పోలవరం విషయంలో కేంద్రం తొండాట …నిధులపై చేతులు వెత్తేసేదిశగా అడుగులు…
-20 వేల కోట్లకన్నా పైసా ఎక్కువ ఇవ్వమన్న కేంద్ర ఆర్ధికమంత్రి
-పోలవరం ప్రాజెక్టు నిధులపై కేంద్రం క్లారిటీ
-నిన్న కేంద్ర ఆర్థిక మంత్రిని కలిసిన బుగ్గన
-మరో రూ. 4 వేల కోట్లు ఇవ్వాలన్న జలశక్తి శాఖ విన్నపానికి ఆర్థికశాఖ ఒప్పుకోని వైనం
-2017లో కేంద్ర కేబినెట్ నిర్ణయం మేరకే నిధులు అంటూ స్పష్టీకరణ
ఆంధ్రప్రదేశ్ విభజన విషయంలో ఆంధ్రా ప్రాంతం వారు విభజనకు ససేమీరా అన్నారు.తెలంగాణాలో ఉద్యమం ఉదృతంగా సాగుతుంది.1200 మందికిపైగా యువకులు ,విద్యార్థులు ఆత్మబలిదానం చేసుకున్నారు. విభజన సేయకపోతే తెలంగాణ అగ్ని గుండంగా మారె ప్రమాదం ఉంది. ఆంధ్ర వాళ్ళు ఒప్పుకోవడంలేదు .ఆంధ్రావారిని ఒప్పినించి తెలంగాణ ఇవ్వడం ఆనాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ కు సాధ్యం కావడంలేదు .అందువల్ల ఆంధ్రాకు కొన్ని వాగ్దానాలు చేస్తే కొంత ఉపశమనంగా ఉంటుందని భావించిన యూపీఏ పోలవరం ను జాతీయ ప్రాజక్టుగా ప్రకటించడమే కాకుండా దాని నిర్మాణానికి అయ్యే ఖర్చు అంతా కేంద్రమే భరిస్తుందని విభజన చట్టంలో పొందపరిచింది. అయితే ప్రాజెక్టు నిర్మాణం రాష్ట్ర ప్రభుత్వ చేపట్టింది.టీడీపీ హయాంలోనే ప్రాజక్టు కాస్ట్ 54 కోట్ల రూపాయలు అవుతుందని కేంద్రానికి వివరమైన రిపోర్ట్ పంపింది . జగన్ నాయకత్వం లో వైసీపీ ప్రభుత్వ 2019 లో అధికారంలోకి వచ్చింది. పనులు జరుగుతున్నాయి.జాతీయ ప్రాజక్టుగా ఉన్న పోలవరం కు నిధులు కావాలి అయితే అప్పుడప్పుడు కేంద్రం దగ్గరకు వెళ్లి నిధులు రాబట్టుకుంటునప్పటికీ తాజాగా పోలవరంకు 2017 లోనే 20 వేల కోట్లుగా నిర్దారించటం జరిగిందని అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం అడుగుతున్నా నిధులు ఇవ్వలేమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కి స్పష్టం చేశారు. కేంద్రం పోలవరం ప్రాజక్టు నిర్మాణానికి ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకపోవడంపై రాష్ట్ర ప్రభుత్వం గుర్రుగా ఉంది. విభజన హామీలలో భాగమైన పోలవరం కు నిధులు ఇవ్వకపోవడం ఇంతే ఇస్తామని చెప్పటంపై రాష్టంలోని ఉన్నతాధికారులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు.కేంద్రం తొండాట ఆడుతుందని విమర్శలు వస్తున్నాయి
ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్టుకు ఇచ్చే నిధుల విషయంలో కేంద్ర ప్రభుత్వం పూర్తి క్లారిటీ ఇచ్చింది. పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇవ్వాలంటూ కేంద్ర ఆర్థిక మంత్రిని నిన్న ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కలిసి విన్నవించారు. మరోవైపు రూ. 4 వేల కోట్లను పోలవరం ప్రాజెక్టుకు మంజూరు చేయాలని కోరుతూ కొన్ని రోజుల క్రితం కేంద్ర ఆర్థిక శాఖకు కేంద్ర జలశక్తి శాఖ కూడా లేఖ రాసింది.
ఈ నేపథ్యంలో బుగ్గనకు కేంద్ర ఆర్థిక శాఖ నిన్న పూర్తి క్లారిటీ ఇచ్చింది. అన్ని ప్రాజెక్టుల మాదిరే పోలవరంకు కూడా నిధులు ఇస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి తెలిపారు. 2017లో కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్నదాని ప్రకారం రూ. 20 వేల కోట్లకు మించి ఇవ్వలేమని ఆమె స్పష్టం చేశారు. ఆ నేపథ్యంలో పోలవరంకు ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.