Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

జగన్ బెయిల్ రద్దు చేయాల్సిందే … తెలంగాణ హైకోర్టులో రఘురామకృష్ణరాజు పిటిషన్!

జగన్ బెయిల్ రద్దు చేయాల్సిందే … తెలంగాణ హైకోర్టులో రఘురామకృష్ణరాజు పిటిషన్!

సాంకేతిక కారణాలతో పిటిషన్ ను వెనక్కిచ్చిన రిజిస్ట్రీ

-సిబిఐ కోర్ట్ లో పిటిషన్ వేసిన రఘురామ…పిటిషన్ కొట్టేసిన సిబిఐ కోర్టు
-జగన్ బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేస్తారన్న రఘురాజు
-11 ఛార్జిషీట్లపై సమగ్రంగా దర్యాప్తు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని విన్నపం
-రెండు, మూడు రోజుల్లో పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం

కత్తికి లేని దురద కందపీఠకంటే ఇదేనేమో …జగన్ బెయిల్ రద్దు చేయాలనీ వైసీపీ ఎంపీ రఘురామ సిబిఐ కోర్ట్ లో పిటిషన్ వేసిన సంగతి తెలిసేందే … దీనిపై విచారణ జరిపిన సిబిఐ కోర్ట్ కొట్టివేసింది.జగన్ తో విజయసాయి రెడ్డి బెయిల్ కూడా రద్దు చేయాలనీ రఘరామ సిబిఐ కోర్ట్ ను ఆశ్రహించారు. ఇద్దరిపై ఆయన మోపిన అభియోగాల్లో పసలేదని తేలటంతో సిబిఐ కోర్ట్ కొట్టి వేసింది . ఇప్పుడు రఘురామ , తెలంగాణ హైకోర్టు మెట్లు వెక్కారు. హైకోర్టు విచారణకు స్వీకరించింది.

ఏపీ ముఖ్యమంత్రి జగన్ బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు పిటిషన్ దాఖలు చేశారు. జగన్ బయట ఉంటే సాక్షులను ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రభావితం చేసే అవకాశం ఉందని పిటిషన్ లో పేర్కొన్నారు. వైయస్ జగన్ పై నమోదైన 11 ఛార్జిషీట్లపై సమగ్రంగా దర్యాప్తు చేసేలా ఆదేశించాలని కోర్టును కోరారు. రఘురాజు వేసిన పిటిషన్ రెండు, మూడు రోజుల్లో విచారణకు వచ్చే అవకాశం ఉంది.

మరోవైపు, జగన్ బెయిల్ ను రద్దు చేయాలంటూ గతంలో రఘురాజు వేసిన పిటిషన్ ను సీబీఐ కోర్టు ఇప్పటికే కొట్టేసిన సంగతి తెలిసిందే. బెయిల్ షరతులను తాను ఉల్లంఘించలేదని… కేవలం వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాల కోసమే రఘురాజు పిటిషన్ వేశారని జగన్ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఇరువైపుల వాదనలు విన్న కోర్టు రఘురాజు పిటిషన్ ను కొట్టేసింది. ఈ నేపథ్యంలో సీబీఐ కోర్టు తీర్పును హైకోర్టులో రఘురాజు సవాల్ చేశారు.

 

జగన్ బెయిల్ రద్దు చేయాలన్న రఘురామకృష్ణరాజు పిటిషన్ ను వెనక్కి ఇచ్చిన హైకోర్టు రిజిస్ట్రీ

ఏపీ ముఖ్యమంత్రి జగన్, వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిల బెయిల్ రద్దు చేయాలంటూ తెలంగాణ హైకోర్టులో వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు పిటిషన్లు వేసిన సంగతి తెలిసిందే. అయితే, పిటిషన్లను సాంకేతిక కారణాలతో హైకోర్టు రిజస్ట్రీ వెనక్కి ఇచ్చారు. దీంతో, రఘురాజు మరోసారి పిటిషన్ వేయనున్నారు.

జగన్, విజయసాయి బెయిల్ రద్దు చేయాలంటూ సీబీఐ కోర్టులో తొలుత రఘురాజు పిటిషన్లు వేశారు. అయితే తాము బెయిల్ షరతులను ఉల్లంఘించలేదని… వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాల కోసం రఘురాజు పిటిషన్ వేశారంటూ జగన్, విజయసాయి తరపు న్యాయవాదులు కోర్టులో వాదనలు వినిపించారు. దీంతో, రఘురాజు పిటిషన్లను సీబీఐ కోర్టు కొట్టేసింది. ఈ నేపథ్యంలో రఘురాజు హైకోర్టులో పిటిషన్లు వేశారు.

Related posts

ఇక వాహన రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్ అన్నీ ఆన్ లైన్ లోనే!

Drukpadam

These Fitness Tips Help Take Inches off Your Waistline

Drukpadam

నాది ఇప్పుడు ఇండియా.. బెయిలుపై బయటకొచ్చిన పాక్ మహిళ భావోద్వేగం

Drukpadam

Leave a Comment