Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

షర్మిల పార్టీ కోసం వడివడిగా అడుగులు

షర్మిల పార్టీ కోసం వడివడిగా అడుగులు
-పలువురు నాయకులతో భేటీ
-సలహాదారులుగా ప్రముఖులు
-కుల సంఘాలు ,సామజిక ఉద్యమకారులతో రహస్య సమావేశాలు
వైయస్ షర్మిల తెలంగాణాలో పార్టీ ఏర్పాటు దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు. పలువురు నాయకులతో భేటీలు అవుతున్నారు. ఇప్పటికే ఆమె అనేక మంది ప్రముఖులను కలుసుకున్నారు. అన్ని కులాలు మతాల పెద్దలు సామజిక కార్యకర్తలు, ఉద్యమకారులతో ఆమె కలుస్తున్నారు. తన అభిప్రాయాలూ చెప్పటంతో పాటు వారి అభిప్రాయాలను తీసుకుంటున్నారు. అన్ని పార్టీలు ఆమె అడుగులపై ఆరా తీస్తున్నాయి. నల్లగొండ జిల్లాతో ప్రారంభమైన ఆమె ప్రయాణం మిగతా జిల్లాలపై ద్రుష్టి సారించారు. ఖమ్మం జిల్లా పర్యటన తాత్కాలికంగా వాయిదా వేసుకున్న ఆమె లోటస్ పాండ్ లో బిజీగా ఉంటున్నారు. నాయకుల కార్యకర్తల రాకతో నిత్యం అక్కడ కళకళలాడుతుంది. కొందరు పార్టీ పడతారా లేదా అనే సందేహాలు వ్యక్తం చేసినప్పటికీ చెక్కు చెదరని విశ్వాసంతో వ్యూహాత్మకంగా ఎత్తులు వేస్తున్నారు. ఆమె పార్టీ ఏర్పాటుపై విమర్శల కొనసాగుతున్నప్పటికీ వాటిని లెక్క చేయకుండా ఆమె తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. దీనిపై రకరకాల కామెంట్లు వచ్చినప్పటికీ ఎక్కడ వెనక్కు తగ్గడంలేదు. ఆమె పలువురు ప్రముఖులు , రాజకీయనాయకులతో చర్చలు జరుపుతున్నారు. ఆంధ్ర ఆమెకు, తెలంగాణతో పని ఏముందని వస్తున్న వార్తలు విమర్శలపై కూడా ఆమె అభిమానులు వివరణ ఇచ్చారు. ఆమె తెలంగాణ కోడలు అయినందున ఇక్కడ పార్టీ పెట్టడంలో ఎలాంటి తప్పులేదని అంటున్నారు .ఇటీవల కాలంవరకు ఏపీ ప్రభుత్వ సలహాదారుగా ఉన్న కె .రామచంద్రమూర్తి ఆమెతో చర్చలు జరిపారు. తరువాత కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ మారం రంగారెడ్డి ,రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ప్రభాకర్ రెడ్డి , ఐ పి ఎస్ అధికారి ఉదయసింహ , మోటివేషినల్ స్పీకర్ బ్రదర్ షఫీ ,ఎస్సీ ,ఎస్టీ సంఘాల నాయకులూ షర్మిలతో భేటీ అయ్యారు. ప్రభాకర్ రెడ్డి, ఉదయసింహ లను సలహాదారులుగా నియమించుకున్నట్లు సమాచారం. మరికొందరితో చర్చలు జరుపుతున్నారని తెలుస్తుంది. బ్రదర్ షఫీ షర్మిలతో చర్చల అనంతరం మీడియా తో మాట్లాడారు.
మార్పుకోసం షర్మిలతో–
తెలంగాణాలో మార్పుకోసం నేను సైతం అంటూ షర్మిలతో చేయి చేయి కలిపేందుకు సిద్దమైనట్లు మోటివేషినల్ స్పీకర్ బ్రదర్ షఫీ వెల్లడించారు. లోటస్ పాండ్ లో వైయస్ షర్మిలతో సమావేశం అయిన అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ తాను షర్మిలతో అనేక విషయాలు మాట్లాడానని తొందరలో శుభవార్త వింటారని అన్నారు. కొత్త పార్టీ లో తన పాత్ర గురుంచి షర్మిలతో పాటు ఇతర ముఖ్యలతో కూడా చర్చించానని అన్నారు. రాష్ట్రంలో రైతులు , యువత, విద్యార్థులు, అన్నివర్గాలవారు మార్పును కోరుకుంటున్నారని అన్నారు. తాను మార్పు కోసం ముందునుంచి గొంత్తెతుతున్నానని అన్నారు. వైయస్ ఆశయ సాధనకోసం ఆమె చేస్తున్న కృషికి అందరి సహకారం అవసరం అన్నారు. రాష్ట్రంలో మంచి నాయకత్వం పంచి ప్రభుత్వం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని గొప్పనాయకత్వంతో షర్మిల ముందుకొస్తున్నారని ఆయన అన్నారు. ఆమె మాటలలో దివంగత నేత రాజశేఖర్ రెడ్డి కనిపించారని అన్నారు. మనకోసం, మన ప్రాంత భవిషత్ కోసం , నిలబడే తరుణం వచ్చిందని అందుకు అందరం కలిసి నడవాలని అన్నారు.
పార్టీ ఎప్పుడు ప్రకటిస్తారు.
పార్టీని ఏప్రిల్ లేదా జూన్ ,జూలైలలో ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇందుకు ఆమె గట్టి కసరత్తే చేస్తున్నారు.పార్టీ పేరు, జెండా, రంగు , జెండాపై ఉండాల్సిన వాటిపై కూడా అధ్యనం చేసేందుకు ఒక ఏజెన్సీకి అప్పగించినట్లు ప్రచారం జరుగుతుంది.ముందుగా పార్టీలో కి వచ్చే ప్రముఖులు ,ఇతర సంఘాలు , స్వచ్చంద సంస్థలు, సామాజిక కార్యకర్తలు ఇలా ప్రతి విషయంలో అతి జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తున్నది.

Related posts

తిరుపతి రుయా ఆసుపత్రి వద్ద నిరసన … అడ్డుకున్న పోలీసులు…

Drukpadam

పవన్ కల్యాణ్ కు దమ్ముంటే బీజేపీ ఆఫీసు ముందు ప్లకార్డు పట్టుకోవాలి: అంబటి రాంబాబు కౌంటర్!

Drukpadam

అభివృద్ధి లేదు గాడిద గుడ్డు లేదంటూ బీఆర్ యస్ పార్టీకి 18 మంది గిరిజన సర్పంచులు గుడ్ బై! 

Drukpadam

Leave a Comment