బద్వేల్ బరిలో నిలిచేందుకు బీజేపీ ,కాంగ్రెస్ సిద్ధం…
-బద్వేలు ఉపఎన్నికలో పోటీ చేస్తాంమని ప్రకటించిన పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్
-ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికే పోటీ చేస్తున్నాం
-వైసీపీ హయాంలో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింది
-కేంద్రాన్ని నిలదీయలేని స్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉంది
బద్వేల్ బరిలో నిలవరదని జనసేన , టీడీపీ నిర్ణయించుకోగా , తాము పోటీ చేయనున్నట్లు బీజేపీ నిన్ననే ప్రకటించగా , ఈరోజు కాంగ్రెస్ పోటీ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ రెండు పార్టీలకు పెద్దగా ఓటింగ్ బలం లేదు. అయినప్పటికీ పోటీలో దిగుతున్నాయి. వైసీపీ కి చెందిన బద్వేల్ ఎమ్మెల్యే అనారోగ్య కారణాలతో చనిపోయారు. ఆయన స్థానంలో ఆయన భార్య డాక్టర్ సుధ ను తన అభ్యర్థిగా వైసీపీ ప్రకటించింది. ఎన్నికల ఇంఛార్జిగా సీనియర్ మంత్రి పెద్దిరెడ్డిని నియమించారు. నియోజవర్గంలో సమావేశం వేర్పాటు చేశారు.జనసేన , టీడీపీ తొలుత పోటీ చేయాలనీ భావించిన చనిపోయిన కుటుంబం నుంచి పోటీలో ఉన్నందున తాము పోటీకి దూరంగా ఉంటామని ప్రకటించాయి.
బీజేపీ మిత్రపక్షం జనసేన తమకు చెప్పకుండానే తాము పోటీచేయడంలేదని ప్రకటించడంపై బీజేపీ అసంతృప్తిగా ఉంది.దీనిపై పవన్ కళ్యాణ్ వివరణ కోరినట్లు తెలుస్తుంది. తొలుత జనసేన అభ్యర్థి వేట కూడా చేసింది. పవన్ పార్టీ పోటీ చేయకపోయినా , తమకు మద్దతు ఇవ్వాలని బీజేపీ కోరుతుంది.బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే జయరాములు ను బరిలోకి దించాలని భావిస్తున్నట్లు సమాచారం
ఏపీలోని బద్వేలు నియోజకవర్గానికి ఉపఎన్నిక జరగబోతోంది. ఈ ఎన్నిక బరిలోకి తాము కూడా దిగబోతున్నామని ఏపీ పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలో పోటీ చేస్తోందని చెప్పారు. కడప జిల్లాలో ఎన్ని దారుణాలు జరిగాయో అందరికీ తెలుసని అన్నారు. దాడులకు, దౌర్జన్యాలకు కాంగ్రెస్ పార్టీ భయపడదని చెప్పారు.
రాష్ట్రంలో శాంతి భద్రతలు దిగజారాయని శైలజానాథ్ విమర్శించారు. విచ్చలవిడిగా డ్రగ్స్ దొరుకుతున్నాయని దుయ్యబట్టారు. ప్రభుత్వం చేస్తున్న అప్పులతో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోతోందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయలేని దారుణమైన స్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉందని అన్నారు. ప్రభుత్వ ఆస్తుల ప్రైవేటీకరణ, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపాలంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని చెప్పారు.