Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

లఖీమ్ పూర్ వెళ్లతాము ….అరెస్టులకు బెదిరింపులకు భయపడం :రాహుల్ గాంధీ!

లఖీమ్ పూర్ వెళ్లతాము ….అరెస్టులకు బెదిరింపులకు భయపడం :రాహుల్ గాంధీ!
-ప్రియాంక ను ఎందుకు నిర్బందించారో చెప్పాలి
-భాదితులను పరామర్శించడం మా భాద్యత
-వ్యవసాయ చట్టాలు రద్దు చేయమన్న రైతులను చంపుతారా ?
-కేంద్రం నియంతగా పాలనా సాగిస్తుంది.
-కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన నిలబడుతుంది.

లకింపుర్ లో జరిగిన ఘటనపై నిజాలు దాచేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ కేంద్రం పై నిప్పులు చెరిగారు. రైతు చట్టాలు తమకు ఆమోద యోగ్యం కాదని పదినెలల నుంచి రైతులు ఆందోళన చేస్తున్న కేంద్రం నిరంకుశంగా , మొండివైఖరితో రైతుల ఉద్యమాన్ని అణిచేందుకు ప్రయత్నాలు చేస్తుందే తప్ప రైల్టులు కోరిన విధంగా స్పందించడం లేదని విమర్శించారు. లకింపుర్ ఖేరిలో రైతులు నిరసన తెలుపుతుంటే వారిపైకి కెంరమంత్రి కుమారుడు నడుపుతున్న కారును నడిపి తొమ్మిది ప్రాణాలు బలిగిన్నారని దుయ్యబట్టారు. కేంద్రంలోని మోడీ ,రాష్ట్రంలోని యోగి ప్రభుత్వాలకు పాలించే అర్హత లేదని రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

లకింపుర్ లో మరణించిన వారి కుటంబాలను పరామర్శించేందుకు కూడా అనుమతి లేదంటూ అడ్డుకోవడాన్ని రాహుల్ తప్పు పట్టారు. మనం ప్రజాస్వామ్యం లో ఉన్నామా ? లేక నియంతృత్వంలో ఉన్నామా ? వారి బెదిరింపులకు , అరెస్ట్ లకు భయపడబోమని నిరంకుశ చర్యలు ఇలాగే కొనసాగితే జరిగే పరిణామాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భాద్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ప్రియాంక గాంధీని లకింపుర్ వెళ్లకుండా నిర్బంధించడం ఏమిటి ? పైగా మూడు రోజులుగా ఆమెను నిర్బందించటం పై భగ్గుభగ్గు మన్నారు. కాగా 24 లోగా ప్రియాంకను విడుదల చేయకపోతే పంజాబ్ నుంచి లకింపుర్ కు యాత్ర చేపడతామని కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్దు హెచ్చరించారు. పంజాబ్ లో జరిగిన ఒక ర్యాలీలో సిద్దు మాట్లాడుతూ కేంద్రం , ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాల చర్యలను తీవ్రంగా దుయ్యబట్టారు. ఛత్తీస్ ఘడ్ సీఎం భగల్ ప్రియాంకను కలిసేందుకు లక్నో ఎయిర్ పోర్ట్ లో విమానం దిగిన వెంటనే ఆయన్ను చుట్టుముట్టిన పోలీసులు మీరు లకింపుర్ వెళ్లేందుకు వీలులేదని అడ్డుకున్నారు. నేను లకింపుర్ వెళ్లటంలేదు ప్రియాంకను కలిసేందుకు వెళుతున్నానని చెప్పిన సీఎం ను అడ్డుకోవడం తో ఆయన ఎయిర్ పోర్ట్ లోనే బైఠాయించారు.

Related posts

పవన్ కళ్యాణ్ కు వైసీపీ స్ట్రాంగ్ కౌంటర్ …

Drukpadam

ఉత్తమ్ తో రేవంత్ రెడ్డి భేటీ …తనకు సహకారం అందించాలని కోరిన రేవంత్!

Drukpadam

జనసేన బాటలో టీడీపీ …బద్వేల్ ఎన్నిక ఏకగ్రీవమేనా …?

Drukpadam

Leave a Comment