మోహన్ బాబుకు చిరంజీవి ఫోన్….
“మా” ఎన్నికల్లో తాను ఎవరికీ మద్దతు ఇవ్వలేదు:చిరంజీవి
అకారణంగా తన పేరు బయటికి వచ్చిందని వెల్లడి
మోహన్ బాబు తో తమ స్నేహబంధం ఎప్పటిలాగానే కొనసాగుతుందని వెల్లడి
ఇటీవల ముగిసిన ‘మా’ ఎన్నికలు
తీవ్ర స్పర్ధలతో ఎన్నికలు
ప్రకాశ్ రాజ్ కే చిరు మద్దతు అంటూ ప్రచారం
తాను ఎవరికీ మద్దతు ఇవ్వలేదన్న చిరంజీవి
“మా ” ఎన్నికల సందర్భంగా తెలుగు సినీ పరిశ్రమ రెండుగా చీలిపోయింది. తెలుగు పరిశ్రమకంటే కూడా మెగా ఫ్యామిలీ , మంచు ఫ్యామిలీల మధ్య వార్ లా ఎన్నికల యుద్ధం నడిచింది. చివరకు మంచి ఫ్యామిలీ విజయం సాధించింది. ఎన్నికలు అయిపోయి ఫలితాలు వచ్చిన తరువాత కూడా మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. తెలుగు సినీ పరిశ్రమలో కొనసాగుతున్న మాటల యుద్ధం కు ముగింపు పలకాలని అందరివాడుగా భావిస్తున్న మెగాస్టార్ చిరంజీవి రంగంలోకి దిగారు. ఎన్నికల్లో తాను ప్రకాష్ రాజ్ కు మద్దతు ఇచ్చేనని ప్రచారాన్ని ఖండించారు. అంతేకాదు .తాను ఎవరికి మద్దతు ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఇందుకు నేరుగా మోహన్ బాబుకే చిరంజీవి ఫోన్ చేయడం విశేషం . దీంతో చిరంజీవి ఒకరికి మద్దతు ఇచ్చారనే ప్రచారాన్ని కొట్టి పారేయడంతోపాటు చిత్ర పరిశ్రమలో ఆరోగ్యకరమైన వాతావరణం కావాలని ఆయన కోరుకుంటున్నారు. దీనికి మోహన్ బాబు నుంచి కూడా సానుకూలత వ్యక్తం అయినట్లు సమాచారం . దీనిపై చిత్రపరిశ్రమలో పలువురు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
“మా” ఎన్నికల్లో తాను ఎవరికీ మద్దతు ఇవ్వలేదని ఆకారణంగా తన పేరు బయటకు వచ్చిందని చిరంజీవి మోహన్ బాబుకు స్పష్టం చేశారు.
ఇటీవల ముగిసిన ‘మా’ ఎన్నికల నేపథ్యంలో నటుడు మోహన్ బాబుకు మెగాస్టార్ చిరంజీవి తాజాగా ఫోన్ చేశారు. మా ఎన్నికల్లో తాను ఎవరికీ మద్దతు తెలపలేదని స్పష్టం చేశారు. తన ప్రమేయం లేకుండానే తన పేరు బయటికి వచ్చిందని వివరణ ఇచ్చారు. మోహన్ బాబుతో ఎప్పటిలాగానే తన స్నేహబంధం కొనసాగుతుందని చిరంజీవి స్పష్టం చేశారు.
చిరంజీవి ఫోన్ కాల్ కు మోహన్ బాబు స్నేహపూర్వకంగా స్పందించారు. అందరం కలసికట్టుగా ఉండాలన్నదే తన అభిప్రాయమని చిరంజీవికి తెలిపారు. ఈ సందర్భంగా వీరిరువురు ‘మా’ ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న ఇతర పరిణామాలపైనా చర్చించుకున్నారు.
ఇటీవల ‘మా’ ఎన్నికల సమయంలో టాలీవుడ్ లో మోహన్ బాబు ఫ్యామిలీ ఒకవైపు, మెగా ఫ్యామిలీ మరోవైపు అన్నట్టుగా పరిస్థితి తయారైంది. ప్రకాశ్ రాజ్ కు తమ కుటుంబం మద్దతు ఇస్తుందని నాగబాబు పేర్కొన్నారు. ఈ క్రమంలో చిరంజీవి కూడా ప్రకాశ్ రాజ్ కే మద్దతుగా నిలిచారన్న ప్రచారం జరిగింది. అయితే ఆ ప్రచారంలో నిజంలేదని నేడు చిరంజీవి ఖండించారు.