దసరా మామూళ్లు వసూలు చేస్తే చర్యలు : డిఐజి రంగనాధ్!
ప్రజల నుండి పోలీస్ శాఖ సిబ్బంది, అధికారులు ఎవరైనా దసరా పండగ పేరుతో మామూళ్లు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని డిఐజి రంగనాధ్ తెలిపారు.
జిల్లాలోని పలు ప్రాంతాలలో పోలీస్ సిబ్బంది దసరా పండుగ పేరుతో మామూళ్లు వసూలు చేస్తున్నట్లుగా తన దృష్టికి వచ్చిందని ఆయన అన్నారు. ప్రజలు, వ్యాపారులు ఎవరూ దసరా మామూళ్లు ఇవ్వవద్దని, పోలీస్ శాఖకు సంబంధించి ఎవరైనా దసరా మామూళ్ల కోసం బలవంతం చేస్తే నేరుగా తన నెంబర్ 944079560౦ కు మేజెస్ ద్వారా సమాచారం ఇస్తే వారిపై చర్యలు తీసుకుంటాని స్పష్టం చేశారు. అదే విధంగా ఇతర ప్రభుత్వ శాఖలలో ఎక్కడైనా బలవంతంగా దసరా మామూళ్లు వసూలు చేస్తే సంబంధిత శాఖ అధికారులకు ఫిర్యాదు చేయడంతో పాటు తమ దృష్టికి తీసుకురావాలని ఆయన తెలిపారు. దసరా పండుగ పేరుతోనే కాక బలవంతపు వసూళ్లకు పాల్పడిన తమ దృష్టికి తీసుకువస్తే చర్యలు తీసుకుంటామని డిఐజి రంగనాధ్ తెలిపారు