Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

శభాష్ భట్టి …శాసనసభలో వివిధ సమస్యలను ప్రస్తావించినతీరు అద్భుతం!

శభాష్ భట్టిశాసనసభలో వివిధ సమస్యలను ప్రస్తావించినతీరు అద్భుతం
సంక్షేమ పథకాల సరిగా అమలు కావడంలేదన్న భట్టి
కాంగ్రెస్ హయాంలోనే అనేక ప్రాజక్టులు కట్టామని వెల్లడి
కాంగ్రెస్ హయాంలోనే ఎస్సీ ,ఎస్టీ బీసీకాలనీ లు కట్టిన విషయాన్నీ ప్రస్తావించిన భట్టి
కేజీ టు పీజీ ఏమైందని ప్రశ్న
బస్తీ దవాఖానాలు ,పల్లె దవాఖానల ప్రస్తావనను
డయాలసిస్ కేంద్రాలకు వెళ్ళవారికి ఉచిత బస్సు పాసులు ఇవ్వాలని విజ్ఞప్తి

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క శాసనసభలో వివిధ సమస్యలపై ప్రజల గొంతుకను అద్భుతంగా వినిపించారు. వివిధ సమస్యలను ప్రస్థాయిస్తున్న తీరుకూడా ప్రభుత్వాన్ని ఆలోచింప చేసే విధంగా ఉంది .గులాబ్ తుఫాన్ దగ్గరనుంచి ప్రజల సంక్షేమం ,చౌకాదుకాణాల ద్వారా వివిధ రకాల సరుకులు అందించటం పై ఆయన ప్రభత్వాన్ని ప్రశ్నించారు. విద్య ,వైద్యం , ప్రజలకు అందినప్పుడు మనం అభివృద్ధి గురించి మాట్లాడగలం కానీ అయి వాగ్దనాలకే పరిమితం అవుతుండటం బాధగా ఉందని అన్నారు. కెజి టు పీజీ విద్య , బస్తీ దవాఖానాలు , పల్లె దవాఖానాలు ,డయాలసిస్ కేంద్రాలు గురించి ప్రస్తావించారు. పేదలకు కాంగ్రెస్ హయాంలో ఇచ్చిన కాలనీలు తప్ప 7 సంత్సరాల టీఆర్ యస్ పాలనలో ఇచ్చిన కాలనీలు ఎక్కడున్నాయిని ప్రశ్నించారు. ప్రాజక్టు ల నిర్మాణంలో , పేదలకు సంక్షేమ పథకాలు అందించడంలో కాంగ్రెస్ చేసిన కృషిని వివరించారు. అంబెడ్కర్ ,రాజీవ్ గాంధీ విగ్రహాల విషయం కూడా ఆయన ప్రసంగంలో ప్రస్తావించారు. తాను విమర్శల కోసం చెప్పటం లేదని అంటూనే చెప్పిన విధానం ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపింది. వివిధ సమస్యలపై భట్టి చెప్పిన తీరు సభను ఆకట్టుకుంది. ముఖ్యమంత్రి సైతం తన సమాధానం లో భట్టి ప్రస్తావించిన అంశాలపై వివరణ ఇస్తూ కాంగ్రెస్ అసలు చేయలేదని అనడంలేదని చేయాల్సినంత చేయలేదని అన్నారు. భట్టి ప్రసంగం ఈవిధంగా సాగింది….

గులాబ్ తుఫానుతో రాష్ట్ర రైతాంగం నష్టపోయింది. పెద్ద ఎత్తున పంటలు ముంపుకు గురయ్యాయి.
మంథని నియోజకవర్గంలో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నీితో పాటు,, వర్షం వల్ల వచ్చిన నీటితో దాదాపు 15 వేల ఎకరాలు.. ముంపుకు గురయ్యాయి. ఈ ఏడాదిలో ఇప్పటికి మూడు సార్లు ముంపుకు గురయ్యాయి.
మధిర నియోజకవర్గం చిలుకూరు గ్రామంలో కూడా ఈ వరద రావడం వల్ల వెయ్యి ఎకరాుల ముంపుకు గురయ్యాయి.
లిఫ్ట్ ఇరిగేషన్ కూడా ముంపుకు గురై పనికిరాకుండా పోయింది. నష్టం అంచనా అయినే వేసేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేయలేదు. పంట నష్ట పరిహారం ఇవ్వడం లేదు.

