Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

మాగుండెల నిండా చంద్రబాబే ఉన్నారు :కేశినేని పై తప్పదు ప్రచారం టీడీపీ నేత ఫతావుల్లా!

మాగుండెల నిండా చంద్రబాబే ఉన్నారు :కేశినేని పై తప్పదు ప్రచారం టీడీపీ నేత ఫతావుల్లా!
బీజేపీ మునిగిపోయే నావ
-కేశినేని కార్యాలయం బయట ఉన్న 40 అడుగుల చంద్రబాబు ఫొటోను చూడాలని హితవు
-కార్యాలయంలో రతన్ టాటా ఫొటోను పెట్టడంపై వివరణ
-2024 ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ కొడతారని ధీమా

టీడీపీ కి విజయవాడ ఎంపీ కేశినేని నాని కార్యాలయంలో చంద్రబాబు ఫోటో తొలగించి దాని స్థానంలో రతన్ టాటా తో కేశినేని కలిసి ఉన్న ఫోటో పెట్టడం పెద్ద రాజకీయదుమారాన్ని లేపింది. ఇందుకు కారణం లేక పోలేదు… నిన్నమొన్నటివరకు కేశినేని కార్యాలయంలో ఉన్న చంద్రబాబు ఫోటో తొలగించి ఆ స్థానంలో వేరే ఫోటో పెట్టడం నిజంగా ఆశ్చర్యం కలిగించే అంశమే …దాన్ని సమర్థించుకోవడం కోసం కేశినేని అనుచరుడు ఫతావుల్లా స్పందించారు.

విజయవాడ ఎంపీ, టీడీపీ నాయకుడు కేశినేని నాని బీజేపీలో చేరబోతున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై ఆయన సన్నిహితుడు, టీడీపీ నేత ఫతావుల్లా స్పందించారు. కేశినేని భవన్‌లో నిన్న విలేకరులతో మాట్లాడిన ఆయన.. నాని టీడీపీని వీడుతున్నట్టు వస్తున్న వార్తలను కొట్టిపడేశారు. ఆయన పార్టీ మారుతున్నారంటూ ప్రచారం చేస్తున్న వారు కార్యాలయం బయట ఉన్న 40 అడుగుల ఎత్తైన చంద్రబాబు ఫొటోను చూడాలని హితవు పలికారు.

ఇక కేశినేని భవన్‌లో ఒక చోట మాత్రమే రతన్‌టాటాతో కలిసి ఉన్న నాని ఫొటోను పెట్టారని అన్నారు. టాటా ట్రస్ట్ ద్వారా విజయవాడ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో రతన్‌టాటా విస్తృతంగా సేవలు అందించారని, అందుకు కృతజ్ఞతగానే ఆయన ఫొటోను పెట్టారని వివరించారు. అంతే తప్ప పార్టీ మార్పు ఉద్దేశం నానికి లేదని అన్నారు.

విజయవాడ లోక్‌సభ స్థానం పరిధిలోని శాసనసభ స్థానాలకు పార్టీ ఇన్‌చార్జులుగా ఉన్న నాయకుల ఫొటోలను కూడా తొలగించారన్న ప్రచారం కరెక్ట్ కాదన్నారు. రాష్ట్రానికి చంద్రబాబు నాయకత్వం ఎంతో అవసరమని, ఆ ఉద్దేశంతోనే నాని పనిచేస్తున్నారని వివరించారు. బీజేపీని మునిగిపోయే నావలా అభివర్ణించారు. వచ్చే ఎన్నికల్లోనూ పోటీచేసి నాని హ్యాట్రిక్ సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు.

Related posts

రాహుల్ గాంధీ వర్చువల్ ర్యాలీకి ఆదరణ.. లైవ్ ద్వారా 11 లక్షల మంది వీక్షణ!

Drukpadam

కాంగ్రెస్ నేత కౌశిక్ రెడ్డి టీఆర్ యస్ లో చేరనున్నారా ?

Drukpadam

గెహ్లాట్ తీరుపై కాంగ్రెస్ అధిష్ఠానం అసంతృప్తి!

Drukpadam

Leave a Comment