Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

సాగు చట్టాలు బాగు బాగు …. ప్రతిపక్షాలదే తప్పుడు ప్రచారం బీజేపీ ఎంపీ జీవీఎల్…

సాగు చట్టాలు బాగు బాగు …. ప్రతిపక్షాలదే తప్పుడు ప్రచారం బీజేపీ ఎంపీ జీవీఎల్…
-రైతులను మోసం చేసేందుకే సాగు చట్టాలపై తప్పుడు ప్రచారం
-నూతన వ్యవసాయ చట్టాలు తీసుకువచ్చిన కేంద్రం
-దేశంలో రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత
-రైతులను దోపిడీ చేసేందుకే మార్కెట్ యార్డులని మండిపాటు
-గుంటూరులో బీజేపీ అవగాహన కార్యక్రమం
-హాజరైన బీజేపీ ఎంపీ జీవీఎల్

ఒక పక్క నూతన సాగు చట్టాలు వద్దని 10 నెలలుగా రైతులు సుదీర్ఘ ఆందోళనలు చేస్తుంటే బీజేపీ మాత్రం కేంద్రం తెచ్చిన సాగు చట్టాలు బాగుబాగు అవి రైతుల మంచి కోసమేనని చెబుతుంది. ఆ చట్టాలను వెనక్కు తీసుకునే ప్రసక్తే లేదని ఘంటాపధంగా చెబుతుంది. రైతులు తమ ఉద్యమాన్నివిరమించాలని ,సాగుచట్టాలపై తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని ఆ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు జి వి ఎల్ నరసింహారావు అన్నారు. సాగు చట్టాల వల్ల కలిగే ప్రయోజనాలపై బీజేపీ ఆధ్వరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. కేంద్రం రైతుల బాగు కోసం తీవ్రంగా ఆలోచన చేసిన తరువాతనే నూతన వ్యవసాయ చట్టాలను తీసుకోని వచ్చిందని అన్నారు. రైతులను పక్కదార్లు పట్టించేందుకు కొన్ని రాజకీయపార్టీలు చేస్తున్న ప్రచారాన్ని నమ్మవద్దని అన్నారు.

కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలపై రైతుల్లో అవగాహన కలిగించేందుకు బీజేపీ ఆధ్వర్యంలో దేశవ్యాపితంగా సమావేశాలు నిర్వహిస్తుంది. అందులో భాగంగా గుంటూరులో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ అవగాహన కార్యక్రమానికి బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్వామినాథన్ సిఫారసుల అమలులో భాగంగానే నూతన సాగు చట్టాలు తీసుకువచ్చినట్టు తెలిపారు. అయితే, రైతులను మోసం చేసేందుకే కొన్ని పార్టీలు సాగు చట్టాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. కొత్త చట్టాలతో కనీస మద్దతు ధర దక్కదని దుష్ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు.

పంటల కనీస మద్దతు ధరను కేంద్రం ఏటా పెంచుతోందని వెల్లడించారు. పంట కొనుగోళ్లు గతంలో కంటే రెట్టింపు అయ్యాయని వివరించారు. కొత్త చట్టాల సాయంతో రైతులు ఎవరితోనైనా ఒప్పందం చేసుకోవచ్చని జీవీఎల్ స్పష్టం చేశారు. పంజాబ్ లో ఈ తరహా చట్టాలు ఇప్పటికే అమల్లో ఉన్నాయని తెలిపారు. రైతులను పలు రకాలుగా దోచుకునేందుకే మార్కెట్ యార్డులని విమర్శించారు.

Related posts

అభివృద్ధి అంటే అబద్దాలు కాదు …అసెంబ్లీ లో సీఎం జగన్ అద్భుత ప్రసంగం …

Drukpadam

మాది ప్రజాబలం…లక్షమందితో కొత్తగూడెం సభ …ఖమ్మం మీడియా సమావేశంలో కూనంనేని …

Drukpadam

మా అమ్మ ఆసుపత్రిలో ఉంది …విచారం వాయిదావేయండి ఈడీని కోరిన రాహుల్!

Drukpadam

Leave a Comment