వహించడం ఆనవాయితీ . ఇది వాళ్ళు ఏర్పాటు చేసుకున్న నియమావళి . గత కొన్ని దశాబ్దాలుగా ఎన్నికలు జరుగుతున్నాయి. హేమాహేమీలు మా అధ్యక్షులు గా ఎన్నికయ్యారు. ఎవరు ఎన్నికైన పరస్పర స్నేహ సహకారాలు ఉండేవి . కానీ గత కొన్ని సంవత్సరాలు గా సినీ పరిశ్రమలో రాజకీయాలు ఎక్కువయ్యాయి. కొన్ని సామజిక వర్గాలు ఆధిపత్యం వహిస్తున్నాయి. అంతకు ముందు చాలాకాలం ఒకే సామాజికవర్గం తెలుగు సినీ ప్రపంచాన్ని శాసించింది.కానీ తరువాత కాలంలో దాని దీటుగా మరో సామజిక వర్గం రావడంతో పోటీ రసవత్తరంగా మారింది. దీంతో సినీ దిగ్గజాలు రెండుగా చీలి పోయాయి. అయితే కొందరు అగ్ర హీరోలు మాత్రం జరుగుతున్న తంతును చూసి అసహనం వ్యక్తం చేస్తున్నారు. పోటీచేస్తున్న అభ్యర్థులు ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు.

‘మా’ ఎన్నికల్లో ఈవీఎంలు వద్దని, బ్యాలెట్ లే వాడాలని ఎన్నికల అధికారికి మంచు విష్ణు లేఖ రాసిన నేపథ్యంలో.. ప్రకాశ్ రాజ్ కూడా విష్ణుపై ఎదురు ఫిర్యాదు చేశారు. ఎన్నికల కోడ్ ను విష్ణు ప్యానెల్ ఉల్లంఘిస్తోందని ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసిన ప్రకాశ్ రాజ్.. విష్ణు ప్యానెల్ పై సంచలన ఆరోపణలు చేశారు. ఫిర్యాదు అనంతరం జీవిత, శ్రీకాంత్ లతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.

ఎన్నికల ఏజెంట్లతో కలిసి ‘పోస్టల్ బ్యాలెట్ల’ కుట్ర చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. 60 ఏళ్లు నిండిన వారంతా పోస్టల్ బ్యాలెట్ కు అర్హులని, దీంతో వారి నుంచి విష్ణు ప్యానెల్ సభ్యులు సంతకాలు సేకరిస్తున్నారని చెప్పారు. నిన్న సాయంత్రం విష్ణు తరఫు వ్యక్తి ఒకరు 56 మంది నుంచి సంతకాలు సేకరించారని, వారి పోస్టల్ బ్యాలెట్ ఫీజు రూ.28 వేలు కట్టారని చెప్పారు.

కృష్ణ, కృష్ణంరాజు, శారద, పరుచూరి బ్రదర్స్, శరత్ బాబు తదితరుల ఫీజునూ విష్ణు తరఫు వ్యక్తే కట్టారని ఆరోపించారు. ఆగంతుకులతో ‘మా’ ఎన్నికలను ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. గెలిచేందుకు ఇంత దిగజారుతారా? అని నిలదీశారు. హామీలు చెప్పి గెలవాలని సవాల్ విసిరారు. దీనిపై కృష్ణంరాజు, చిరంజీవి, నాగార్జున పెదవి విప్పాలని డిమాండ్ చేశారు.

‘మా’ ఎన్నికల్లో ఈవీఎంలను వినియోగించవద్దంటూ ఎన్నికల అధికారికి విష్ణు విజ్ఞప్తి

‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా)’ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల అధికారికి మంచు విష్ణు లేఖ రాశారు. ఈ నెల 10న పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఎన్నికలకు ఈవీఎంలను వినియోగించవద్దని, బ్యాలెట్ పేపర్ నే వాడాలని పేర్కొంటూ ‘మా’ అధ్యక్ష అభ్యర్థిగా బరిలో ఉన్న విష్ణు కోరారు. ఈవీఎంల పనితీరుపై తమకు నమ్మకం లేదన్నారు. దీనిపై ఎన్నికల అధికారి తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

కాగా, గతంలో ఎన్నికలకు ఈవీఎంలనే ఉపయోగించారు. అయితే, వాటిని వినియోగించుకున్నందుకు ‘మా’ చెల్లింపులు చేయకపోవడంతో ఈసీఐఎల్ సంస్థ ‘మా’ను బ్లాక్ లిస్ట్ లో చేర్చింది. ఈసారీ ఈవీఎంలనే వినియోగించేందుకు వీలుగా ఈసీఐఎల్ కు ‘మా’ విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తోంది.

Related posts

ఆ సినిమా విషయంలో నాకు చెప్పిందొకటి .. చేసిందొకటి: భానుప్రియ!

Drukpadam

మీ ఎమ్మెల్యేలు ఎంత తిన్నారో చర్చకు సిద్ధమా?: ఏపీ నేతలకు తమ్మారెడ్డి భరద్వాజ సవాల్!

Drukpadam

రసవత్తరంగా మారిన మూవీ ఆర్టిస్ట్ అసోషివేషన్ ఎన్నికలు!

Drukpadam

Leave a Comment