Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
సినిమా వార్తలు

నేడే మా ఎన్నికలు …సాయంత్రానికి ఫలితం…

నేడే మా ఎన్నికలు …సాయంత్రానికి ఫలితం…
-ప్రకాష్ రాజ్ …మంచు విష్ణు నువ్వా …నేనా
-మోహన్ బాబు వర్సెస్ మెగా ఫ్యామిలీ
-రెండుగా చీలిపోయిన తెలుగు సినీ పరిశ్రమ
-ఉదయం 8 మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్
-జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ వద్ద భద్రతా కట్టు దిట్టం …

విమర్శలు ,ప్రతి విమర్శలతో రాజకీయనాయకులకు ఏమాత్రం తీసిపోని విధంగా సాగిన మూవీ ఆర్టిస్ట్ అసోసిషన్ ఎన్నికలు నేడు జరగనున్నాయి. పోలింగ్ కు మరికొన్ని గంటల సమయం మాత్రమే మిగిలుంది. హైదరాబాదులోని జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో ఓటింగ్ ప్రక్రియ జరగనుంది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. అదే రోజు ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి ఉంటుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా రెండు ప్యానళ్లు హోరాహోరీ ప్రచారం నిర్వహించాయి. వినోదాలు పంచె కళాకారులూ ,విందు భోజనాలతో పరస్పర విమర్శలతో ప్రచారాన్ని రక్తి కట్టించారు. ఈసారి ఎన్నికల్లో కర్ణాటకకు చెందిన ప్రకాష్ రాజ్ తెలుగు సినీ కళాకారుల అసోసియేషన్ లో చేరి అధ్యక్షుడుగా పోటీ చేయడం తో లోకల్ -నాన్ లోకల్ ఫీలింగ్ కూడా వచ్చింది. ప్రత్యర్థుల పై విమర్శలు సైతం మోతాదుకు మించాయని విమర్శలు ఉన్నాయి. విష్ణు తరుపున మా అవుట్ గోయింగ్ అధ్యక్షుడు నరేష్ , అగ్ర హీరో మోహన్ బాబు , ప్రకాష్ రాజ్ తరుపున మెగా ఫ్యామిలీ నుంచి నేరుగా నాగబాబు , పరోక్షంగా పవన్ కళ్యాణ్ , చిరంజీవి ప్రచారం నిర్వహించారు. సినీ పరిశ్రమ దాదాపు రెండుగా చీలి పోయింది. కేవలం 900 పై చిలుకు ఓట్లు మాత్రమే ఉన్నాయి. సైజు చిన్నదే అయినా సెలబ్రిటీలు ఉన్నందున మా ఎన్నికకు అత్యంత ప్రాచుర్యం లభించింది. నిత్యం వార్తలలో నిలిచారు. ప్రెస్ మీట్లు , విందులు వినోదాలతో ఎన్నికల ప్రచారం వేడెక్కింది. ఓట్ల చేర్పింపు , పోస్టల్ బ్యాలెట్స్ లపై కూడా ఫిర్యాదులు వచ్చాయి. చివరి క్షణం వరకు రెండు ప్యానల్స్ ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అందువల్ల రెండు ప్యానల్లో లో గెలుపు ధీమా కనపడుతుంది. ఫలితం తేలేవరకు ఉత్కంఠ కొనసాగనున్నది.

Related posts

రెండు ఆటం బాంబులు దొరికాయనుకున్నా: రాజమౌళి

Drukpadam

తెలుగు సినీ పరిశ్రమ కొన్ని కుటుంబాల చేతుల్లో బందీ అయింది: అమలాపాల్ సంచలన వ్యాఖ్యలు…

Drukpadam

తిరుపతిలో విలేకరుల సమావేశంలో గొడవపై దర్శకురాలు నందినిరెడ్డి క్లారిటీ!

Drukpadam

Leave a Comment