తుమ్మల , సండ్ర ల స్నేహం చిగురించేనా ?
మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు , సత్తుపల్లి శాసనసభ్యుడు సండ్ర వెంకటవీరయ్య లు స్నేహం చిగురించేనా? అనేది ఇప్పుడు జరుగుతున్న చర్చ . ఇరిద్దరు ఒకప్పుడు మంచి మిత్రులు ఒకరకంగా చెప్పాలంటే తుమ్మల వెంటకటవీరయ్య కు గురుసమానులు.తుమ్మల మంత్రిగా జిల్లాను తన కనుసైగలతో శాసిస్తున్నప్పుడు వెంకటవీరయ్య సిపిఎం తరుపున పాలేరు ఎమ్మెల్యే గా ఉన్నారు. అనేక సమస్యలపై జిల్లా మంత్రిగా ఉన్న తుమ్మలను తరుచు కలవటం జరిగేది. అప్పటినుంచి వారిమధ్య సంబంధాలు పెరిగాయి. తరువాత కాలంలో తుమ్మలతో ఉన్న సంబంధాలే వెంకటవీరయ్య ను తెలుగుదేశంలో చేరాలా చేశాయి. సండ్ర ఏది చెపితే తుమ్మల అది చేస్తారనే అభిప్రాయం ఏర్పడింది. అంతకుముందు జనరల్ గా ఉన్న సత్తుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం , ఎస్సీ రిజర్యాడ్ నియోజకవర్గం అయింది. దీంతో వెంకటవీరయ్య ను సత్తుపల్లి నుంచి పోటీచేయంచటంలో తుమ్మల పాత్ర ప్రధానమైంది. సత్తుపల్లి నుంచి నుంచి మూడు సార్లు తెలుగుదేశం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. నియోజవర్గం మీద పట్టు సాధించారు. తుమ్మల సహాయం లేకపోయినా గెలిచేంత పట్టు సాధించగలిగారు. ఎందుకో ఇద్దరి మధ్య చెడిపోయింది . కొంత కాలం శత్రువులుగా మారారు. ఒకరిపై ఒకరికి ద్యేషం పెరిగింది.ఒకరిపోడ ఒకరికి గిట్టకుండా ఉంది. సత్తుపల్లిలో వెంకటవీరయ్య కు సీటు కూడా రాకుండా చేయాలనీ తుమ్మల తనవంతు ప్రయత్నం చేశారని ప్రచారం సైతం జరిగింది. 2015 లో తుమ్మల టీఆర్ యస్ పార్టీలో చేరినప్పటికీ వెంకటవీరయ్య చేరలేదు . తాను తెలుగుదేశంతోనే నడిచారు. వెంకటవీరయ్య కు వ్యతిరేకంగా టీఆర్ యస్ అభ్యర్థి పిడమర్తి రవికి తుమ్మల ప్రచారం చేసినప్పటికీ టీఆర్ యస్ అభ్యర్థి గెలవలేదు. వెంకటవీరయ్య తెలుగుదేశం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ప్రస్తుతం ఇద్దరు టీఆర్ యస్ లోనే ఉన్నారు. మొదట్లో దూరంగా ఉన్న గురుశిష్యులు ఇప్పుడిప్పుడే దగ్గరౌతున్నారు. దగ్గర అవటమే కాకుండా రహస్య మంతనాలు సాగిస్తున్నారు.
తుమ్మల తనకు దూరంగా ఉన్నవారిని దగ్గరగా ఉన్నట్లు చెప్పేందుకు ఇలాంటి ఎత్తులు వేస్తుంటారని ఒక టాక్ . కానీ ఇటీవల కొద్దీ నెలలుగా వెంకటవీరయ్యతో కలిసి నడిచేందుకు తుమ్మల ఉత్సహం చూపుతున్నారు. కేంద్రం రైతు చట్టాలను రద్దు చేయాలనీ కోరుతూ డిసెంబర్ లో ఇచ్చిన బందులో తుమ్మల, వెంకటవీరయ్య లు కలిసి సత్తుపల్లి లో పాల్గొన్నారు. అంతకు ముందు కేటీఆర్ ఖమ్మం వచ్చినప్పుడు , ఎంపీ నామ నాగేశ్వరరావు ఇంట్లో సమావేశంలో సైతం తుమ్మల , వెంకటవీరయ్య , గాయత్రీ రవి కలిశారు. ఖమ్మం జిల్లాలో టీఆర్ యస్ నేతల మధ్య కోల్డ్ వార్ కాస్త బహిరంగ వార్ గా మారింది. దీనిపై కేటీఆర్ సున్నితమైన వార్నింగ్ ఇచ్చారు. మాజీ ఎంపీ, జిల్లా మంత్రి , తుమ్మల, వెంకటవీరయ్య లమధ్య నెలకొన్న మనస్పర్థలపై ఒకరిపై ఒకరు తరచూ ఫిర్యాదులు చేసుకుంటూనే ఉన్నారు. అయితే అందరి మాటలు వింటున్న కేటీఆర్ ఎవరిని మందలించటంలేదని దీనివల్ల పార్టీకి నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయనేది వినిపిస్తున్నమాట .