Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

రైతుల ఉసురు తీస్తున్న మోడీ…సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు !

రైతుల ఉసురు తీస్తున్న మోడీ…
రైతులను కార్లతో తొక్కించి కర్కశంగా హత్య చేస్తున్న పాలకులు
కమ్యూనిస్ట్ లు బలహీన పడటం పీడిత ఉద్యమాలకు నష్టం
కమ్యూనిస్టులు బలపడతారు
వాగ్దానాలను విస్మరించి ప్రజలను వంచిస్తున్న పాలకులు  
సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు 

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతుల ఉసురు తగలడం ఖాయమని సిపిఎం జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావు కేంద్ర రైతు వ్యతిరేక విధానాలపై ధ్వజమెత్తారు. మంగళవారం ఖమ్మం మంచికంటి భవనంలో ఖమ్మం అర్బన్ మండలం 8వ మహాసభ ఎర్రబోయిన ఉపేందర్ గుర్రం కృష్ణయ్య గద్దల రత్తమ్మ మొక్కపాటి నాగమణి  అధ్యక్షతన జరిగింది ఈ మహాసభలో ఆయన మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తీసుకు వచ్చి వ్యవసాయ రంగాన్ని అంబానీ  అదానీలకు కట్టబెట్టాలని చూస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు 10 నెలలుగా ఢిల్లీ సరిహద్దులలో రైతులు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతుంటే కేంద్ర మొద్దు నిద్రపోతుందని విమర్శించారు. పైగా అధికార మత్తులో ఉన్న మంత్రులు కార్లు వెక్కించి తొక్కించి రైతులను చంపుతున్నారని విచారం వ్యక్తం చేశారు. ప్రతి ఏటా కోటి ఉద్యోగాలు ఇస్తామని పరిశ్రమలు నెలకొల్పి ఉద్యోగ భద్రత కల్పిస్తామని నల్ల డబ్బు వెలికి తీస్తామని అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం ఒక్క హామీ నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ సంస్థలన్నింటినీ కారుచౌకగా కార్పొరేట్ శక్తులకు అమ్ముతున్నారని ఇప్పటికే అనేక పరిశ్రమలను అమ్మిన కేంద్రం మరికొన్నిటిని అమ్మేసేందుకు సన్నాహాలు చేస్తుందని దుయ్యబట్టారు. అందువల్ల ప్రజల్లో మోడీ పాలనపట్ల భ్రమలు తొలిగిపోయాయని బిజెపికి వ్యతిరేక పవనాలు మొదలయ్యాయని అన్నారు. రాబోయే ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లో చిత్తుచిత్తుగా ప్రజలు ఓడించటం ఖాయమన్నారు మతోన్మాదాన్ని సృష్టిస్తూ అధికారం వెళ్లబుచ్చుతున్న బిజెపి ఆర్ ఎస్ ఎస్ విధానాల పట్ల ప్రజలు అర్థం చేసుకుంటున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో దోపిడి పాలన కొనసాగుతుందని నరేంద్ర మోడీ  కేసీఆర్ ఇద్దరు సంపన్న వర్గాలకు ఊడిగం చేస్తున్నారని విమర్శించారు . కమ్యూనిస్ట్ ఉద్యమం బలహీనపడ్డ మాట నిజం అయితే దానివల్ల పీడిత తాడిత ఉద్యమాలకు నష్టం జరిగింది. ప్రజల్లో కమ్యూనిస్టులు బలపడాలనే కోరిక పెరిగింది.ప్రజలు ఎర్రజెండా వైపు చూస్తున్నారు.   దేశ వ్యాప్తంగా కమ్యూనిస్టులు బలపడుతున్నారన్నారు . భవిష్యత్తులో ప్రత్యామ్నాయం కమ్యూనిస్టులే అన్నారు. తొలుత మహాసభ జెండా ను సీనియర్  గద్దల పెంటయ్య ఆవిష్కరించారు.   ఈ మహాసభలో రాష్ట్ర కమిటీ సభ్యులు ఎర్ర శ్రీకాంత్, జిల్లా కమిటీ సభ్యులు ఎర్ర శ్రీనివాసరావు, టిి. విష్ణు వర్ధన్,  మెరుగు సత్యనారాయణ, టి. లింగయ్య,  నాయకులు ముదాం శ్రీనివాసరావు, భూక్య శ్రీను,  ఎస్ కె నాగులు మీరా, ముమ్మడి పుష్పవతి,  పద్మ తదితరులు పాల్గొన్నారు

Related posts

పోతిరెడ్డిపాడు లిఫ్ట్ పై చంద్రబాబు వైఖరేంటో స్పష్టం చేయాలి: సజ్జల…

Drukpadam

విశాఖ రాజధాని ప్రాంతం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి …

Drukpadam

మోదీకి నితీశ్ పాదాభివంద‌నం!.. తప్పేముంద‌న్న జేడీయూ!

Drukpadam

Leave a Comment