భారతరత్న భాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని పంజగుట్ట చౌరస్తా ఏర్పాటు చేయాలి. మాజీ పార్లమెంట్ సభ్యులు వీ హనుమంత రావు అంబేద్కర్ విగ్రహాన్ని ఆ సర్కిల్ లో ఏర్పాటు చేసి విగ్రహావిష్కరణ చేసేందుకు ఆయన చేసిన ప్రయత్నానికి అడ్డుపడి… వారు తీసుకువచ్చిన అంబేద్కర్ విగ్రహాన్ని ఒక స్టేడియంలో ఒక మూలన పడేసిన విధానం చాలా బాధ కలిగిస్తోంది. వెంటనే అంబేద్కర్ విగ్రహాన్ని పంజాగుట్ట చౌరస్తాలో ఏర్పాటు చేయాలి. దిల్ షుక్ నగర్ లో భారతరత్న శ్రీ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఒక లారీ ఆ విగ్రహాన్ని కొట్టడం వల్ల అది కూలిపోయింది. ఆ లారీపై ఎఫ్.ఐ.ఆర్ నయోదు చేయడం జరిగింది. ఆ విగ్రహాన్ని పోలీస్ స్టేషన్ లో పెట్టడం జరిగింది. ఆ విగ్రహాన్ని కూడా యధాస్థానంలో తిరిగి పెట్టాలి. జాతికోసం ప్రాణాలు అర్పించిన మహనీయుడు ఆయన.

విమర్శల కోసం నేను మాట్లాడడం లేదు. సంక్షేమం అనేది మనందరి బాధ్యత. ముఖ్యంగా పాలకుల బాధ్యత.. ప్రభుత్వాల బాధ్యత. సంక్షేమం.. అభివ్రుద్ధి అనేవి రెండు కళ్లలాంటావి.. స్టేట్స్ మెన్ పాలకులు ఉంటే.. కచ్చితంగా గతంలో జరిగిన చరిత్రనుంచి ఇప్పడు జరిగేది.. జరగబోయేదాని గురించి స్పష్టంగా మాట్లాడతారు.

ఈ సమాజం వెనకబడి ఉండకూడదని, దోపిడీకి గురవకూడదని , ఇక్కడున్న వనరులు అన్నీ అందరికీ పంచబడాలని.. తద్వారా అందరూ బాగా ఎదగాలని ఆలోచనతోనే పోరాటాలు చేశారు. అందులో బాగంగానే శ్రీమతి సోనియాగాంధీగారు యూపీఏ ఛైర్ పర్సన్ గా.. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు.

కొద్దిమంది వెనకబడి ఉండి, తినడానికి తిండి లేక, ఉండడానికి ఇల్లులేక, చదువుకోవడానికి స్థోమత లేక బాధపడుతున్న వర్గాలు ఆ సమాజంలో ఉంటే.. వానిరి బాగు చేసుకుని సమజాంలోకి తీసుకుపోగలినిప్పుడే ఆ సమాజం బాగుందని అంటాం.

గవర్నెన్స్ అనేది కంటన్యూయస్ ప్రాసెస్. పంచవర్ష ప్రణాళికలు, పారిశ్రామికీరణ, వైట్ రెవెల్యూషన్ ఇతర కార్యక్రమాల ద్వారా.. గ్లోబలైజేషన్ జరుగుతున్న పరిస్థితుల్లో కూడా ప్రపంచంతో పోటీపడే స్థాయికి గత ప్రభుత్వాలు తీసుకువచ్చాయి.

ఇరిగేషన్ ప్రాజెక్టులు, పరిశ్రమలు, సంక్షేమ రంగం కొసం అనేక పథకాలు, 20 సూత్రాల ఆర్థిక కార్యక్రమం, భూ సంస్కరణల పేరుమీద మిగులు భూమిని పేదలకు పంచడం కావచ్చు… గరీబీ హఠావో అని నినాదం ఇచ్చిన ఇందిరమ్మ పాలన కావచ్చు.. తరువాత కాలంలో వచ్చిన రాష్ట్ర ప్రభుత్వాలు బతకడానికి ఆసరా ఇచ్చే పథకాలు చేసుకుంటూ వచ్చాయి.

