Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

జూనియర్ డాక్టర్లతో ప్రభుత్వం చర్చలు…

జూనియర్ డాక్టర్లతో ప్రభుత్వం చర్చలు…
-కరోనా సమయంలో సమ్మెకు దిగడం సరికాదు అన్న ప్రభుత్వం
-ఇలాంటి సమయాల్లో ప్రజల ఆరోగ్యానికే ప్రాధాన్యతను ఇవ్వాలి
-జూడాల న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరిస్తాం
-15 జూడాలకు శాతం వేతనం పెంచుతాం

ఆకస్మిక సమ్మెకు దిగిన జూనియర్ డాక్టర్లతో ప్రభుత్వం చర్చలు జరుపుతుంది .వైద్యవిధానపరిషత్ డైరక్టయిర్ రమేష్ రెడ్డి చర్చల్లో ప్రభుత్వం తరుపున పాల్గొన్నారు .అంతకు ముందు ముఖ్యమంత్రి కేసీఆర్ జూడాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా మహమ్మారి ఉద్ధృతంగా ఉన్న సమయంలో సమ్మెకు దిగడం సరికాదని అన్నారు. ఇలాంటి కీలక సమయాల్లో ప్రజల ఆరోగ్యానికే అధిక ప్రాధాన్యతను ఇవ్వాలని చెప్పారు. మంత్రి కేటీఆర్ కూడా జూనియర్ డాక్టర్ల విషయంలో స్పందించారు. జూడాలు సమ్మెకు దిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

జూనియర్ డాక్టర్ల న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరిస్తామని చెప్పారు. సీనియర్ రెసిడెంట్ల గౌరవ వేతనాన్ని 15 శాతం పెంచుతామని ప్రభుత్వం ప్రకటించింది . అంతేకాదు, కరోనా సేవల్లో ఉన్న వైద్య విద్యార్థులకు కూడా సీనియర్ రెసిడెంట్లకు ఇచ్చే గౌరవ వేతనమే ఇవ్వాలని ఆదేశించారు. ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువ స్టయిఫండ్ ను తెలంగాణ జూడాలకు ఇస్తామని తెలిపారు. కరోనా సమయంలో సమ్మె పేరుతో విధులను బహిష్కరించడం సరికాదని అన్నారు.

జూడాలకు బీజేపీ మద్దతు

జూడాలకు బీజేపీ మద్దతు కానీ కరోనా సమయంలో సమ్మె తగదని హితవు
తమ వేతనాలు పెంచాలని కోరుతూ ప్రభుత్వ జూనియర్ డాక్టర్లు చేస్తున్న సమ్మెకు తమ పార్టీ పూర్తీ మద్దతు ఇస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. అయితే కరోనా ఉదృతంగా ఉన్న ప్రస్తుత తరుణంలో సమ్మె తగదని హితవు పలికారు. జూడాల న్యాయమైన సమస్యల పరిస్కారం కోసం చేస్తున్న పోరాటానికి తమ మద్దతు ఉంటుందని తెలిపారు.

జూడాలకు మాజీ ఆరోగ్యశాఖ మంత్రి ఈటల మద్దతు

జూడాలకు మాజీ ఆరోగ్యశాఖ మంత్రి ఈటల మద్దతు
వారి డిమాండ్స్ న్యాయమైనవి తీర్చాల్సినవి
జూనియర్ డాక్టర్స్ చేస్తున్న సమ్మెకు మాజీ ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పందించారు. వారు ఆడుతున్న కోర్కెలు న్యాయమైనవి పరిష్కరించదగ్గవి .ప్రభుత్వం పరిష్కరానికి పూనుకోవాలి . వారు కోరేది కూడా 10 శాతం ఇంటెన్సివ్ , 15 శాతం వేతనంలో పెంపుదల , నిమ్స్ లో కరోనా భారిన పడిన వైద్యలకు సిబ్బందికి చికిత్స అని అన్నారు.

 

Related posts

వారణాసిలో మోదీపై పూల వ‌ర్షం…

Drukpadam

Tech News | This Is Everything Google Knows About You

Drukpadam

కొండెక్కిన కోడి మాంసం…

Drukpadam

Leave a Comment