Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఆర్కే మృతిపై కచ్చితమైన సమాచారం ఏది లేదు …ప్రొఫెసర్ హరగోపాల్…

ఆర్కే మృతిపై కచ్చితమైన సమాచారం ఏది లేదు …ప్రొఫెసర్ హరగోపాల్…
-టీవీలో చూస్తేనే తెలిసింది.. ఆర్కే మృతిపై తోడల్లుడు కల్యాణ్‌రావు
-ఆర్కేకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు
-మూడు నెలల క్రితమే ఆర్కేను రహస్యంగా కలిసిన భార్య
-తల్లిదండ్రులంటే ఆర్కేకు ఎంతో ఇష్టం
-ప్రభుత్వాలు అనుమతిస్తే అంత్యక్రియలు నిర్వహిస్తాం: సోదరుడు రాధేశ్యాం

మావోయిస్టు అగ్రనేత ఆర్కే మృతి చెందినట్లు వచ్చిన సమాచారం, వార్తలపై ప్రొఫెసర్ హరగోపాల్ స్పందించారు. టీవీ లలో ,మీడియా లో వస్తున్నా వార్తలను చూస్తున్నాం .ఇంతవరకు కచ్చితమైన సమాచారం ఏది లేదని అన్నారు. విరసం నేత కళ్యాణ్ రావు మాట్లాడుతూ ఆర్కే కు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని ,మూడు నెలల క్రితమే ఆయన భార్య వెళ్లి ఆర్కే ను కలిసిందని అన్నారు. అప్పుడు లేని ఆరోగ్య సమస్య ఇప్పుడు ఎలా వచ్చిందనే అనుమానం వ్యక్తం చేశారు. ఆర్కే మృతదేహాన్ని తమకు అప్పగిస్తే అంత్యక్రియలు చేసుకుంటామని ఆయన సోదరుడు రాధేశ్యాం తెలిపారు. ఆర్కే సౌత్ బస్టర్ లో మరణించినట్లు తెలుస్తుంది. ఆయనకు దీర్ఘ కాలం నుంచి ఆరోగ్య సమస్యలు ఉన్నాయని అందువల్లనే ఆయన మరణించారని ఛత్తీస్ ఘడ్ పోలీస్ వర్గాల భోగట్టా …

మావోయిస్టు పార్టీ అగ్రనేత ఆర్కే మృతి విషయమై ఆ పార్టీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదని, టీవీల్లో చూసి తెలుసుకున్నామని ఆయన తోడల్లుడు, విరసం నేత జి.కల్యాణ్‌రావు తెలిపారు. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం ఆలకూరపాడులో నిన్న విలేకరులతో మాట్లాడిన ఆయన.. ఆర్కేకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవన్నారు.

కాగా, ఆర్కే భార్య శిరీష మూడు నెలల క్రితం ఆయనను కలిసినట్టు సమాచారం. తల్లిదండ్రులు, సోదరులంటే ఆర్కేకు ఎంతో ఇష్టం. ఉద్యమం కోసం అడవులకు వెళ్లినా, వారిని చూసేందుకు రహస్యంగా మూడుసార్లు హైదరాబాద్ వచ్చినట్టు ఆయన సోదరుడు రాధేశ్యాం తెలిపారు. ప్రభుత్వాలు అవకాశమిస్తే ఆర్కే మృతదేహాన్ని తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. కాగా, ఆర్కే మృతిపై తమకు ఇప్పటి వరకు కచ్చితమైన సమాచారం ఏదీ లేదని ప్రొఫెసర్ హరగోపాల్ తెలిపారు.

Related posts

నేనింకా మరణించలేదు… మీకెందుకు అంత తొందర?: లోక్ సభ మాజీ స్పీకర్ సుమిత్రా మహాజన్

Drukpadam

జూనియర్ డాక్టర్లతో ప్రభుత్వం చర్చలు…

Drukpadam

షావోమీ ఏసీ.. 30 సెకండ్లలోనే గది అంతా కూల్!

Drukpadam

Leave a Comment