Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

మంచు తో కప్పు బడ్డ కెనడా

మంచు తో కప్పు బడ్డ కెనడా

  • 0 నుంచి మైనస్ 19 డిగ్రీ ల వరకు పడిపోతున్న ఉష్ణో గ్రతలు
    -క్యూబెక్ ప్రాంతంలో అత్యధికం మైనస్ -19
    -జనజీవనం అస్తవ్యస్తం

ఉత్తర అమెరికాలోని అతిశీతల దేశంగా కెనడా రికార్డులకు వెక్కింది. అమెరికాలోని కొన్ని ప్రాంతాలలో మాత్రమే మంచు ప్రభావం ఉంటుండగా కెనడా దేశం అంతా మంచు కురుస్తూనే ఉంటుంది. ప్రత్యేకించి ఇది గ్లోబ్ కు ఉత్తర భాగంలో ఉన్నందున మంచు ప్రభావం అధికంగా ఉంటుంది. దేశంలోని 7 రాష్ట్రాలు 3 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉండగా అన్నిటిలో మంచు అధికంగానే కురుస్తుంది. ముఖ్యముగా క్యూబెక్ ,విన్నిపెగ్ , ఒంటారియో,లాంటి ప్రాంతాలలో చలిని తట్టుకోవటం కష్టంగా ఉంటుంది. ఫిబ్రవరి నెలలో మొత్తం ఎక్కడ చూసినా మంచు దిబ్బలే దర్శనమిస్తాయి. ఇక్కడ ఉష్ణో గ్రత మైనస్ డిగ్రీలలోకి పోతుంది.ప్రస్తుతం కొన్ని ప్రాంతాలలో మైనస్ 19 వరకు నమోదౌతుంది. అప్పుడప్పుడు విద్యుత్ అంతరం ఏర్పడుతుంది.విద్యుత్ సమస్య వచ్చినప్పుడు ఇక్కడ నివసించే వాళ్ల భాదలు వర్ణనాతీతం . 2013 లో టొరంటో నగరంలోని కొన్ని ప్రాంతాలలో విధ్యుత్ నిలిచి పోయి పడ్డ కష్టాలను ఇక్కడ నివసించే భారతీయలు చెబుతుంటారు. ఈ సందర్భంగా వేడినీళ్లు రావు. ఇంటర్ నెట్ ఉండదు. చలికి ఇళ్లలో ఉపయోగించే హీటర్లు పనిచేయవు. అలంటి కష్టాలు పగవాడికి కూడా రాకూడదని కోరుకొంటాం అంటారు. కెనడాలో అత్యంత రద్దీగా ఉండే టొరంటో లో 30 లక్షల మంది జనాభా నివసిస్తుండగా గ్రేటర్ టొరంటో లో పరిధిలో 60 లక్షల మంది ఉన్నారని అంచనా . ఎక్కువగా పరిశ్రమలు ఇక్కడే ఉన్నాయి. ప్రపంచంలోని అన్ని దేశాలనుంచి వచ్చినవారు ఇక్కడ ఉన్నారు. ఎక్కడ చూసినా మంచు తో కప్పబడిన దిబ్బలే దర్శనం విస్తుంటాయి. రోడ్లు , ప్లే గ్రౌండ్లు , ఇతర మైదాన ప్రాంతాలు ,చివరకు లేకులు సైతం మంచు తో నిండి గడ్డకట్టి దానిపై ఆటలాడటం ఇక్కడ వారికీ సరదాగా మారింది. ఒకటి రెండు సందర్భాలలో నయాగరా సైతం గడ్డ కట్టినట్లు చెబుతుంటారు.

చలికాలం వచ్చిందంటే నిత్యం రద్దీగా ఉండే వీధులన్నీ నిర్మానుష్యంగా దర్శనం విస్తుంటాయి. ఇక ఇళ్ల ముందు పెట్టిన వాహనాలు ముంచుకు రోజు నిండిపోతాయి. వాటిని క్లిన్ చేసుకోటం నిత్యకృత్యం . వాహనాల టైర్లు , చలికాలం కోసం ప్రత్యేకంగా ఉంటాయి. వాటిని చలికాలం రాగానే మార్చుకుంటారు. ఇళ్లముందు మంచు తీసుకోవటం ఫిబ్రవరిలో రోజువారీ కార్యక్రమమే . ఇక ఈ సారి కోవిద్ వల్ల ఇళ్ల నుంచి బయటకు వెళ్ళటం పై నిషేధాలు ఉన్నాయి. బయటకు వెళ్లాలంటే నిత్యావసర వస్తువులు ,మెడికల్ ఎమర్జెన్సీ , ఉండాలి . 10 కి. మీ దాటి ప్రయాణం చేయరాదు. బస్సు సర్వీస్ లు ఉన్నా ఎవరు ఎక్కటం లేదు. కొన్ని పెద్ద పెద్ద మాల్స్ మాత్రమే తెరుస్తుందున వాటి గిరాకీ మూడుపువ్వులు ఆరుకాయలుగా ఉంది. వాటిలోకి ప్రవేశించటం కోసం మాస్క్ తప్పని సరి. పెద్ద పెద్ద క్యూ లైన్లు ఉంటాయి. ఇక చలి ఉంటె క్యూలైన్లలో నిలుచోవటం ఇబ్బందికరమే . ఇక కురుస్తున్న ముంచును రోడ్లపై క్లిన్ చేసేందుకు వాహనాలు ఉంటాయి .అవి ఎప్పటికప్పుడు మంచు తొలగిస్తూ, తిరిగి వెంటనే మంచు ఏర్పడకుండా ఉప్పు చల్లుతుంటాయి. ఈ ఉప్పు,ఇసుకను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటారు. ఇది స్థానిక పరిపాలన ద్వారానే జరుగుతుంది. మొత్తం మీద చలిని తట్టుకుని జీవించటం ఇక్కడ అలవాటుగా మారింది.

Related posts

చీరకట్టుకున్న వారికి అనుమతి లేదన్న రెస్టారెంట్ మూసివేత!

Drukpadam

న్యూయార్క్ స్కూళ్లకు దీపావళి సెలవు….

Drukpadam

సుప్రీం జడ్జిల నియామకాల వార్తలపై సీజేఐ రమణ అసహనం!

Drukpadam

Leave a Comment