చౌకధరల దుకాణం పెట్టాం.. వీటి ద్వారా దారిద్ర్య రేఖకు దిగువన ఉండేవారికి తినడానికి కనీసం తిండి ఇస్తే బతుకుతారన్న ఉద్దేశంతో చేశాము. చౌక ధరల దుకాణంలో కేవలం బియ్యం ఇవ్వడమే కాకుండా 9 రకాల సరుకులను ఉద్దేశంతో అమ్మహస్తం పేరుతో సంచిలో పెట్టి ఇచ్చాం. ధనిక రాష్ట్రం.. ఇంకా ఎక్కువ ఇస్తారని ఆశించాం.. కానీ ఎందుకో ఈ రాష్ట్ర ప్రభుత్వం బియ్యం వరకే పరిమితం చేసి నిత్యావసర సరుకులును ఇవ్వడం లేదు.

భూమిలేనివారి కోసం, పరిశ్రమల్లో కూలీలుగా చేసేవారికోసం ప్రత్యేకంగా ఆలోచన చేసి వారు ఉన్నతంగా ఎదగడానికి సంక్షేమ కార్యక్రమం ప్రత్యేకంగా అమలు చేయాలి.

మానవ వనరులు అధికంగా ఉన్న దేశం మనది. పుట్టిన ప్రతి బిడ్డా ఈ రాష్ట్ర సంపదగానో, దేశ పంపదగానో భావించాలి. ఆ వనరులను సాధ్యమైనంత పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర అభివ్రుద్దికి ఉపయోగ పడేవనరులుగా చూసుకోవచ్చు.

సంచారజాతులు.. గ్రామాల్లో తిరుగుతుంటారు. వారితోబాటు అయాయక పసిబిడ్డలు కూడా ఊరూరు తిరుగుతూఉంటారు. వాళ్లకు ఇల్లు లేదు.. పాఠశాల లేదు. భవిష్యత్ అనేదే లేదు. వాళ్లకూడా మన రాష్ట్రంలో పుట్టిన మానవ వనరులే.

వారికి విలువలతో కూడా ఆహారన్ని ఇవ్వగలిగితే.. ఈ రాష్ట్రానికి, దేశానికి ఉపయోగకరంగా ఉంటుంది.
నగరాల్లో కూడా మనం చూస్తుంటాం. సిగ్నల్స్ దగ్గర చిన్న చంటిబిడ్డల్ని చేతులతో ఎత్తుకుని భిక్షాటన చేస్తుంటారు. అటువంటి వాళ్ల గురించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి.

బసవ తారకం ఆసుపత్రి, ఉస్మానియా ఆసుపత్రి, గాంధీ.. రకరకాల ఆసుపత్రుల వద్ద వచ్చే జనం.. పేషంట్లు లోపల ఉంటే.. ఉదయం నుంచి సాయంత్రం దాకా జనాలు బయట ఎవరో కొద్ది మంది దాతలు ఆహారాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తుంటే.. అక్క డ పెద్ద ఎత్తున ఆహారం కోసం బారులు తీరి ఉంటారు. తీసుకున్న ఆహారాన్ని తినేందుకు స్థలం కూడా ఉండదు. కాసిన్ని మంచినీళ్ల వసతి ఉండవు. వాళ్లగురించి ప్రభుత్వం ఆలోచన చేసి వారికి షెడ్స్, తినేందుకు వసతులు, మంచినీటి సదుపాయం కల్పించాలి. అన్నపూర్ణ క్యాంటీన్ లను ఆయా ఆసుపత్రుల వద్ద ఏర్పాటు చేయాలి.

అన్ని జిల్లాల్లోనూ డయాలసిస్ ఉచితంగానే చేస్తున్నారు.. రవాణా కోసం మేము డబ్బులు ఖర్చు పెట్టుకోలేక పోతున్నాం.. ఆర్టీసీ బస్సుల్లో వారికి కన్సెషన్ పాస్ వంటిదో, లేకపోతే ఉచితంగానో ప్రయాణం చేసేలా అవకాశం ఇవ్వండని రోగులు వేడుకుంటున్నారు.

అలాగు సఫాయి కార్మికులు, బండల కొట్టే కార్మికుల గురించి కూడా ప్రభుత్వం ఆలోచించాలి. వాళ్లకు ఇచ్చే జీతాలు పెంచే విధంగా ఆలోచనల చేయాలి.

