Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

డ్రగ్స్ వ్యవహారంలో టీడీపీ ,వైసీపీ మధ్య మాటల యుద్ధం ….

డ్రగ్స్ వ్యవహారంలోటీడీపీ ,వైసీపీ మధ్య మాటల యుద్ధం ….
టీడీపీ నేతల అరుపులను లెక్కచేయను: ఎమ్మెల్యే ద్వారంపూడి
ఎవరైనా కాకినాడ వచ్చి ప్రశ్నిస్తే ఇసుక లారీలతో తొక్కిస్తావా?… టీడీపీ నేత పట్టాభి
ఒకసారి కాదు పదిసార్లు వస్తాం!: అంటూ సవాల్
ఏపీ రాజకీయాల్లో డ్రగ్స్ సెగలు
వైసీపీ నేతలపై తీవ్ర ఆరోపణలు చేస్తోన్న టీడీపీ
బదులిచ్చిన ద్వారంపూడి
తప్పుడు కథనాలకు భయపడబోనని స్పష్టీకరణ

అందర్ప్రదేశ్ కు డ్రగ్స్ సరఫరా అవుతున్నాయని టీడీపీ ఆరోపణలపై కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి స్పందించారు . టీడీపీ పసలేని ఆరోపణలు చేస్తుందని తిప్పికొట్టారు. అసలు డ్రగ్స్ విషయంలో టీడీపీ పై అనుమానాలు ఉన్నాయని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి ఆరోపించారు.ద్వారంపూడి పై ప్రత్యేకంగా ఆరోపణలు చేయడంతో ఆయన తీవ్రంగా స్పందించడం దానికి ప్రతిగా టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి ఘాటు సమాధానం ,సవాళ్లు ప్రతి సవాళ్లతో డ్రగ్స్ వ్యవహారం పార్టీల మధ్య మాటల యుద్ధం గా మారింది.

ఏపీ రాజకీయాల్లో డ్రగ్స్ వ్యవహారం మరింతగా రాజుకుంటోంది. డ్రగ్స్ దిగుమతిలో వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి హస్తం ఉందంటూ టీడీపీ నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. దీనిపై ద్వారంపూడి బదులిచ్చారు. డ్రగ్స్ రవాణాపై దర్యాప్తు సంస్థల విచారణలో వాస్తవాలు తేలతాయని అన్నారు. టీడీపీ నేతల అరుపులను తాను లెక్కచేయనని, మీడియాలో తనపై వచ్చే తప్పుడు కథనాలకు భయపడబోనని స్పష్టం చేశారు. మాదకద్రవ్యాల రవాణాపై తమ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని, 3 నెలల్లో రూ.23 కోట్ల విలువైన గంజాయిని పట్టుకున్నామని వెల్లడించారు.

ఎవరైనా కాకినాడ వచ్చి ప్రశ్నిస్తే ఇసుక లారీలతో తొక్కిస్తావా?…
ఒకసారి కాదు పదిసార్లు వస్తాం!: టీడీపీ నేత పట్టాభి

 

ఇటీవల గుజరాత్ లోని ముంద్రా పోర్టులో భారీ మొత్తంలో డ్రగ్స్ పట్టుబడింది మొదలు, వైసీపీ నేతలపై టీడీపీ నాయకులు తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పిస్తున్నారు. తాజాగా, టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డ్రగ్స్ వ్యవహారంలో టీడీపీ అడిగిన ప్రశ్నలకు వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇంతవరకు సమాధానం ఇవ్వలేదని అన్నారు. తిరిగి టీడీపీ నేతలపైనే ఎదురుదాడికి దిగుతున్నారని మండిపడ్డారు. ద్వారంపూడితో పాటు శాన్ మెరైన్ ఎండీ అలీషా, సుధాకర్ లను ఎన్ఐఏ విచారించాలని డిమాండ్ చేశారు.

“ఏమయ్యా ద్వారంపూడి… నిన్న మేం అడిగిన వాటికి సమాధానం చెప్పే దమ్ము లేదు నీకు! ఎవరన్నా కాకినాడ వచ్చి నిన్ను ప్రశ్నిస్తే ఇసుక లారీలతో తొక్కించేస్తానంటావా? ఒకసారి కాదు, పదిసార్లు కాకినాడ వస్తాం” అంటూ పట్టాభి సవాల్ విసిరారు.

Related posts

బీజేపీకి డిపాజిట్లు కూడా రావు, అమిత్ షా సభలో ఇందులో సగం లేరు: హరీష్ రావు…

Drukpadam

మును “గోడు ” ప్రభావం కమ్యూనిస్టులమీదనే అధికం …

Drukpadam

ఏ మహిళను అవమానించినా అది సమాజానికి మంచిది కాదు: నారా భువనేశ్వరి!

Drukpadam

Leave a Comment