విద్య, వైద్యం అందరికీ క్వాలిటేటివ్ గా అందించాలి. అప్పుడే నిజమైన సంక్షేమం చేసినట్టు. పల్లె దవాఖానలను అన్ని గ్రామల్లో మొదలు పెట్టాలి. ఎల్.కే.జీ నుంచి పీజీ వరకూ ఉచిత విద్యను అందరికీ అందిస్తామని ఈ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇంతవరకూ వీటిని మొదలు పెట్టలేదు. ఇప్పటికైనా కొన్ని మండలాల్లో అయినా ఫేజ్డ్ మ్యానర్ గా మొదలు పెట్టాలి. తరువాత వచ్చే ప్రభుత్వాలు వీటిని కొనసాగిస్తాయి.

ఇండ్ల స్థలాలుకు సంబంధించి గత ప్రభుత్వాల హయాంలో భూమి సేకరించి ప్లాటింగ్ చేసి ఇచ్చేవాళ్లు. ఆ రకంగానే మన రాష్ట్రంలో ప్రతి గ్రామంలో కాలనీలు ఏర్పడ్డాయి. ఏడు సంవత్సరాలుగా ఎక్కడా భూమి సేకరించి ప్లాటింగ్ చేసి ఇవ్వడం లేదు. గత ప్రభుత్వాలు అసైన్డ్ ల్యాండ్స్ కిందనో, ఇండ్ల పట్టాల కిందనో ఇచ్చిన వాటిని చాలా సందర్భాల్లో వివి కారణాలతో ప్రభుత్వం వెనక్కు తీసుకుంటోంది.

భూమి అనేది చాలా విలువైనది.. అతనికి ఆత్మగౌరవాన్ని తెచ్చేస్తుందన్న ఆశతోనే నాటి ప్రభుత్వాలు భూములు పంపిణీ చేశాయి. వాటిని వాళ్లు కూడా అలాగే కాపాడుకుంటున్నారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లా పూర్ మెట్ మండలం తొర్రూరు గ్రామంలో 1940 నుంచి 2019 దాదాపు 200 దళిత కుటుంబాలు 85 ఎకరాల్లో సర్వే నెంబర్ 383/1లో సాగు చేసుకుంటున్నాయి. ఇప్పటివరకూ వంశపారంపర్యంగా సాగు చేసుకుంటున్నాయి.

రాజీవ్ గృహకల్ప కోసం 2008లో వీటిని ప్రభుత్వ భూ సేకరణ చేస్తుందని వాళ్లకు ఆనాటి విలువ మేరకు.. రూ. 23 లక్షల 50 వేలు ఉంటే.. ప్రభుత్వం రూ. లక్ష 50 వేలు ఇచ్చి.. మిగిలిన డబ్బులు ఇస్తాం.. లేకపోతే మేము తీసుకోం అని చెప్పింది. అంతిమంగా రాజీవ్ స్వగృహ కట్టలేదు.. ఇంతలో తెలంగాణ ప్రభుత్వం మీరు సాగు చేసుకునే కార్యక్రమం ఆపండి.. ఈ భూములను మేము ఆక్షన్ చేయబోతున్నాం అని చెప్పింది. వారిని ఖాళీ చేపించే ప్రయత్నం చేస్తోంది.
గతంలో ఇందిరమ్మ ఇండ్ల పేరుమీద అర్హత కలిగిన ప్రతివారికి ఇండ్లు శాంక్షన్ చేసే పరిస్థితి ఉండేది.

డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టుకోవచ్చు.. అని ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీతో చాలా మంది వాటికోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు రావడం లేదు.. ఇండ్ల స్థలాల పంపిణీ జరగడం లేదు.. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు రావడం లేదు.ఇండ్ల స్థలాల కోసం ప్రభుత్వం గ్రామాల్లో భూమి సేకరించాలని భట్టి కోరారు .

Related posts

ఇది ప్రగతి శీల బడ్జెట్ అన్న ప్రధాని మోడీ …

Drukpadam

పొంగులేటిపై సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర ఫైర్….

Drukpadam

ఏపీ ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందంటూ తండ్రీకొడుకుల కథ చెప్పిన మంత్రి పేర్ని నాని!

Drukpadam

Leave a Comment